Waste Paper Led to arrest of indian couple in chicago చికాగో సెక్స్ రాకెట్: చిత్తు కాయితంలో ఆ వివరాలు ఏంటీ.?

A piece of waste paper led to kishan and his wife arrest

high profile sex racket in Chicago, tollywood actress high profile sex racket, waste paper, Kishan Modugumudi, Vibha Jayam, Chennupati, Tollywood actresses, anchors, temporary visas, Belmont Cragin, chicago, US, America

In a major expose, a Chicago-based couple of Indian descent have been arrested with a small piece of waste paper led to turned as key proof in running a high-end racket.

చికాగో సెక్స్ రాకెట్: చిత్తు కాయితంలో ఆ వివరాలు ఏంటీ.?

Posted: 06/18/2018 11:39 AM IST
A piece of waste paper led to kishan and his wife arrest

అగ్రరాజ్యంలోని చికాగోలో భారతీయుల పరుపు తీసిన టాలీవుడ్ నిర్మాత మోదుగుమూడి కిషన్, ఆతని భార్య చంద్రకళలను అక్కడి అధికారులు అరెస్టు చేయడంలో చిన్న చిత్తుకాయితమే కీలక అధారంగా మారింది. దేశం కాని దేశానికి వలసవెళ్లినా.. అక్కడ కూడా తమ నీచపు పనులు చేసి వారికే కాకుండా యావత్ దేశానికి కూడా అపత్రిష్టపాలు చేసిన కిషన్ దంపతులను  ఓ చిత్తు కాగితం అత్యంత కీలకంగా మారి మొత్తం వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. టాలీవుడ్ పరిశ్రమకు చెందిన పలువురు నటీమణులను అక్కడకు రప్పించుకుని వారిచేత బలవంతంగా వ్యభిచారం చేయించిన వీరి భాగోతం బయటపెట్టిన చిత్తు కాయితంలో ఏముంది.

టాలీవుడ్ లో కలకలం రేపుతున్న కిషన్, చంద్రకళ దంపతులను ఫిబ్రవరి మాసంలో వీసా గడువు తీరినా అక్రమంగా అమెరికాలో వుంటున్నారని బార్డర్ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన తరువాత వారు నెల రోజులకు బెయిల్ పై విడుదలయ్యారు. అయితే వారి అరెస్టు నేపథ్యంలో అధికారులకు లభించిన చిన్న చిత్తు కాయితంలో ఉన్న వివరాలను చూసిన పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో అకస్మాత్తుగా వారి నివాసాన్ని అధికారులు తనిఖీలు చేయడంతో మోదుగుమూడి కిషన్, చంద్రకళల హై ఫ్రోఫైల్ సెక్స్ దందా భండారం కాస్తా బయటపడింది. ఇక అదే క్రమంలో ఓ అర్టిస్టు పంపిన లేఖ కూడా లభ్యంకావడంతో ఇక అధికారులు వారిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు.

గురువారం నాడు కిషన్ దంపతులను ఇల్లినాయిస్ కోర్టులో ప్రవేశపెట్టి, అభియోగాలపై విచారణను ప్రారంభించనున్నామని, ఆపై నెల రోజుల వ్యవధిలోగా కేసు కొలిక్కి వస్తుందని విచారిస్తున్న అధికారులు తెలిపారు. వారు చేసిన నేరాలపై కీలక ఆధారాల కోసం చూస్తున్నామని, అవి లభిస్తే, విచారణ సులువవుతుందని, శిక్ష పడితే మాత్రం అది పూర్తయిన తరువాత వారిని దేశం నుంచి పంపిస్తామని తెలిపారు. ప్రస్తుతం వ్యభిచార దందాలో ఆరుగురి పేర్లు బయటకు వచ్చాయని, వీరిని సాక్షులుగా పేర్కొంటామని చెప్పిన అధికారులు, కిషన్ దంపతుల ఫోన్లను విశ్లేషిస్తున్నామని, ఈ దందాలో మరింత మంది ప్రమేయం ఉండవచ్చని అన్నారు.

వాస్తవానికి ఈ సంవత్సరం జనవరిలో కిషన్ దంపతులను యునైటెడ్ స్టేట్స్ బోర్డర్ పెట్రోల్ సిబ్బంది, అక్రమంగా నివసిస్తున్న ఆరోపణలపై అరెస్ట్ చేయగా, ఫిబ్రవరి 23న వారు బయటకు వచ్చారు. వారిని అరెస్ట్ చేసిన సమయంలో వారి నుంచి అధికారులు కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకోగా, అందులో మారియట్ హోటల్ లెటర్ హెడ్ తో ఉన్న పేపర్ ఒకటి ఉంది. దానిలో చేత్తో రాసిన కొన్ని అక్షరాలు ఉన్నాయి. హీరోయిన్ ల పేర్లు, తేదీలు, రూమ్ నంబర్ లు ఉన్నాయి. వాటిని చూసిన అధికారులకు, ఈ వివరాలు వ్యభిచారానికి సంబంధించినవేనన్న అనుమానం వచ్చింది. ఆపై కోర్టు అనుమతితో కిషన్ ఇంట్లో సెర్చ్ చేయగా, డబ్బు లావాదేవీలకు సంబంధించిన వివరాలున్న డైరీలు, అనేక పాకెట్లు వున్న ఓ లెదర్ బ్యాగులో భారీ ఎత్తున కండోమ్స్ లభించాయి. వీటిని చూసిన తరువాతే అధికారులు అన్ని ఎయిర్ పోర్టులనూ అలర్ట్ చేసి, అమెరికాలో కాలు పెడుతున్న ప్రతి టాలీవుడ్ హీరోయిన్ నూ గుచ్చి గుచ్చి ప్రశ్నించడం ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles