9 yr old girl jumps into well to save little sister చెల్లిని రక్షించుకున్న సాహస బాలిక..

9 year old brave girl jumps into well to save little sister

little girl brave step to save sister, brave girl rescued sister safely, Girl jumps into well to rescue sister, Nine-year-old girl jumps into well, Jhilly Bagh, Reetanjali Bagarti, Milly, Laxmicharan Bagh, Kendumunda village, Badabhainra panchayat, Subarnapur district, odisha

A 9-year-old girl Jili saved her 3-year-old sister Mili who fell in well while playing. Without waiting for someone to rescue Mili, Jili jumped into the well and took her sister out from the water.

ITEMVIDEOS: చెల్లిని రక్షించుకున్న సాహస బాలిక..

Posted: 06/18/2018 10:46 AM IST
9 year old brave girl jumps into well to save little sister

ఇంటిముందు అడుకుంటూ ప్రమాదవశాత్తు బావిలో పడిన మూడేళ్ల చిన్నారిని కపాడేందుకు మరో అలోచనలేకుండా బావిలోకి దూకింది అక్క. అదే అమెను స్థానికంగా సాహస బాలికలా గుర్తింపును తీసుకురావడంతో పాటు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ అక్క వయస్సు ఎంత అంటారా.? తొమ్మిదేళ్లు మాత్రమే. తన చెల్లి బావిలో పడగానే కాపాడండి .. కాపాడండి అని అరస్తూ.. సాయం కోసం అర్థించడానికి బదులు ఆ చిన్నారే.. తన సోదరిని కాపాడుకునేందుకు నడుం బిగించింది.

వయస్సులో చిన్నదైన ... సమయానికి చురుకుగా స్పందించింది. క్లిష్ట సమయంలో బుద్ధిబలంతో పాటు భుజబలం ఉపయోగించి సోదరిని రక్షించుకుంది. బావిలో పడిన సోదరిని కాపాడుకునేందుకు అపూర్వ సాహసమే చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రంలోని సుబర్నపూర్ జిల్లాకేంద్రానికి ఏడు కిలోమీటర్ల దూరంలో వున్న కెండుముండా గ్రామంలో లక్ష్మీచరణ్ బాగ్ అనే వ్యక్తికి ఇద్దరు కూతుళ్లు వున్నారు. వారి ఇంటికి చేరువలోనే చేదుడు బావి వుంది. అయితే అతను పనులు నిమిత్తం పొలానికి వెళ్లగా, తల్లి ఇంటిపనుల్లో నిమగ్నమైంది.

ఇంటి ముందు తన ఇద్దరు పిల్లలు జిల్లి బాగ్, తన స్నేహితురాలైన రీతాంజలి బాగర్తితో అడుకుంటుంది. తన సోదరి కూడా అక్క వద్దకు వచ్చి అడుకుంటూ పక్కనే వున్న బావిలో ప్రమాదవశాత్తు పడిపోయింది. తన స్నేహితురాలికి విషయాన్ని తన తల్లిదండ్రులకు చేరవేయాలని చెప్పిన జిల్లీ.. వెంటనే బావిలో దూకి.. తనను కూడా కప్పేస్తున్న నీళ్లతో పోరాడుతూనే తన చెల్లిని అదిమిపట్టుకుని చేదుడు బావిలో వున్న తాడును పట్టుకుని వేలాడింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు బావిలోంచి అక్కచెలెళ్లను బయటకు తీసుకువచ్చారు. దీంతో జిల్లి ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jhilly Bagh  Milly  Laxmicharan Bagh  well  Kendumunda village  Subarnapur district  odisha  

Other Articles