Chaddi gang hulchul In sangareddy సంగారెడ్డిలో చెడ్డీగ్యాంగ్.. భయాందోళనలో స్థానికులు..

Chaddi gang thieves flee by seeing cctv cameras in sangareddy

Cheddi gang hulchul In sangareddy, cheddi gang in pothireddypally, cheddi gang in Nizampet, Cheddi gang, Cheddi gang robbers, Cheddi gang in bandari layout, Cheddi gang in nizampet, Cheddi gang in hyderabad, Cheddi gang in telangana, thieves, cctv cameras, bandari layout, nizampet, hyderabad, cyberabad police, telangana, crime

After an failed attempted to break into houses in an apartment, at Bandari layout in Nizampet, Chaddi gang robbers create hulchul in pothireddypally of sangareddy district.

సంగారెడ్డిలో చెడ్డీగ్యాంగ్.. దొంగతనం చేయనివ్వని సీసీటీవీలు

Posted: 06/13/2018 02:49 PM IST
Chaddi gang thieves flee by seeing cctv cameras in sangareddy

తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తూ ఇందుగలరు అందులేరన్న సందేహము లేకుండా ఎక్కడ సిసిటీవీ ఫూటేజీలు పరిశీలించినా.. అందందు కనబడే వారే  చెడ్డీ గ్యాంగ్ దొంగలు అన్నట్లుగా తమ ఉనికి చాటుకుంటూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. హైదరాబాద్, కర్నూలు పట్టణంలో సంచలనం సృష్టించిన చెడ్డీ గ్యాంగ్ మరోమారు వార్తల్లోకి వచ్చింది. మంగళవారం రాత్రి సంగారెడ్డి పట్టణంలో చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపింది. అపార్టుమెంట్లు టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్న ఈ ముఠా.. అక్కడ కూడా తమను గుర్తించే శత్రువులున్నారని పారిపోయింది.

వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, సంగారెడ్డి రూరల్ పోలిస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోని పోతిరెడ్డిపల్లిలో తమ ఉనికి చాటుకునేందుకు వచ్చిన చెడ్డీ గ్యాంగ్ దొంగలు.. స్థానికంగా వున్న శ్రీనిలయం అపార్టుమెంటులో దొంగతనానికి ప్రయత్నించి విఫలమైంది. ఆ దృశ్యాలు అపార్టుమెంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. మూడు అపార్టుమెంట్లలో దొంగతనానికి ప్రయత్నించిన చెడ్డీ గ్యాంగ్.. సీసీ కెమెరాలు ఉండటంతోనే అక్కడి నుంచి జారుకున్నట్లు స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

సరిగ్గా రెండు రోజలు క్రితం అనగా జూన్ 10న హైదరాబాద్ లోని నిజాంపేటలో కలకలం రేపిన ఈ గ్యాంగ్.. నిజాంపేట గ్రామంలోని బండారీ లేఅవుట్ కాలనీ రోడ్డు నెంబర్ 5లోని శ్రీరామ నిలయం అపార్టుమెంటులోకి దొంగతనానికి పాల్పడేందుకు యత్నించింది. కాగా, అక్కడ కూడా తమకు ఎదురుగా సీసీ కెమెరాలు కనిపించడంతో భయంతో వెంటనే పారిపోయారు. వాచ్ మెన్ గదిలో వుండగానే అతని గది బయల గడియపెట్టడంతోనే చెడ్డీ గ్యాంగ్ ఇంకా నగరంలోనే సంచరిస్తున్నారన్న అనుమానాలు బలపడ్డాయి. అయితే పోలీసులు ఇలా అలోచిస్తారనే వారు సంగారెడ్డి వైపుకు పయనమయినట్లు తెలుస్తుంది.

ఇక అంతకుముందు గత నెల 21న తెల్లవారుజామున జీడిమెట్ల పీఎస్‌ పరిధి గాజులరామారంలోని ఓ అపార్టుమెంటులో తచ్చాడిన చడ్డీ గ్యాంగ్‌ అనంతరం దుండిగల్‌ పీఎస్‌ పరిధిలోని శ్రీరాంనగర్లో ఓ అపార్టుమెంట్లోకి వెళ్లింది. అదే అపార్టుమెంట్లో నివసిస్తున్న జీడిమెట్ల కానిస్టేబుల్‌ ఆంజనేయులు అప్పుడే విధులు ముగించుకుని ఇంటికిరావడంతో చెడ్డీ గ్యాంగ్ ను అడ్డుకునే ప్రయత్నం చేయగా, అతన్ని గాయపరిచిన దొంగలు పారిపోయారు. దుండిగల్‌ పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై కేసు నమోదు కాగా.. ఇప్పటివరకూ ఎలాంటి పురోగతి లేదు. మరి వీళ్ల అటను ఇంకెన్నాళ్లు కట్టిస్తారో పోలీసులకే తెలియాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cheddi gang  thieves  cctv cameras  pothireddypally  sangareddy  telangana  crime  

Other Articles