VHP members vandalise Taj Mahal's west gate తాజ్ మహల్ ద్వారం ధ్వంసం.. వీహెచ్పీ నేతలపై కేసు

Vhp members vandalise gate at taj mahal say it was blocking path to a temple

VHP activists, Taj Mahal, ASI, Ravi Dubey, sixth wonder of the world, heritage monument, Agra, Vishwa Hindu Parishad,Taj Mahal security,taj mahal,Siddheshwar Mahadev temple committee,prabhat kumar, Uttar Pradesh

Members of the VHP protested outside the Taj Mahal in Agra, claiming that a gate installed at the western entrance to the monument blocked the path to a 400-year-old temple nearby.

తాజ్ మహల్ పశ్చిమ ద్వారం ధ్వంసం.. వీహెచ్పీ నేతలపై కేసు

Posted: 06/13/2018 11:19 AM IST
Vhp members vandalise gate at taj mahal say it was blocking path to a temple

ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఏడు వింతల్లో అరవదిగా స్థానం సంపాదించుకున్న తాజ్ మహాల్ పై బీజేపి నేతలు, విషం చిమ్ముతూనే వున్నారు. అయితే నేతలే ఈ తరహా వ్యాఖ్యలు చేసిన క్రమంలో ఇక కార్యకర్తలు, అనుబంధ సంస్థల శ్రేణులు మరో అడుగు ముందుకేసి చారిత్రక సంపదైన కట్టడాన్ని పరిరక్షించేందుకు బదులు వాటిని ధ్వంసం చేశారు. భారత వారసత్వ సంపదలో ఒకటైన తాజ్ మహల్ పశ్చిమ ద్వారాన్ని వీహెచ్పీ కార్యకర్తలు ధ్వంసం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తాజ్ మహాల్ లో వున్న 400 ఏళ్ల నాటి శివాలయంలోకి అనుమతించే దారిని మూసేస్తున్నారనే ఆరోపణలతో వారు ఈ చర్యకు దిగారు. పురాతన శివాలయంలోకి వెళ్లే దారిని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మూసివేస్తోందనేది వీహెచ్పీ సభ్యుల అరోపిస్తూ.. ఏకంగా చారిత్రక కట్టడాన్నే ధ్వంసం చేశారు. ఆలయానికి వెళ్లేందుకు మరో మార్గం ఉందని పోలీసులు చెబుతున్నా... వీహెచ్పీ కార్యకర్తలు వారిని లక్ష్యపెట్టలేదు. కేంద్ర, రాష్ట్రాల్లో తమ ప్రభుత్వమే ఉందన్న ధీమాతో.. పోలీసులను కూడా లెక్కచేయకుండా విధ్వంసానికి పూనుకున్నారు.

ఒక్కసారిగా అక్కడకు చేరుకున్న వీహెచ్పీ నేతలు, కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ, పశ్చిమ ద్వారాన్ని ధ్వంసం చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన గేటుపై సుత్తులు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. గేట్ ను తొలగించి, 50 మీటర్ల దూరానికి విసిరివేశారు. అక్కడ ఉన్న సీసీటీవీని కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పోలీసులు 30 మందిపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం నిరోధక చట్ట సవరణలో సెక్షన్ 7 కింద కేసు నమోదు చేశారు. అయితే, చారిత్రక కట్టడాన్ని ధ్వంసం చేసి 48 గంటలు గడిచినా.. ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి అరెస్టులు జరగకపోవడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : VHP activists  Taj Mahal  ASI  Ravi Dubey  heritage monument  Agra  Uttar Pradesh  

Other Articles