Armaan Kohli arrested for assaulting girlfriend బాలీవుడ్ నటుడ్ని చాకచక్యంగా అరెస్టు చేసిన పోలీసులు

Actor armaan kohli arrested after girlfriend accuses him of assault

Armaan Kohli, arman kohli, Armaan Kohli arrested, Armaan Kohli case, Mumbai, lonavla, Santacruz, Neeru Randhawa, Armaan Kohli Neeru Randhawa, Armaan Kohli films, Armaan Kohli age, how was armaan kohli arrested, assault, domestic voilence, lonavla, sim card, santacruz, live-in relationship, abscond, mumbai police, crime

Coming out of his hideout when on the run, just to buy a different SIM card got Armaan Kohli arrested. Kohli was brought to Mumbai from Lonavla by Mumbai Police.

సిమ్ కార్డు కోనేందుకు వచ్చి.. అడ్డంగా బుకైన బాలీవుడ్ నటుడు

Posted: 06/13/2018 11:59 AM IST
Actor armaan kohli arrested after girlfriend accuses him of assault

తన సహజీవన భాగస్వామి, ఫ్యాషన్ స్టయిలిస్ట్ నీరూ రంధావాను దారుణంగా హింసించి.. తప్పించుకుని తిరుగుతున్న బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లీని ముంబై పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఈ నెల జూన్ 3న తన సహజీవన భాగస్వామిగా వున్న నీరూను కోహ్లీ మెట్లపై తోసివేసి.. తరువాత అమెను జట్టు పట్టుకుని బలంగా నెలకేసి కోట్టాడు. అర్థికపరమైన విషయాలలో ఇద్దరు మధ్య చర్చ కాస్తా ముదిరి.. నీరూపై దాడికి దారితీసింది. ఈ ఘటనలో తల, మెకాళ్ల గాయాలైన నీరూ.. అర్మాన్ పై పోలీసులకు పిర్యాదు చేయగా వారు ఈ నెల నాలుగున కేసు నమోదు చేసుకుని కోహ్లీ కోసం అన్వేషణ ప్రారంభించారు.

తనపై కేసు నమోదైందని, తన గురించి పోలీసులు వెతుకుతున్నారని, ఇందుకోసం మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయన్న సమాచారం అందుకున్న అర్మాన్ ఇక తప్పించుకుని తిరిగే ప్రయత్నాలను ప్రారంభించారు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు అయన పారిపోయి.. అక్కడ తెలిసిన వారి సహకారంతో ఆశ్రయం పోందాడు. ఇలా రాష్రంలోని షోలాపూర్, పూణే, లోనావ్లా ప్రాంతాలకు వారం రోజుల వ్యవధిలో మకాం మార్చాడు. అయితే ఎక్కడకు వెళ్లినా అక్కడి కొత్త సిమ్ కార్డులను తీసుకుని తన కుటుంబసభ్యులు, న్యాయవాదితో మాట్లాడేవాడు.

అయితే అదే ప్రయత్నంలో భాగంగా లోనావ్లాకు చేరకున్న అర్మాన్ కోహ్లీ.. అక్కడ తన స్నేహితుడి ఫామ్ హౌజ్ లో అశ్రయం పోందుతున్నాడు. అయితే కొత్త సిమ్ కార్డు కోసం కోహ్లీ ఓ దుకాణానికి వెళ్లి సిమ్ కార్డు తీసుకున్నాడు. అదే సిమ్ కార్డు తనను పట్టించింది. అదెలా అంటే అర్మాన్ కోహ్లీని గుర్తుపట్టిన ఓ బాధ్యతగల పౌరుడు.. అయన తప్పించుకుని తిరుగుతున్నాడన్న వార్తను కూడా తెలుసుకున్నాడు. దీంతో వెంటనే శాంతాక్రూజ్ పోలీసులకు సమాచారం అందించాడు.

రెండు గంటల వ్యవధిలో శాంతాక్రూజ్ కు చెందిన పోలీసుల బృందం లోనావ్లాకు చేరుకుని.. అర్మాన్ కోహ్లీ అశ్రయం పోందుతున్న ఫాంహౌజ్ కు చేరుకుని అతన్ని అరెస్టు చేసింది. అర్మాన్ కోహ్లీ అరెస్టు విషయంలో సహకరించిన పౌరుడి వివరాలను తెలపని పోలీసులు.. అతన్ని అభినందించారు. కాగా, తన తలకు 15 కుట్లు పడ్డాయని, తలపై మచ్చ జీవితాంతం ఉంటుందని డాక్టర్ చెప్పిన మాటలు విని తానెంతో ఆందోళన చెందుతున్నానని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన నీరూ వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Armaan Kohli  Neeru Randhawa  assault  sim card  live-in relationship  abscond  mumbai police  crime  

Other Articles