Sharmistha Mukherjee slams BJP “dirty trick” బీజేపీ, అరెస్సెస్ ల డర్టీ ట్రిక్స్ పై మండిపడ్డ శర్మిష్ట ముఖర్జీ

Morphed picture of pranab mukerjee saluting rss style irks daughter

Pranab Mukherjee, Pranab Mukherjee RSS, Pranab Mukherjee RSS speech, Pranab, Pranab RSS, Pranab RSS speech, RSS, Rashtriya Swayamsevak Sangh, Indian National Congress, INC, Fake news, fake pictures, photoshop, photoshpped picture, Sharmistha Mukherjee

Congress leader Sharmistha Mukherjee hit out at BJP and RSS after a morphed picture of Pranab Mukherjee, raising his hand in salutation like the RSS leaders and cadres was circulated on social media

బీజేపీ, అరెస్సెస్ ల డర్టీ ట్రిక్స్ పై మండిపడ్డ శర్మిష్ట ముఖర్జీ

Posted: 06/08/2018 07:05 PM IST
Morphed picture of pranab mukerjee saluting rss style irks daughter

మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్‌) కార్యక్రమానికి వెళ్లడం రాజకీయ రాద్ధాంతానికి దారితీయగా, ఆ తరువాత ఆయన ఫోటోను మార్పింగ్ చేయడం కూడా వివాదాస్పదం అయ్యింది. అయితే కాంగ్రెస్ నేతలు, స్వయంగా తన కూతురు కూడా అభ్యంతరం వ్యక్తి చేసినా.. వాటిని తోసిరాజుతూ ప్రణబ్ ముఖర్జీ ఆరెస్సెస్‌ శిక్షా వర్గ్ సమావేశానికి హాజరై సభాసతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇంతవరకు బాగానే వున్నా.. ఇక్కడే అసలు ట్విస్టు ఏర్పడింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రణబ్‌ ఫొటోలను కొందరు మార్ఫ్‌ చేసి వాటిని సోషల్ మీడియాలో పెట్టడంతో అవికాస్తా వైరల్ అయ్యాయి. దీంతో అది నుంచి వద్దు అంటూ తండ్రి నిర్ణయానికి అభ్యంతరం చెప్పిన ప్రణబ్‌ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ తనదైనశైలిలో బీజేపిపై మండిపడ్డారు. ఇలాంటిది జరుగుతుందని తాను ముందే చెప్పానంటూ బీజేపిపై విమర్శలు చేశారు. నాగ్ పర్‌ ఆరెస్సెస్ సభలో ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగాన్ని అందరూ మర్చిపోతారని, ఫొటోలు, వీడియోలు మాత్రం అలాగే ఉంటాయన్నారు.

అయితే వాటిని అరెస్సెస్, బీజేపి ఇప్పుడో లేక సమీప భవిష్యత్తులో ఎప్పుడో వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారని అమె అన్నారు. అయితే బీజేపి, అరెస్సెస్ ల వాడకం మామూలుగా వుండదని, ఆ ఫోటోలు, వీడియోల్లోని ప్రసంగాలను కూడా మార్చివేసి.. బూటకపు ప్రకటనలు జోడించి ప్రచారం చేసే అవకాశముందని పేర్కొన్నారు. అందుకు తాజాగా మార్ఫ్‌ చేసిన ప్రణబ్‌ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటమే నిదర్శనమని బీజేపిపై అమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

మార్ఫ్‌ చేసిన ప్రణబ్‌ ఫొటోను ఓ నెటిజన్‌ షేర్‌ చేయగా.. దాన్ని ట్వీట్ చేస్తూ.. ‘చూశారా.. దీని గురించే నేను భయపడింది. మా నాన్నకు కూడా ఇదే విషయాన్ని చెప్పాను. ప్రణబ్‌ మాట్లాడి కొద్ది గంటలైనా కాకముందే.. బీజేపి, ఆరెస్సెస్‌ ఛీఫ్ ట్రిక్స్‌ విభాగం చురుగ్గా పనిచేసింది’ అని శర్మిష్ట పేర్కొన్నారు. అసలేం జరిగిందీ అంటే.. కార్యక్రమం ప్రారంభమయ్యే సమయంలో ఆరెస్సెస్‌ నేతలు ప్రతిజ్ఞ చేయగా ప్రణబ్‌ మాత్రం మామూలుగా లేచి నిల్చున్నారు. అయితే ఈ ఫొటోలను కొందరు మార్ఫ్‌ చేశారు. ప్రణబ్‌ ముఖర్జీ కూడా ఆరెస్సెస్‌ నేతల మాదిరిగా తన కుడిచేతిని ఛాతి వరకు చాచి ప్రతిజ్ఞ చేస్తున్నట్లుగా మార్ఫింగ్‌ చేసి సోషల్‌మీడియాలో పెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pranab Mukherjee  RSS  Congress  Fake news  photoshpped picture  Sharmistha Mukherjee  

Other Articles