nara lokesh mistakes in post card posted to pm modi మంత్రి లోకేష్ మాటలోనే కాదు రాతలోనూ తప్పులేనా.?

Ap minister nara lokesh makes mistakes in post card posted to pm modi

nara lokesh, pm modi, amaravati, secretariat, To PM with Love, chandrababu, andhra pradesh, viral news, social media

Andhra pradesh rural development and IT Minister Nara Lokesh makes mistakes in post card posted to pm modi requesting him to please grant special status to state.

మంత్రి లోకేష్ మాటలోనే కాదు రాతలోనూ తప్పులేనా.?

Posted: 06/08/2018 12:56 PM IST
Ap minister nara lokesh makes mistakes in post card posted to pm modi

ప్రత్యేక హోదా సంజీవని కాదు.. అది ముగిసిన అధ్యాయం.. అంతకన్నా రెట్టింపుస్థాయిలో వచ్చే ప్యాకేజీయే ముద్దు అని ఇటీవలి కాలం వరకు వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన తనయుడి నుంచి కూడా ఎలాంటి విన్నపాలు రాలేదు. ఐతే ఇప్పుడు చంద్రబాబు మళ్లీ ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్షలకు దిగుతూ.. రాష్ట్ర ప్రజలను మమేకం చేసే పనిలో వుండగా, ఆయన తనయుడు, మంత్రి లోకేస్ మాత్రం వినూత్నంగా అలోచించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 'ప్రేమలేఖ' రాశారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని.. ప్రధానమంత్రిని కోరుతున్నట్లు పేర్కొంటూ ఆయన ఈ లేఖను ప్రధాని మోడీకి పోస్ట్‌ చేశారు. ఈ ఫొటోను ఆయన ట్వీట్‌ చేశారు. 'మోడీజీ.. ఐదు కోట్ల ఆంధ్రుల తరఫున మీకు 'ప్రేమలేఖ' పంపిస్తున్నా.. దీన్ని తెరిచి చదవండి. దీన్ని డస్ట్‌ బిన్‌లో పడేస్తారన్న విషయం నాకు తెలుసు. కానీ.. ఆంధ్రులకు మీరిచ్చిన మాటను క్షణంపాటు గుర్తు చేసుకోండి' అని  లోకేష్ ప్రధానికి ఘాటైన సూచన చేశారు. ఈ ఉత్తరం ద్వారా ప్రత్యేక హోదా రాదని తెలిసినా వినూత్నంగా నిరసన తెలపడం కోసం లోకేష్ ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.

‘‘ప్రత్యేక హోదా కోరుతూ ప్రధానికి పోస్ట్ కార్డ్ పంపాను. మీరు కూడా ఆయనకు పోస్ట్ కార్డ్ పంపండి. ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి #ToPMWithLove అనే హ్యాష్ ట్యాగ్ వాడండ’’ని లోకేష్ ప్రజలను కోరారు. దయచేసి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండని ఇంగ్లిష్‌లో రాసిన లేఖను న్యూఢిల్లీ రెజినా హిల్స్‌లోని ప్రధాని కార్యాలయానికి లోకేష్ పోస్టు చేశారు. కాగా, ప్రధానికి రాసిన పోస్టుకార్డులో కూడా తప్పులు వుండటాన్ని నెట్ జనులు విమర్శిస్తున్నారు. అమరావతి స్పెల్లింగ్ సహా సెక్రటేరియట్ పదాల్లో తప్పులు దొర్లాయని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అంతేకాదు ఇప్పటివరకు ఆయన మాటలోనే తప్పులు దోర్లేవని తెలుసు.. కానీ ఇప్పుడు ఆయన రాతలో కూడా తప్పులు దొర్లుతున్నాయని విమర్శిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles