Karnataka BJP Mla hogs limelight for anti-Muslim remarks కర్ణాటక బీజేపి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

Karnataka bjp mla yatnal lands himself in the soup over remarks against muslim voters

bjp, bjp mla, former union minister, work for hindus not muslims, basanagouda patil yatnal, yatnal bjp mp, bijapur mla, karnataka bjp mla, viral video, controversy remarks, social media, india news

Vijayapura BJP MLA Basanagouda Patil Yatnal has created a new controversy saying that he will not allow women who are wearing burqa in his office.

ITEMVIDEOS: కర్ణాటక బీజేపి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

Posted: 06/08/2018 12:07 PM IST
Karnataka bjp mla yatnal lands himself in the soup over remarks against muslim voters

కర్ణాటకలో అధికారాన్ని చేతబట్టేందుకు శతవిధాల ప్రయత్నించి.. అబాసుపాలై బలనిరూపణకు ముందే ప్రభుత్వాన్ని రాజీనామా చేసిన బీజేపి.. రైతుల కోసం అన్నట్లు వెనువెంటనే బంద్ కూడా చేపట్టి.. దానిని విజయవంతం చేయలేక నిరసీంచిన బీజేపి పార్టీని మరింత ఇరుకున పట్టే చర్యలకు దిగుతున్నారు గెలిచిన ఎమ్మెల్యేలు. అటల్ బిహారీ వాజ్ పాయ్ హాయంలో కేంద్రమంత్రిగా పనిచేసిన బీజేపి సీనియర్ నేత, బీజాపూర్ ఎమ్మెల్యే  బసవగౌడ పాటిల్ యత్నాల్.. కర్ణాటకలోని విజయపూరలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు వాటిని తాను సమర్థించుకున్నారు కూడా.

తనకు ఓటు వేసిన హిందువుల కోసమే తాను పని చేస్తానని చెప్పిన ఆయన ఈ మేరకు తాను తన నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లను కూడా పిలిచి ఈ సూచనలు చేశానని చెప్పారు. తనకు ఓటు వేసిన హిందువులకు మాత్రమే పనిచేయాలని, ముస్లింలకు ఎటువంటి పనులు చేయొద్దని చెప్పానని ఆయన ఓ సమావేశంలో చెప్పిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయింది. కార్పొరేటర్లను కలిసిన బసవగౌడ ఈ మేరకు వారికి చెప్పినట్టు సమాచారం.

కాగా యత్నాల్ ఈ వ్యాఖ్యలు చేస్తున్న క్రమంలో సమావేశంలోని పాల్గోన్న వారి నుంచి ఈలలు, కేకలు వినిపించాయి. అంతటితో అగని ఆయన.. తన కార్యాలయంలోకి టోపీలు, బుర్ఖాలు ధరించి వచ్చే వారిని అనుమతించరాదని సంబంధిత సిబ్బందికి కూడా అదేశించానని చెప్పానని ప్రకటించారు. దీంతో యత్నాల్ వ్యాఖ్యలు సామాజిక మాద్యమంలో వైరల్ కావడంతో.. ఆయనను ప్రశ్నించిన మీడియా ఎదుట కూడా ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకోవడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh