ఉత్తరప్రదేశ్ లో హృదయవిదారకమైన ఘటన జరిగింది. పొత్తిళ్లలో ఉండాల్సిన పసికందు.. ఓ ఇంటి ముందు పడివున్నాడు. అదెలా అంటే ఓ గుర్తుతెలియని మహిళ కనీసం మానవత్వం కూడా లేకుండా.. ఆ పసికందును బట్టల్లో చుట్టి ఓ ఇంటి ముందు మెట్లపై పడేసి వెళ్లింది. అమ్మ అన్న పదానికి, అమ్మతనం అన్న బంధానికి నీళ్లు వదిలింది. అమ్మ కాలేక ఎందరో మహిళలు కనిపించిన దేవుడికళ్లా మొక్కులు మొక్కుకుంటూ వెళ్తుంటే.. కొంచెం కూడా జాలి, దయ, కరుణ, కనికరం అన్నవి లేకుండా ఓ వీధిలోని ఇంటి గుమ్మం ముందు పసికందును వదిలి వెళ్లింది ఈ మహిళ.
ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఏర్పాటు చేసిన సిసిటీవీ వీడియోల్లో రికార్డు కాగా, వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అవికాస్తా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముజఫర్ నగర్ లో నిర్మానుష్యంగా ఉన్న ఓ వీధిలో కారులో వెళ్తూ ఓ ఇంటి గుమ్మం ముందు ఓ టవల్ లో చుట్టి ఉన్న చిన్నారి పాపను గుర్తు తెలియని మహిళ కారు కిటికీలో నుంచి కిందకు వంగి ఇంటి ఎదుట వదిలేసి అక్కడి నుంచి వెళ్లింది.
అదృష్టవశాత్తు అ పసికందు మెట్లపై వుంది కానీ అప్పుడే కాసింత పక్కకు ఒరిగినట్లు అనిపించినా.. అలా జరగలేదు.. అదే జరిగితే.. మహిళ కారు కిందే విఘతజీవి అయ్యివుండేది. చిన్నారిని ఏడుపు విని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పసిపాపలు అన్న కనికరం కూడా లేకుండా రోడ్లపై, చెత్త కుప్పల్లో, హాస్సిటల్స్ బాత్రూంలలో చిన్నారులను వదిలివెళ్లున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చూస్తున్నాం.
#WATCH An unidentified woman drops a new-born baby on a street from a car in Muzaffarnagar. CMO Muzaffarnagar says, "the new-born is under treatment but her condition remains critical. We are hopeful of her recovery." (Source:CCTV footage) pic.twitter.com/Q6gyEAo6Q6
— ANI UP (@ANINewsUP) June 6, 2018
(And get your daily news straight to your inbox)
Jan 25 | 2016 నవంబర్ 8వ తేదీ అనగానే దేశ ప్రజలకు బాగా గుర్తుండిపోయే అంశం పాత పెద్ద నోట్ల రద్దు. దాని పర్యవసానం దాదాపుగా ఆరు నెలలు వరకు దేశ ప్రజలపై వుండిపోయింది. అనేక ఆంక్షలు,... Read more
Jan 25 | కన్నడ చలన చిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. యువ నటి, కన్నడ బిగ్ బాస్ సీజన్-3 కంటెస్టెంట్ జయశ్రీ రామయ్య తన ఆశ్రమ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు, ఆమె మృతదేహం సీలింగ్... Read more
Jan 25 | వంశపారంపర్య, వారసత్వ రాజకీయాలపై బీజేపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ధీటుగా ఎదుర్కోన్నారు పశ్చిమ బెంగాల ముఖ్యమంత్రి మమతా బెనర్జి మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ. వారసత్వ రాజకీయాలపై తనతో పాటు తన మేనత్త... Read more
Jan 25 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పంచాయతీ ఎన్నికలకు రీషెడ్యూల్ చేశారు. పంచాయతీ... Read more
Jan 25 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ మార్చి తరువాత నిర్వహించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదరుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికలను యధావిధిగా... Read more