snails move faster than vehicles on this road ఈ జాతీయ రహదారిపై వాహనాలకన్నా నత్తలే ఫాస్ట్..

Heavy traffic jam on national highway 65 at kukatpally

snails, faster, vehicles, national highway, traffic jam, kukatpally, traffic police station, free u turns, coordination, government departments, government officials, bottle neck roads, kphb, hydernagar, calvery temple

As we know that snails drag themselves to move and are slow, but here they are faster than vehicles on this national highway, this is not a joke this show the traffic jam at kukatpally just in front of local traffic police station

ఈ జాతీయ రహదారిపై వాహనాలకన్నా నత్తలే ఫాస్ట్..

Posted: 06/07/2018 12:35 PM IST
Heavy traffic jam on national highway 65 at kukatpally

శీర్షిక చూసి అదేంటి ఇలాంటి రోడ్డు ప్రత్యేకంగా నత్తల కోసం వేశారా.? అన్న సందేహాలు రావడం కామన్. కానీ అలాంటిదేమీ లేదు. తాంబులాలిచ్చాం తన్నకు చావండీ అన్న రీతితో ట్రాఫిక్ పోలీసు అధికారులు వ్యవహరించడంతో పాటు.. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కూడా కలసోచ్చి.. వాహనదారులకు నరకాన్ని చూపుతున్నాయి. నిజాంపేట జంక్షన్ నుంచి అమీర్ పేటకు చేరుకునేందుకు గంటల సమయం కేవలం రోడ్డుపైనే గడపాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి.

బాటిల్ నెక్ రహదారులలో వాహనదారులు ఎన్ని కుస్తీలు పడినా.. సమయానికి మాత్రం కార్యాలయాలకు చేరుకోవడం లేదు. ఫ్రీ యూ-టార్న్ లు కూడా ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతున్నాయి. దీనికి తోడు అక్కడడక్కడా ఇరుకైన రహదారి, దీనికితోడు వాటర్ వర్క్స్‌ పనులు, అది చాలదన్నట్లు మరోవైపు ఎలక్ట్రిక్ అధికారుల పనులు.. ఇలా ఎవరికి వారు తమ పనుల కోసం రోడ్డును అక్రమించి పనులు చేసుకుంటూ పోతుంటే.. ఉదయం కార్యాలయాలకని బయలుదేరిన ఉద్యోగులు, కార్మికులు.. తమ గమ్యస్థానాలకు చేరేందుకు కనీసం గంట నుంచి రెండు గంటలు అలస్యంగా చేరుకుంటున్నారు.

ఇది ఉదయం పూటకు మాత్రమే పరిమితం అనుకుంటే పోరబాటే. మధ్యాహ్నాలు కాసింత ట్రాఫిక్ తగ్గిందని భావించినా.. ఇక సాయంత్రం టూరిస్టు బస్సుల పుణ్యమా అని రెండు నుంచి మూడు గంటల సమయం ఇక్కడ హరిస్తుంది. దీంతో వాహనదారులు సమయం ప్రయాణినికే పరిమితం అవుతుండగా, మరోవైపు ప్రాణాలను హరించే పోగతో అనారోగ్యం బోసన్ గా సంక్రమిస్తుంది. ప్రభుత్వ అధికారులు మాత్రం తమ పని తాము చేస్తున్నామంటున్నారే తప్ప.. తమ పనులు ఎవరిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నది మాత్రం గ్రహించడం లేదు. అసలు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు.

ఆరు కిలోమీటర్ల దూరం చేరుకునేందుకు గంటన్నర నుంచి రెండు గంటల సమయాన్ని రోడ్డుపైనే గడపాల్సి వస్తుంది. ఇక దీనికి తోడు వాహనాల నుంచి వెదజల్లే కాలుష్యం అదనపు తాంబులం. కూకట్‌పల్లి ఐడియల్‌ రోడ్డు సమీపం వరకు విస్తారంగా వున్న రోడ్డు కాస్తా.. శ్మాశాన వాటిక వల్ల ఇరుకుగా మారిపోయింది. మామూలుగానే ఈ రోడ్డులో ఉదయం, సాయంకాలలు వాహనాలు ట్రాఫిక్ జామ్ అవుతుంటాయి. ఇక ఓ వైపు వాటర్‌ వర్క్స్‌ అధికారులు తవ్విన గోతులు, మరోవైపు ఎలక్ట్రికల్ అధికారులు తవ్విన గోతులు వాహనదారులను మరింత ఇబ్బందికి గురిచేశాయి. ఉదయం 9 గంటల నుంచి సాయత్రం వరకు వాహనాలు నత్తలకన్నా నెమ్మిదిగా ముందుకుసాగాయి.

నిమిషానికి 500 వాహనాలు ప్రయాణించే ఈ జాతీయ రహదారిపై గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడం.. ప్రతినిత్యం ట్రాఫిక్ సమస్యను ఎదుర్కుంటున్నామని వాహనదారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి తోడు సాయంకాల వేల టూరిస్టు బస్సులు అధిక సంఖ్యలో చందానగర్, మదినాగూడ, మియాపూర్, కేపీహెచ్బీ కూకట్ పల్లి ప్రాంతాల మీదుగా ప్రయాణాలు సాగించడం వల్ల కూడా ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఫ్రి యూటార్న్ నేపథ్యంలో భారీ బస్సులు మలువు తిప్పుకునే క్రమంలో కూడా ట్రాఫిక్ జామ్ లకు కారణం అవుతుంది. కనీసం సాయంత్రం వేళ కీలక ప్రదేశాల్లో ఫ్రీ యూటార్న్ విధానాన్ని పాత సిగ్నలింగ్ వ్యవస్థతో పునరుద్దరించాలని కూడా వాహనదారులు కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles