viral video: Cellphone explodes in man's pocket రెస్టారెంట్లో బోజనం చేస్తుండగా.. జేబులోని సెల్ ఫోన్..

Mobile phone explodes inside man s pocket in mumbai restaurant

mumbai, mobile phone explodes, mobile phone blast, mumbai restaurant, mumbai news, mumbai latest news, national news, mobile, cellphone, blast, Mumbai, restaurant, mobile explosion, cctv footage, viral video

The CCTV video shows a man jumping off his seat throwing away his mobile phone which had caught fire. As the smoke from the phone spreads inside the restaurant, others present there also panic and start running out of the eatery.

ITEMVIDEOS: రెస్టారెంట్లో బోజనం చేస్తుండగా.. జేబులోని సెల్ ఫోన్..

Posted: 06/06/2018 02:53 PM IST
Mobile phone explodes inside man s pocket in mumbai restaurant

ఆది ఉన్నత మధ్యతరగితి వారు వచ్చే రెస్టారెంట్. ఈ రెస్టారెంట్లో అందరూ కూర్చొని తమ అర్డర్ మేరకు వచ్చిన బోజనాలను ఆరగిస్తూ వున్నారు. ఆ సమయంలో అనూహ్యంగా ఓ వ్యక్తి జేబులోని ఫోన్‌ పేలిపోయింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. సదరు వ్యక్తి ఫోన్ ను పడేసి పక్కకు పరుగులు తీశాడు. అంతే అది చూసిన రెస్టారెంట్లోని మిగతా కస్టమర్లు కూడా పక్కకు వెళ్లారు. ఈ షాకింగ్‌ ఘటన ముంబైలోని భాందప్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని భాందవ్ ఏరియాలో వున్న ప్రముఖ రెస్టారెంట్లో రోజూ మాదిరిగానే జూన్‌ 4న (సొమవారం) నాడు కూడా కస్టమర్లు రెస్టారెంట్లోకి వచ్చి.. తాము అర్డర్ చేసిన బోజనాన్ని తింటూవున్నారు. ఉన్నట్టుండి ఓ కస్టమర్ జేబులోని సెల్ ఫోన్ పేలింది. ఆ వ్యక్తి చొక్కా జేబులో ఉన్న ఫోన్‌ ను జేబులోంచి తీసే క్రమంలో సెల్ ఫోన్ పొగలు చిమ్మింది. దీంతో కంగారు పడ్డిన ఆయన తన సీట్లో నుంచి లేస్తూనే పోన్ తో సహా జేబులోని వస్తువులన్నీ కిందకు విసిరేశాడు. దీంతో అక్కడ ఉన్న వారు భయంతో బయటకు పరుగులు తీశారు. పేలిన ఫోన్‌ నుంచి పొగలు వచ్చి రెస్టారెంట్‌ అంతటా వ్యాపించాయి.

ఫోన్‌ జేబులో పేలడంతో సదరు వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అది ఏ కంపెనీ ఫోనో వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్ని రెస్టారెంట్లో అమర్చిన సీసీటీవీలో రికార్డయ్యాయి. వీటిని ఎవరో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా, అవికాస్త వైరల్‌ అవుతున్నాయి. ఇటీవల ఒడిశాలోని ఖేరియాకాని జిల్లాలో 18 ఏళ్ల యువకుడు సెల్ ఫోన్‌ ఛార్జింగ్ పెట్టి కాల్‌ మాట్లాడుతుండగా ఫోన్‌ పేలింది. అతడు తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ మధ్య కాలంలో సెల్‌ఫోన్లు పేలిన ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mobile  cellphone  blast  Mumbai  restaurant  mobile explosion  cctv footage  viral video  

Other Articles