Dutch PM Mark Rutte's 'Swachh Netherlands' moment ఎందరో ఛాయ్ వాలాలకు ఈ ప్రధాని ఆదర్శం.. ఎందుకంటే..

Netherlands pm mark rutte spills coffee on the floor cleans up the mess

Mark Rutte, Mark Rutte spils coffee, Mark Rutte coffee video, viral video, Mark Rutte viral video, Mark Rutte coffee video, netherlands prime minister, netherlands pm, world news

Netherlands Prime Minister Mark Rutte is in the news after he spilled coffee on the floor and cleaned it on his own, without waiting for the Parliament’s cleaning staff.

ITEMVIDEOS: ఎందరో ఛాయ్ వాలాలకు ఈ ప్రధాని ఆదర్శం.. ఎందుకంటే..

Posted: 06/06/2018 01:27 PM IST
Netherlands pm mark rutte spills coffee on the floor cleans up the mess

ఆయన ఓ దేశానికి ప్రధానమంత్రి. ప్రధానిగా తన దేశ ప్రజలకు ఆయన అదర్శప్రాయుడిగా నిలవాలి. కానీ ఆయన ఏకంగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్త ఛాయ్ వాలాలకు అదర్శంగా నిలుస్తున్నాడు. మన దేశ ప్రధాని కూడా తాను ఛాయ్ వాలా అని చెప్పుకున్నారు. అందుకనే తాను స్వచ్ఛా భారత్ అనే నినాదాన్ని ఇచ్చి.. దేశం స్వచ్చతగా వుండాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి వచ్చిందంటే చాలు ఆయన శుభ్రతను స్వయంగా చేస్తుంటారు. కానీ నెదర్ లాండ్స్ ప్రధాని అలా కాదు. ఈయన పోటోల కోసం కాకుండా తన తప్పును తానే దిద్దుకుని.. అందరికీ అదర్శంగా నిలిచారు. ఎందుకలా..? అంటే..  

నెదర్ లాండ్స్ ప్రధాని తన ప్రధాన మంత్రి కార్యాలయానికి వస్తూ.. చేతిలో కాఫీ పట్టుకుని హడావిడిగా తన కార్యాలయానికి చెందిన వ్యక్తితో పాటు నడిచివస్తున్నారు. ఇంతలో తన కార్యాలయం వద్దనున్న ఎంట్రీ వద్ద ఆయన పొరబాటుగా చేతిలోని కప్పు జారవిడిచారు. అయితే ఇందులో ఏముంది.. పనివాళ్లని పిలిపించి శుభ్రం చేయమంటే సరి. సాధారణంగా అంత పెద్ద హోదాలో ఉన్నవారు చేసే పని అదే. కానీ ఆయన అలా చేయలేదు. తన వల్ల చేజారిన కాఫీని ఆయనే స్వయంగా శుభ్రం చేశారు. మాప్‌ తీసుకుని కాఫీ మరకలను తుడిచేశారు. నెదర్లాండ్స్‌ ప్రధాని మార్క్ రుటే చేసిన ఈ పనికి ఇప్పుడు నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది.

మార్క్‌ రుటే ఇటీవల పార్లమెంట్‌కు వస్తుండగా ఆయన చేతిలోని కాఫీ కప్పు డోర్‌కు తగిలి కిందపడిపోయింది. అందులోని కాఫీ అంతా నేలపై ఒలికిపోయింది. దీంతో పక్కనే ఉన్న అధికారులు వెంటనే పనివాళ్లను పిలిచారు. అయితే మార్క్‌ వారిని వద్దని చెప్పి ఆయనే స్వయంగా శుభ్రం చేయడం మొదలుపెట్టారు. పనివాళ్ల దగ్గర ఉన్న మాప్ తీసుకుని కాఫీ మరకలను తుడిచారు. ఈ చర్యతో అక్కడున్న వారు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత మార్క్‌ నిరాడంబర వ్యక్తిత్వాన్ని చప్పట్లతో ప్రశంసించారు.

ఈ వీడియోను డచ్‌ దౌత్యవేత్త ఒకరు ఈ నెల 4న ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. కొద్ది రోజుల్లోనే ఈ వీడియో వైరల్‌గా మారింది. ‘వినయపూర్వకమైన నాయకత్వానికి నిదర్శనం’ అంటూ పలువురు నెటిజన్లు మార్క్‌పై ప్రశంసలు కురిపించారు. కొందరు భారతీయ నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఈ వీడియోను మన రాజకీయనాయకులు తప్పనిసరిగా చూడాలి.. స్వచ్ఛభారత్‌ అంటూ ఫొటోలకు ఫోజులిచ్చే నాయకులు దీన్ని చూసి నేర్చుకోవాలి’ అంటూ కామెంట్లు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles