Bitcoin scam: Raj Kundra summoned by ED బిట్ కాయిన్ స్కాంలో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా..

Bitcoin scam shilpa shetty husband raj kundra summoned by ed

Shilpa Shetty, Raj Kundra, Bitcoin scam, cricket betting, Rajasthan Royals, ED, Enforcement Directorate, ED Summons, Mumbai, Crime

Businessman Raj Kundra was summoned and questioned by the Enforcement Directorate (ED) here on Tuesday. Kundra is the husband of Bollywood actress Shilpa Shetty.

మళ్లీ కష్టాల్లో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా.. ఈడీ నోటీసులు

Posted: 06/05/2018 01:29 PM IST
Bitcoin scam shilpa shetty husband raj kundra summoned by ed

అంతర్జాతీయ ఊహాజనిత కరెన్సీ బిట్ కాయిన్ స్కామ్ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా మరోమారు కష్టాల్లో చిక్కుకున్నారు. ఇ:డియన్ ప్రీమియర్ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు సహ యజమానులైన రాజ్ కుంద్రా.. ఈజీ మనీ వేటలో బెట్టింగ్ కు పాల్పడి.. అడ్డంగా విచారణలో దొరికిపోయాడు. రెండేళ్ల నిషేధం తరువాత ఈ ఏడాదే మళ్లీ రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ లో పునరాగమనం చేసింది. ఈ విధంగా కష్టాలు ఎదురైన క్రమంలో ఇకపై జీవితాన్ని సజావుగా, సక్రమంగా సాగేలా తమ వంతు చర్యలు తీసుకోవాల్సిన ఆయన మరోమారు అంతకన్న పెద్ద స్కాంలో చిక్కుకున్నారా.? అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.

బిట్ కాయిన్ స్కాంలో ఓ నిందితుడ్ని విచారిస్తున్న అధికారులకు ఈ స్కాంలో రాజ్ కుంద్రా కూడా వున్నాడన్న పేరు తెలియడంతో..ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు పంపింది. ఈ కేసులో రాజ్ కుంద్రాకు సంబంధముందని అమిత్ భరద్వాజ్ అనే నిందితుడు అధికారుల ఎదుట వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో ఆయన్ను ప్రశ్నించాలని నిర్ణయించుకున్న ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు చేరవేశారు. రాజ్ కుంద్రాతో పాటుగా రోజుకు రూపాయలు కోటి అపైన బిట్ కాయిన్ డీలింగ్ చేస్తున్న వారందరికీ అదాయ పన్ను శాఖ అధికారులు కూడా నోటీసులు పంపారు. వీరందరి పేర్లను కూడా ఐటీ అధికారులు ఈడీ అధికారులకు పంపారు.

అయితే రాజ్ కుంద్రాను ఈడీ అధికారులు స్కామ్ లో పాత్ర వుందని విచారించారా.? లేక ఆదాయ శాఖ అధికారులు పంపిన జాబితాలో పేరుందని విచారించారా.? అన్న విషయం మాత్రం స్పష్టం కాలేదు. ఓ భారీ నెట్ వర్క్ గా ఏర్పడి, కంప్యూటర్ ద్వరా గణిత శాస్త్ర సమీకరణాలతో బిట్ కాయిన్లను సృష్టిస్తారన్న సంగతి తెలిసిందే. దీనికి ఎటువంటి చట్టబద్ధతా లేనప్పటికీ, గత సంవత్సరంలో ఓ వెలుగు వెలిగిన బిట్ కాయిన్ విలువ, ఆపై కుదేలైన సంగతి తెలిసిందే. లక్సంబర్గ్ కేంద్రంగా నడుస్తున్న బిట్ స్టాంప్ ఎక్స్ఛేంజ్ ఈ లావాదేవీలను నిర్వహిస్తుండగా, భారత్ లో కొంతమంది చైన్ గా ఏర్పడి బిట్ కాయిన్ లావాదేవీలు ప్రారంభించి, ప్రజలను మోసం చేశారు. ఈ కేసులో పలువురు సెలబ్రిటీల పేర్లు కూడా తెరపైకి వస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles