is this really allien? video viral on social media దక్షిణ భారతంలో గ్రహాంతరవాసి.? వీడియో వైరల్..

Is this really allien video viral on social media

human like animal, kerala-karnataka border, alien girl, allien girl hulchul in south india, kerala, karnataka, Alien At Karnataka, Alien video hulchal in social media, Alien in kerala karnataka border, Alien videos, Alien caught in karnataka, Alien, latest news, viral videos, viral news, latest updates

doubts araise after a video goes viral on social media stating a human like animal as Alien, which is found to be noticed in Kerala - Karnataka Border.

ITEMVIDEOS: దక్షిణ భారతంలో గ్రహాంతరవాసి.? వీడియో వైరల్..

Posted: 06/05/2018 12:49 PM IST
Is this really allien video viral on social media

ఆ మధ్య విశాఖ జిల్లాలో నిర్మాణితమవుతున్న ఓ భవనంలో వింత ఆకారంలో వున్న పక్షులను చూసి గ్రహాంతర పక్షులని భావించిన మనవాళ్ల మాదిరిగానే.. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామంలో ఓ వింత జీవిని చూసి అక్కడివాళ్లు ఇది గ్రహాంతర జీవిగా భావిస్తున్నారు. దక్షిణభారతంలో గ్రహాంతర జీవులు సంచరిస్తున్నాయన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను స్థానికులు మోబైల్ లో రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టగా, అది కాస్తా వైరల్ అవుతోంది.

కర్ణాటక- కేరళ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఈ జీవి సంచరిస్తుందని ప్రచారం జోరందుకుంది. ఈ సరిహద్దు ప్రాంతంలో కర్ణాటకలోని జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతంలో ఈ వింత జీవి సంచరిస్తుందని వార్తలు గుప్పుమంటున్నాయి. దీనిని తొలుత ఏదో జంతువని గ్రామస్థులు బావించారు. అయితే అది వింత ఆకరంలో వుండటం వారి అనుమానాలకు కారణమైంది. దీంతో ఓ పథకం ప్రకారం దాన్ని వేటగాళ్లు బంధించారని ఫేస్ బుక్ లో ఓ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇక ఈ వీడియో, అందులోని జీవి గురించిన వివరాలను నాసాకు కూడా పంపారట. ఇక ఈ వీడియోలో దాదాపు రెండు, రెండున్నర అడుగుల ఎత్తులో ఉన్న ఓ మానవాకారం, తెల్లని ముఖం, పొడవైన జుట్టుతో కనిపిస్తోంది. చేతులు చిన్నగా ఉన్నాయి. కాళ్లు కనిపించడం లేదుగానీ, కళ్లు, ముక్కు, నోరు కూడా ఉన్నాయి. అయితే, ఇదంతా ఫేక్ అంటూ కొందరు కొట్టి పారేస్తున్నారు. ప్రచారం కోసం ఎవరో పుట్టించిన వీడియో వార్తగా దీనిని పేర్కొంటున్నారు. ఇక ఇది గ్రహాంతర వాసేనన్న ప్రచారంలో నిజానిజాలు ఎలావున్నా, దాన్ని మీరూ చూడవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles