we are at forefront of meeting people's needs: KCR తెలంగాణ జీవనప్రధాయిని కాళేశ్వరం: కేసీఆర్

Telangana government at forefront of meeting people s needs kcr

K Chandrasekhar Rao, Telangana, Andhra Pradesh, Bifurcation, farmer needs, Bangaru Telangana, Narendra Modi, Model state, Statehood, Developmental schemes, pensions, welfare schemes, kaleshwaram, KCR, telanagana

Telangana CM KCR said that his government has become a role model for the entire country as far as implementation of welfare and developmental programmes was concerned

తెలంగాణ జీవనప్రధాయిని కాళేశ్వరం: కేసీఆర్

Posted: 06/02/2018 06:14 PM IST
Telangana government at forefront of meeting people s needs kcr

తెలంగాణ ఏర్పడితేనే మన రాత మారుతుందని పోరాడి స్వరాష్ట్రాన్ని సాధించుకుని నాలుగేళ్లలోనే బంగారు తెలంగాణ దిశగా అడుగులేస్తున్నామని.. ఆ దిశగా సాగుతున్న పయంలో మరికొన్నేళ్ల వ్యవధిలోనే గమ్యాన్ని చేరుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు ఘననివాళులు అర్పించారు. ప్రజల్లో మానసిక స్థైర్యాన్ని పెంచుతూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు.

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల కింద పేద ఆడబిడ్డల పెళ్లికి ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. వసతి గృహ విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామన్నారు. రైతులకు రుణమాఫీ చేశామన్నారు. వ్యవసాయ పరికరాలకు రాయితీ ఇచ్చామన్నారు. నీటి తీరువా, ట్రాక్టర్లపై వాహన పన్ను రద్దు చేశాంమన్నారు. తెలంగాణ ఏర్పాడిన తరువాత నాలుగేళ్లలోనే 520 గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి.. విద్యాభివృద్దితో పాటు మానవ వనరుల పెరుగుదలకు తమ ప్రభుత్వం దోహదం చేసిందన్నారు.

సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో ప్రాజెక్టులపై అప్పటి పాలకులు శీతకన్ను వేశారని అరోపించారు. తెలంగాణ బంగారం అని తెలుసుకున్న పాలకులు తెలంగాణ వాడు వృద్ది చెందకుండా ప్రాజెక్టుల డిజెన్ల వద్ద నుంచే వివాదాస్పదం చేశారని, పక్కరాష్ట్రల వారు కోర్టులకు వెళ్లి ప్రాజెక్టు పనుల అడుగకు కూడా ముందుకు పడకుండా అడ్డుకునేలా చేశారని కేసీఆర్ తీవ్రంగా అక్షేపించారు. ప్రస్తుతం గోదావరి, కృష్ణా జలాలు పొలాల్లో పారేలా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవనప్రదాయినిగా మారనుందని కూడా కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలోని రైతంగానికి ఎంత చేసినా తక్కువనే అన్న కేసీఆర్.. వారి సంక్షేమానికి ఎంతో చేయాలని వుందని అభిలాషను వ్యక్తం చేశారు. రైతులందరికీ రూ.5 లక్షల జీవిత బీమా అమలు చేస్తున్నామని.. రైతు ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబం చిన్నాభిన్నం కాకుండా వుండేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, అయితే ఈ పథకం కోసం వారి నుంచి రూపాయి తీసుకోలేదని చెప్పారు. భూముల వివరాలు పారదర్శకంగా ఉండే ధరణి వెబ్‌సైట్‌ రూపొందించామని చెప్పారు.

‘రైతు బంధు పథకంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుందని అన్నారు. సాగుపెట్టుబడి కోసం రైతులు అప్పులు చేయాల్సిన వచ్చిన పరిస్థుల నుంిచ వారిని అదుకుని ఆ పెట్టుబడి ప్రభుత్వమే కల్పించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేయాలనేదే నా లక్ష్యమన్నారు. ఎకరాకు రూ.8 వేల పెట్టుబడిసాయం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఈ విషయాన్ని కేంద్రం కూడా అంగీకరించిందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  formation day  farmer needs  Bangaru Telangana  pensions  welfare schemes  kaleshwaram  KCR  telanagana  

Other Articles