Farmers Protest is Unnecessary: khattar హర్యాన ముఖ్యమంత్రి ఖట్టర్ సంచలన వ్యాఖ్యలు..

Haryana cm khattar controversy remarks on farmers protest

Farmers strike, Manohar lal khatter, haryana chief minister, Mandsaur, controversy remarks, haryana, Madhya Pradesh Farmers Strike, Mandsaur, Shivraj Singh Chauhan, Madhya Pradesh farmers, Farmers unions, farm loan waiver

The ongoing farmer's strike has entered day 2 on Saturday. Farmers' organisations like Bhartiya Kisan Union had launched a 10-day protest on Friday to press for their various demands including loan waiver and right price of crops.

ITEMVIDEOS: హర్యాన ముఖ్యమంత్రి ఖట్టర్ సంచలన వ్యాఖ్యలు..

Posted: 06/02/2018 06:21 PM IST
Haryana cm khattar controversy remarks on farmers protest

ఓ వైపు తెలంగాణ అవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఎంత చేసిన తక్కువగానే అనిపిస్తుందని, వారికి ఇంకా ఎంతో చేయాలని తన మనస్సు పరితమిస్తుందని వ్యాఖ్యలు చేయగా, అదేలా కర్ణాటకలో తాజామాజి మఖ్యమంత్రి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ముందు రైతుల రుణమాఫీలను చేయాలన్న డిమాండ్ ను వుంచి ఏకంగా ప్రభుత్వం కూడా కొలువుదీరక ముందే రాష్ట్ర బంద్ కు పిలుపినిచ్చి .. తమ బీజేపి పార్టీ రైతుల కోసమేనన్న సంకేతాన్ని ప్రజల్లోకి పంపించే  ప్రయత్నం చేసింది.

కానీ అదే బీజేపి ప్రభుత్వం అధికారంలో వున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఏకంగా రైతులకు అసలు సమస్యలేమీ లేవని వివాదాస్పద వ్యాక్యలు చేశారు. దేశ ప్రజలకు అన్నం పెడుతోన్న రైతన్నలపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'వారికి ఎటువంటి సమస్యలు లేవు.. అనవసర విషయాలపై దృష్టి పెడుతున్నారు.. వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించకపోతే రైతులకే నష్టం' అని చౌవకబారు వ్యాఖ్యుల చేశారు.

కాగా ఉత్తరప్రదేశ్‌, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు క్రితంరోజున.. పది రోజుల ఆందోళనను ప్రారంభించారు. పలు ప్రాంతాల్లో రైతులు రోడ్లపై కూరగాయలు, పాలు పారబోసి నిరసన తెలిపారు. ఈనెల 10న భారత్ బంద్ నిర్వహించాలని యోచిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడి రాష్ట్రప్రభుత్వాలకు ఏకంగా సర్వోన్నత న్యాయస్థానం వారికి పరిహారాలు కల్పించాలని కూడా అదేశించినా ఇక్కడి ప్రభుత్వాలు స్పందించలేదు. అయితే హర్యానా సీఎం ఖట్టర్ చేసిన వ్యాఖ్యలు వారికి మరింత ఆగ్రహం తెప్పించేలా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles