Not everyone can get Patanjali-BSNL SIM card బీఎస్ఎన్ఎల్ జోష్ కల్గిస్తున్న పతాంజలి సిమ్..

Patanjali swadeshi samridhi sim cards plans released basic plan for rs 144

patanjali sim, patanjali sim card, patanjali sim card price, patanjali sim card details, patanjali sim card offers, jio vs patanjali, patanjali sim vs jio, jio rs 149 pack, jio rs 149 offer details, jio vs airtel, jio vs airtel plans, jio vs airtel plans prepaid, jio vs airtel plans 2018

Patanjali SIM's plan is in direct competition with other leading players like Jio and Airtel. BSNL tweeted details of the new recharge pack- 'BSN-Patanjali -144 plan'.

బీఎస్ఎన్ఎల్ కు ప్రభంజనాన్ని చూపనున్న పతాంజలి.. ఫ్లాన్లు ఇవే..

Posted: 05/31/2018 10:42 AM IST
Patanjali swadeshi samridhi sim cards plans released basic plan for rs 144

టెలికాం రంగంలో ప్రత్యర్థి కంపెనీలకు సవాల్ విసిరి, దూసుకుపోతున్న జియో తీవ్రమైన పోటీని ఎదుర్కోబోతోంది. ఇప్పటివరకు వున్న విధానాలను కొనసాగిస్తూ జియో సిమ్ కూడా అదే పంథాను ఫాలో కాగా.. ఈ ప్లాన్ విధానాలను సమూలంగా మార్చేందుకు పతాంజలి సిమ్ కార్డు రంగంలోకి దిగనుంది. ఇప్పటికే ఎఫ్ఎంజీసీ, ఫుడ్, హోమ్ కేర్, ఆయుర్వేద మెడిసిన్, పర్సనల్ కేర్ తదితర విభాగాల ఉత్పత్తులతో మార్కెట్ లో దూసుకుపోతున్న పతాంజలి టెలికాం రంగంలోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్దం చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే రోజువారి, వారం, తరువాత వారాలతోనే నెలకు కేవలం 28 రోజులుగా పరిగణించిన విధానాన్ని పతాంజలి స్వప్తి పలుకుతూ తమ కొత్త సిమ్ కార్డుల ప్లాన్లను అవిష్కరించింది. ప్రస్తుతం అన్ని టెలికాం సంస్థలు నాలుగు వారాల విధానాన్నే అమలు చేస్తుండగా, పతాంజలి సిమ్ కార్డులు మాత్రం నెల రోజుల వ్యాలిడిటీతో అందుబాటులోకి వస్తున్నాయి. నెలకు కేవలం రూ.144లకే అపరిమిత వాయిస్ కాలింగ్ సౌలభ్యాన్ని కల్పిస్తున్న పతాంజలి.. తమ కస్టమర్లకు రోజుకు 2జీబి డాటా చొప్పున నెలకు 60 జీబి డాటాను కూడా కల్పిస్తుంది. ఇక రోమింగ్ అంటూ ఏమీ లేకుండా తమ సిమ్ కార్డులు యావత్ దేశానికి పరిమితం చేసింది.

'స్వదేశీ సమృద్ధి' పేరిట సిమ్ కార్డులను మార్కెట్లోకి విడుదల చేసి.. ప్రస్తుతానికి ఇది కేవలం తమ ఉద్యోగులకు, పతాంజలి దుకాణాదారులకు మాత్రమే వర్తింపజేసిన సంస్థ.. త్వరలోనే ఈ సిమ్ కార్డులను అందరికీ వర్తింపజేస్తామని కూడా ప్రకటించింది. అయితే స్వదేశీ సమృద్ది కార్డులపై ఏకంగా రెండున్నర లక్షల అరోగ్య భీమా, ఐదు లక్షల జీవిత భీమాను కూడా వర్తింపజేయనుంది. ఇక మరోవైపు ఈ కార్డులతో తమ ఉత్పాదనల కోనుగోలుపై 5 నుంచి పది శాతం వరకు రాయితీ కూడా పొందవచ్చునని తెలిపింది. ఇక ప్లాన్ల వివరాల్లోకి వెళ్తే..

పతంజలి-బీఎస్ఎన్ఎల్ రూ. 144 ప్లాన్:
నెల రోజుల వాలిడిటీ. అపరిమిత వాయిస్ కాల్స్. ఆలిండియా రోమింగ్. రోజుకు 2 జీబీ డేటా. రోజుకు 100 ఎస్ఎంఎస్ లు.

పతంజలి-బీఎస్ఎన్ఎల్ రూ. 792 స్పెషల్ ప్లాన్ ఓచర్:
6 నెలల వాలిడిటీ. అపరిమిత వాయిస్ కాల్స్. ఆలిండియా రోమింగ్. రోజుకు 2 జీబీ డేటా. రోజుకు 100 ఎస్ఎంఎస్ లు.

పతంజలి-బీఎస్ఎన్ఎల్ రూ. 1584 స్పెషల్ ప్లాన్ ఓచర్:
ఒక సంవత్సరం వాలిడిటీ. అపరిమిత వాయిస్ కాల్స్, ఆల్ ఇండియా రోమింగ్. రోజుకు 2 జీబీ డేటా. రోజుకు 100 ఎస్ఎంఎస్ లు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles