Petrol and diesel prices slashed again by paise ఇంధన ధరలు మళ్లీ తగ్గాయ్.. వాహనదారులకు కలగని ఊరట..

Petrol and diesel prices slashed again by paise

Petrol-diesel price daily revision, petrol price, Diesel price, today petrol rate, today diesel rate, petrol price today, diesel price today, Petrol, Diesel, petrol price on 31st May 2018, diesel price on 31st May 2018, Petrol Price in India, Diesel price in India, petrol prices, Diesel prices, IOC,

Petrol price was on Thursday cut by 7 paise a litre and diesel by 5 paise - the second reduction in as many days on the back of softening international oil rates.

ఇంధన ధరలు మళ్లీ తగ్గాయ్.. వాహనదారులకు కలగని ఊరట..

Posted: 05/31/2018 10:03 AM IST
Petrol and diesel prices slashed again by paise

పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. గత 16 రోజులుగా ఆల్ టైం రికార్డ్ దిశగా దూసుకెళ్లిన ఇంధన ధరలు.. వరుసగా రెండో రోజు కూడా తగ్గాయి. అయితే ఎంత తగ్గాయని అంటే మాత్రం ఆయిల్ కంపెనీల కపట బుద్దని బయటపెడుతున్నాయి. పెంచినప్పుడు మాత్రం రూపాయల్లో లేదా దాదాపు రూపాయి మేర పెంచుతూ వెళ్లిన కంపెనీలు.. తగ్గింపులో మాత్రం కేవలం సింగిల్ డిజిట్ పైసలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. నిన్న మొదట రూపాయి మేర ఇంధన ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించిన ఇంధన సంస్థలు తరువాత తగ్గింపు కేవలం ఒక్క పైసాకు మాత్రమే పరిమితం చేశారు. ఇక రెండో రోజు కేవలం 7 పైసలకు మాత్రమే ఈ తగ్గింపు వర్తించింది.

దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.83 రూపాయలకు చేరగా, అదే విధంగా డీజిల్ లీటర్ రూ.75.27కు చేరింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పడుతున్నా.. అందుకు సరిసమానంగా భారత్ లో కూడా ధరలను తగ్గిస్తామన్న కేంద్రం.. ఈ విషయంలో అటు అయిల్ కంపెనీలను అడ్డుపెట్టుకుని.. ఇటు వాహనదారులు జేబులకు మాత్రం చిల్లులు పెడుతుంది. అంతర్జాతీయంగా తగ్గిన ఇంధన ధరలను కేంద్రం వాహనదారులకు వర్తింపజేయడంలో విఫలం అవుతుందన్న అరోపణలు వస్తున్నాయి. రాష్ట్రాలు ఇంధన ధరలపై వేస్తున్న వ్యాట్ ను తగ్గించాలని కోరుతున్న కేంద్రం.. తాము గత నాలుగేళ్లుగా 11 రూపాయల మేర పెంచిన ఎక్సైజ్ డ్యూటీని మాత్రం ఓ పర్యాయం రూ.2 మేర తగ్గించిందే తప్ప.. మిగిలిన 9 రూపాయల భారం ఇంకా వాహనదారులపై వేస్తూనే వుంది.

మే 14 నుంచి 29వ తేదీ వరకు లీటర్ పెట్రోల్ పై సుమారుగా రెండు రూపాయల మేర ధర పెరిగింది. కర్నాటక ఎన్నికల క్రమంలో.. అంతకు ముందు 19 రోజులు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఆ తర్వాత ప్రతి రోజూ 15 నుంచి 20పైసలు చొప్పున పెరుగుతూ ఇంధనం సామాన్యుడిని బెంబేలెత్తించేస్తాయికి చేరుకుంది. తగ్గిన ధరల నేపథ్యంలో ఇవాళ దేశ రాజధాని న్యూడిల్లీలో లీటర్ పెట్రోల్ 78.35కు చేరగా, కొల్ కతాలో 80.98, ముంబైలో 86.16, చెన్నైలో 81.35కు చేరకుంది. అదే విధంగా డీజీల్ కూడా ఐదు పైసల మేర తగ్గింది. ఫలితంగా ఢిల్లీలో లీటర్ డీజిల్ 69.25, కోల్ కతాలో 71.80, ముంబైలో 73.73, చెన్నైలో 73.12కు చేరింది.

మరోవైపు కేవలం సింగిల్ డిజిట్ పైసల్లో మాత్రమే ఇంధన ధరలు తగ్గించడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. మోదీ సర్కార్ చమత్కారం చేసిందని.. అంతర్జాతీయంగా క్రూడ్ అయిల్ ధరలు తగ్గుతున్నా.. వాటికి అనుగూణంగా ఇంధన ధరలను తగ్గించని కేంద్రం.. దేశంలోని వాహనదారులను కేవలం ఒక్క ఫైసా తగ్గింపును వర్తించిందని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. 'డియర్‌ మోదీ' అంటూ ఓ ట్వీట్ చేసి ప్రధానిపై విమర్శలు గుప్పించారు. 'ఈరోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఒక్క పైసా తగ్గించారు. ఇది మోదీ ఐడియానే అయితే, అది చిన్న పిల్లల ఆలోచనలా, ఏ మాత్రం పరిణతి లేని చర్యలా ఉంది' అని రాహుల్‌ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles