Chidambaram seeks anticipatory bail in INX media case ముందస్తు బెయిల్ పిటీషన్ కోసం ఢిల్లీ హైకోర్టుకు చిదంబరం

Inx media case chidambram moves anticipatory bail plea in delhi high court

p chidambaram, inx media case, Aircel-Maxis money laundering case, chidambaram questioning in cbi, cbi inx media case, india news, karthi chidambaram, delhi high court

Former Finance Minister P. Chidambaram filed an anticipatory bail in Delhi High Court in connection with the INX media case after getting a small relief from a delhi court in his arrest.

చిదంబరానికి స్వల్ప ఊరట.. ఢిల్లీ హైకోర్టును అశ్రయించిన మాజీ మంత్రి

Posted: 05/30/2018 04:08 PM IST
Inx media case chidambram moves anticipatory bail plea in delhi high court

కేంద్ర మాజీ ఆర్థికశాఖ మంత్రి చిదంబరానికి ఢిల్లీలోని సీబీఐ స్పెషల్ కోర్టు స్వల్ప ఊరటను లభించింది. ఎయిర్ సెల్, మాక్సిస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను తదుపరి విచారణ జరిగే జూన్ 5 వరకూ ఆయనపై ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని ఆదేశాలు వెలువరించింది. అంతవరకూ ఆయన్ను అరెస్ట్ చేయవద్దని సీబిఐకి అదేశాలను జారీ చేసింది. చిదంబరం పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు న్యాయస్థానం సూచించింది. ఇదిలావుండగానే చిదంబరం మాత్రం ఢిల్లీ హైకోర్టును అశ్రయించారు.

తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై మరికొద్దిసేపట్లో న్యాయస్థానం విచారణ జరపనుంది. కాగా, ఢిల్లీ సీబిఐ కోర్టులో చిదంబరం తరఫున కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. తన క్లయింటు మాజీ కేంద్రమంత్రి కావడం వల్లే ఆయనపై రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసు వెనుక రాజకీయ కుట్ర దాగుందని అన్నారు. ఆయన్ను అరెస్ట్ చేయడానికి అధికారులు తహతహలాడుతున్నారని, తన క్లయింట్ హక్కుల పరిరక్షణ కోసం ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు.

వాదనలు విన్న న్యాయమూర్తి, తాత్కాలిక ఊరటను ఇస్తూ తీర్పిచ్చారు. ఇదిలావుండగా, సుమారు 800 మిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులను నిబంధనలకు విరుద్ధంగా దేశంలోకి తీసుకు వచ్చారని, దీనికి అప్పటి ఆర్థికమంత్రి చిదంబరం అనుమతించారని అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. ఈ డీల్ తరువాత చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి కోట్ల రూపాయల ముడుపులు అందాయని కేసు నమోదు చేసిన ఈడీ ఆయన్ను అరెస్ట్ చేసింది. ఆయనకు చెందిన 1.16 కోట్ల ఆస్తిని కూడా అటాచ్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles