Police punch woman in the head during arrest మహిళపై పోలీసు దాడి.. విచారణకు అదేశం

Police launch probe after video shows officer punching woman on nj beach

Lexy Hewitt, wildwood police, wildwood police officer, police punches woman on head, southern new jersey beach, emily weinman, philadelphia, new jersey, beach, wildwood nj, viral video

Police have launched an investigation after video posted online shows an officer punching a woman on a beach in southern New Jersey. Wildwood police said on its Facebook page that the 20-year-old Emily Weinman of Philadelphia faces multiple charges, including assaulting a police officer and resisting arrest.

ITEMVIDEOS: వైరల్ వీడియో: మహిళపై పోలీసు దాడి.. విచారణకు అదేశం

Posted: 05/29/2018 11:42 AM IST
Police launch probe after video shows officer punching woman on nj beach

ఒంటిరి మహిళలపై పోలీసులు దాడి చేస్తారా..? దౌర్జన్యంగా అమెను అదుపులోకి తీసుకుంటారా.? అందునా బీచ్ లో అమె సన్ బాత్ చేస్తున్న క్రమంలో అకస్మాత్తుగా వచ్చిన పోలీసుల అమెను అదుపులోకి తీసుకునేందుకు పాల్పడిన చర్యలను..  అదే బీచ్ లో మహిళ కేకలు, అరుపులతో నిద్ర తొలిగి మెలకున్న మహిళ.. జరుగుతున్న తతంగాన్ని అంతా తన వీడియోలో బంధించింది. పోలీసులు ఒంటరి మహిళపై ఇలా దౌర్జన్యం చేయడం చూసి తనను తాను నమ్మలేకున్నానని పేర్కొనింది. అయితే తానేమీ పోలీసులకు వ్యతిరేకం కాదని.. తన కళ్ల ముందు జరిగిన ఘటనను నలుగురితో పంచుకుంటున్నాను అంతేనంటూ లెక్సీ అనే యువతి పెట్టిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

పలువురు నెట్ జనులు పోలీసుల తీరుపై విమర్శలు గుప్పించడంతో.. మహిళను అదుపులోకి తీసుకునే క్రమంలో అమెను తలపై మోదాల్సిన అవసరమేంటని ప్రశ్నించడంతో.. న్యూజెర్సీ పరిధిలోని వైల్డ్ వుడ్ పోలీసులు విచారణ జరుపుతున్నామని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ వీడియోలో బీచ్ లో సేదదీరుతున్న ఓ మహిళను అదుపులోకి తీసుకోవాలన్న క్రమంలో మగ పోలీసులు, ఆమెపై దాడికి దిగి, తలపై బలంగా మోదుతున్న దృశ్యాలు ఉన్నాయి. ఎమిలీ వెయిన్ మన్ అనే 20 సంవత్సరాల యువతి ఇందులో కనిపిస్తున్న బాధితురాలని, ఆమె ఫిలడెల్ఫియా ప్రాంతానికి చెందినదని తెలుస్తోంది.

ఆమె ప్రతిఘటిస్తుంటే, ఓ అధికారి కాళ్లను గట్టిగా పట్టుకోగా, మరో అధికారి తలపై కనీసం రెండు సార్లు కొడుతున్నట్టు ఈ వీడియోలో కనిపిస్తోంది. తానేమీ తప్పు చేయలేదని ఆమె ఏడుస్తుండగా, చుట్టూ ఉన్నవారు "పోలీసులకు ఎదురు తిరగవద్దు... చెప్పినట్టు చెయ్యి" అని ఆమెకు సలహా ఇస్తుండటం కూడా వినిపిస్తోంది. ఈ ఘటనను వీడియో తీసిన లెక్సీ దీన్ని ట్విట్టర్ ఖాతాలో పెట్టగా, గంటల వ్యవధిలో 46 వేల షేర్లను తెచ్చుకుంది. పోలీసుల వైఖరిపై విమర్శలు వెల్లువెత్తగా, ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

కాగా, బీచ్ లో మద్యం సేవిస్తూ గడుపుతున్న మైనర్లను నిలువరించేందుకు వచ్చిన పోలీసులు.. ఫిలడెల్ఫియాకు చెందిన 20 ఏళ్ల ఎమిలీ వెయిన్మాన్ ను చూసి అమెను అరెస్టు చేశారు. అయితే అమె అరెస్టుకు సహకరించకపోవడం వల్లే పోలీసులు కఠినంగా వ్యవహరించారని వైల్డ్ వుడ్ పోలీసులు తమ ఫేస్ బుక్ అకౌంట్లో పేర్కోన్నారు. ఈ యువతి ఇప్పటికే పలు కేసుల్లో అభియోగాలను ఎదుర్కొంటుందని కూడా పోలీసులు పేర్కోన్నారు.  గతంలో అమె పోలీసులను అవమానించిన కేసుతో పాటు అరెస్టుకు సహకరించికుండా పోలీసుల విధులకు అటంకం కల్పించిన కేసులోనూ నిందితురాలి పేర్కోన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles