Sealdah Rajdhani Express pelted with stones in Bihar సీల్దా-రాజధాని ఎక్స్ ప్రెస్ పై రాళ్ల దాడి

Six passengers injured after stones pelted at sealdah rajdhani express

rajdhani express, sealdah express, sealdah rajdhani, sealdah rajdhani timings, sealdah rajdhani train no, sealdah rajdhani status, sealdah rajdhani 12314, sealdah rajdhani running status today, sealdah rajdhani schedule, sealdah rajdhani video, sealdah rajdhani running status

In a shocking incident that raises safety concerns, unidentified miscreants pelted stones on Sealdah Rajdhani Express at the Manpur Junction

సీల్దా-రాజధాని ఎక్స్ ప్రెస్ పై రాళ్ల దాడి

Posted: 05/29/2018 10:46 AM IST
Six passengers injured after stones pelted at sealdah rajdhani express

మరోమారు రైలు ప్రయాణికుల భద్రత అంశంపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యేలా ఘటనలు జరుగుతున్నాయి. రైల్వే ప్రయాణికుల భద్రతకు డోకా లేదని.. అనేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ప్రకటనలు గుప్పిస్తున్నా.. అటు భద్రతపై అందోళనలు మాత్రం రెకెత్తుతూనే వున్నాయి. రైలు ప్రయాణికులను టార్గెట్ చేస్తూ దొంగలు కొత్తకొత్త విధంగా దాడులకు తెగబడుతున్నారు. క్రితం రోజు సీల్దా - న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ రైలుపై గుర్తుతెలియని దుండగులు రాళ్లదాడికి పాల్పడ్డటంతో ఈ అందోళనలు మరింత పెరిగాయి.

సోమవారం అర్థరాత్రి మన్పూర్ జంక్షన్ వద్ద దుండగులు రైలు ప్రయాణికులను టార్గెట్ చేసుకుని రాళ్ల దాడికి పాల్పడటం అందోళన కలిగిస్తుంది. సరిగ్గా మాన్పూర్ జంక్షన్ వద్దకు రైలు చేరుకున్న తరువాత రెండు బోగీలపై దుండగులు రాళ్ల వర్షం కురిపించడంతో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు స్పందించి క్షతగాత్రులకు ప్రధమ చికిత్స అందించారు. కిటీకీల అద్దాలు ధ్వంసం కావడంతో గయా వద్ద వాటిని మార్చిన తర్వాత రైలు మళ్లీ బయల్దేరింది.

కాగా దుండగులు రాళ్లదాడికి పాల్పడడానికి కారణం ఏంటన్నది మాత్రం తెలియరాలేదు. అయితే అసలెందుకు ఈ విధమైన దాడి జరిగింది అన్న కొణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాళ్ల దాడికి గల కారణాలను తెలుసుకునేందుకు రైల్వే అధికారులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. రాళ్లదాడి జరిగిన వెంటనే దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించామనీ.. అయితే చీకటి మాటున వారంతా తప్పించుకుని పారిపోయారని స్థానిక అధికారులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sealdah express  Rajdhani Express  stone pelting  Indian railway  manpur junction  gaya  

Other Articles