online tickets can now predict conformation రైల్వే ప్రయాణికులకు శుభవార్త..

Railways new service can predict chances of ticket getting confirmed

IRCTC, Railway ticket status, Wait List, RAC. PNR status, Predicting chances of conformation, Train travel, Predictive algorithm, Probability of conformation, Railway

The refurbished IRCTC website has now gone live which will let the passengers know the probability of confirmation of wait-listed tickets.

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. అన్ లైన్ సీటు లభ్యతపై జోస్యం

Posted: 05/29/2018 12:25 PM IST
Railways new service can predict chances of ticket getting confirmed

ఆన్ లైన్ లో రైల్వే టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు శుభవార్త..! ఇకపై ఆన్ లైన్ రిజర్వు చేసుకునే టిక్కెట్ కు.. వెయిటింగ్‌ లిస్టు నంబరుతో పాటు.. బెర్త్‌ ఖరారయ్యే అవకాశముందా? లేదా..? వుంటే.. అది ఏ బెర్త్‌ రావొచ్చు? లోయర్‌, మిడిల్‌, అప్పర్‌ బెర్తా లేక ఆర్‌ఏసీనా? అనే సమాచారం కూడా ముందుగానే అందనుంది. దీంతో ప్రయాణికులు ఇతర రైళ్లలో సీటు లభ్యమయ్యే అవకాశం వున్నపక్షంలో ముందుగా రిజర్వు చేసుకున్న టికెట్లను రద్దు చేసుకునే వెసలుబాటు కూడా అందించినట్లే.

గడిచిన 13 ఏళ్ల రిజర్వేషన్ల వివరాలతో ‘డేటా మైనింగ్‌’ పరిజ్ఞానం ద్వారా భారత రైల్వే కేటరింగ్‌, పర్యాటక సంస్థ (ఐఆర్‌సీటీసీ) కొత్త సదుపాయాన్ని అమల్లోకి తెచ్చింది. అర్ధరాత్రి నుంచే తన వెబ్ సైట్లో ఈ సుదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘డేటా మైనింగ్‌ అనగానే.. డేటా తస్కరణ వంటి అనుమానాలతో ప్రయాణికులు హైరానాపడాల్సిన అవసరం లేదు. ఈ పరిజ్ఞానాన్ని రైల్వే సమాచారవ్యవస్థ కేంద్రం (సీఆర్‌ఐఎస్‌) రూపొందించింది. గడిచిన 13 ఏళ్ల డేటా ఆధారంగా.. ప్రత్యేకంగా రూపొందించిన అల్గారిథమ్‌.. ఎప్పటికప్పుడు మారే బుకింగ్‌ ట్రెండ్స్‌ ద్వారా ప్రయాణికులకు ముందుగానే బెర్త్‌ ఖరారయ్యే విషయాన్ని తెలియజేయవచ్చు. దీనిద్వారా చూచాయగా ఔట్ పుట్ ఏమిటనేది తెలుస్తుందని రైల్వే అధికారులు పేర్కోంటున్నారు.

దీనివల్ల ప్రయాణికులు తరచూ ఐఆర్సీటీసీ సైట్‌లోకి వెళ్లి.. పీఎన్ఆర్‌ స్టేటస్ చూసుకునే అవసరం కూడా తప్పినట్లు అయ్యింది. ఈ సదుపాయంతో రైల్వే సైటుకు తరచూ వచ్చే కస్టమర్ల సంఖ్య కూడా తగ్గుతుందని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. దీంతోపాటు.. ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ లో టికెట్‌ బుకింగ్‌ వ్యవస్థను మరింత సులభతరం చేసినట్లు వివరించారు. ‘ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ సమయంలో ప్రస్తుతమున్న ఫార్మాట్‌ను పూర్తిగా మార్చేశాం. ఆయా కాలమ్స్‌లో ఆటోఫిల్‌ డేటా ఉంటుంది. దీనివల్ల ప్రయాణికులు ప్రతి కాలాన్ని నింపాల్సిన అవసరం లేదు. పేమెంట్‌ ఆప్షన్‌ వద్ద కూడా యూజర్లు ముందుగానే ఆరు బ్యాంకుల వివరాలను నమోదు చేసుకోవచ్చు’ అని వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IRCTC  PNR status  Wait List  RAC. conformation chances  Predictive algorithm  Railways  

Other Articles