Pawan Kalyan slams TDP for ignoring healthcare ప్రజా సమస్యలు జనసేన దృష్టికి తీసుకురండీ: పవన్ కల్యాణ్

Teach chandrababu naidu a lesson in comming elections pawan kalyan

pawan kalyan, janasena, Pawan Kalyan srikakulam, pawan kalyan palakonda, pawan kalyan bus Yatra, pawan kalyan porata yatra, pawan kalyan march in palakonda, pawam kalyan meeting, pawan kalyan srikakulam yatra, Pawan Kalyan uttatandhra yatra, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan who is in srikakulam palakonda appeals his fans and party men to visit even remote villages and know the problems of all categories of people.

ప్రజా సమస్యలు జనసేన దృష్టికి తీసుకురండీ: పవన్ కల్యాణ్

Posted: 05/28/2018 05:17 PM IST
Teach chandrababu naidu a lesson in comming elections pawan kalyan

అభిమానులు సీఎం, సీఎం అంటూ నినదించడం కంటే.. మారుమూల గ్రామాలకు వెళ్లి అక్కడ తిష్టవేసిన సమస్యలను జనసేన దృష్టికి తీసుకురావాలని.. వాటి పరిష్కారానికి తాము త్రికరణ శుద్దిగా పాటుపడదామంటూ జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పాలకొండ ప్రజలు తమ ప్రేమాభిమానాలతో తనను నలిపేశారంటూ సంతోషం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పవన్ పోరాటయాత్ర కొనసాగుతోంది. పాలకొండలోని దుర్గగుడి నుంచి చెక్ పోస్ట్ వరకు నిర్వహించిన కవాతులో ఆయన పాల్గొన్నారు.

అనంతరం పాలకొండ బహిరంగసభలో పవన్ మాట్లాడుతూ, నేతలు ఇచ్చిన మాటలు మార్చారు కనుకనే, తాను జనంలోకి వచ్చానని అన్నారు. అభివృద్ది అన్నది కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితి చేయడం వల్ల మిగతా ప్రాంతాలు వెనుకబాటుకు గురవుతున్నాయన్నారు. అంతేకాకుండా ఇప్పటికే వెనుకబాటుతనంతో వున్న జిల్లాల్లో అభివృద్ది అంటే ఏంటో తెలియని స్థితికి చేరకుంటున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో గర్భీణి స్త్రీలకు అత్యవసర సమయాల్లో కావాల్సిన వసతులు కూడా లేకుండా ప్రాథమిక అరోగ్యకేంద్రాలు వున్నాయని పవన్ దుయ్యబట్టారు.

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదాపై మొదటి నుంచీ చిత్తశుద్ధి ఉంటే ఉత్తరాంధ్ర వెనుకబడేది కాదని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అటకెక్కించారని, అడవిపుత్రులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తోటపల్లి రిజర్వాయర్ గురించి ప్రస్తావించారు. ఈ రిజర్వాయర్ కోసం ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని, రైతు సమస్యలు పరిష్కారం కావడం లేదని మండిపడ్డారు. రైతులు కంటతడి పెడుతుంటే తనకు ఎంతో బాధ కలుగుతోందని వాపోయారు.

ఉత్తరాంధ్ర జిల్లాలు దశాబ్దాకాలాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయని అన్నారు. పాలకులు మారుతున్నారు.. రాజకీయ నేతలు మారుతున్నారు.. అయినా ఇక్కడి జిల్లావాసులు స్థితిగతులలో మాత్రం మార్పులు రావడం లేదు. అంధకారం నుంచి గాడాంధకారంలోకి తోసివేయబడుతున్నారని పవన్ అందోళన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోగొట్టడానికే తాను ఈ మూడు జిల్లాలను ఎంచుకుని పోరాట యాత్ర చేస్తున్నానని అన్నారు. మాటమాట్లాడితూ రాష్ట్రంలో సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన వ్యక్తినని చెప్పుకునేవారు.. నలభైఏళ్ల అనుభవం వుందని ప్రగల్భాలు పలికేవాళ్ల హయాంలో కూడా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోవడం లేదని పవన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  gangavaram  ichchapuram  porata yatra  bus yatra  andhra pradesh  politics  

Other Articles