motkupally narsimlu expelled from telangana TDP టీడీపీ యూజ్ అండ్ త్రో.. మోత్కుపల్లి బయటకు పో.

Motkupally narsimlu expelled from telangana tdp

mothkupalli slams chandrababu, mothkupalli fires on chandrababu, mothkupalli on chandrababu, mothkuaplli ntr ghat, mothkupalli chandrababu ntr ghat, mothkupallu ntr birth anniversary, Chandrababu, mothkupalli narsimlu, NTR, birth aniversary, lakshmi parvathi, back stabbing, nandamuri, nara, andhra pradesh, politics

After his sensational allegations on Telugu desam party chief and andhra pradesh chief minister chandrababu today at ntr ghat, tdp leadership had expelled motkupally narsimlu expelled from party.

టీడీపీ యూజ్ అండ్ త్రో.. మోత్కుపల్లి బయటకు పో..

Posted: 05/28/2018 06:07 PM IST
Motkupally narsimlu expelled from telangana tdp

స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు జయంతి సందర్బంగా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించి.. ఏపీ ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విమర్శలు, అరోపణలు చేసిన తెలంగాణ టీడీపీ సీనయర్ నేత మోత్కుపల్లి నర్సింహులును టీడీపీ పార్టీ నుంచి బహిష్కరించింది. అన్నగారి హయాంలోని పార్టీకి.. ప్రస్తుతమున్న పార్టీకి చాలా వత్యాసం వుందని.. నాడు పేదలను నేతలుగా తయారు చేసిన పార్టీ.. నేతు సీట్లను సంపన్నులకు అమ్ముకుంటుందని అరోపణలు చేసిన టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ మేరకు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ఓ ప్రకటన చేశారు.

విజయవాడలో జరుగుతున్న రెండో రోజు మహానాడు వేదికగా రమణ ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ, మోత్కుపల్లి విపరీత ధోరణితో పార్టీపై విమర్శలు చేశారని, ఆయన వ్యవహారం తార స్థాయికి చేరిందని, పార్టీని బలహీనపరిచే విధంగా ఆయన మాట్లాడారని మండిపడ్డారు. తనకు గవర్నర్ పదవి రాలేదన్న అక్కసుతోనే రమణ విమర్శలు చేశారని అన్నారు. మోత్కుపల్లికి గవర్నర్ పదవి ఇవ్వాలని నాడు కేంద్రాన్ని చంద్రబాబు కోరారని, అందుకు కేంద్రం కూడా అంగీకరించిందని చెప్పారు.

అయితే, తమిళనాడు గవర్నర్ గా తనను నియమించాలని మోత్కుపల్లి కోరారని, అందుకు కేంద్రం అంగీకరించలేదని రమణ చెప్పారు. పార్టీ తనకోసం ఎంతో చేస్తుండగానే సహనంతో వేచిచూడాల్సిన సీనియర్ నేత పార్టీ అధిష్టానంపైనే తీవ్ర విమర్శలు చేయడం సముచితంగా లేదని అన్నారు. ఎన్టీఆర్ పై టీడీపీ నేతలందరికీ అభిమానం వుంటుందని అలాంటిది ఆయన జయంతి వేడుక రోజున ఆయన స్థాపించిన పార్టీపై మోత్కుపల్లి నర్సింహులు కాలకూటవిషాన్ని చిమ్మారని రమణ అరోపించారు.

అధికారం కోసం హరికృష్ణకు ఆరు మాసాలు మాత్రమే మంత్రి పదవిని కల్పించి తరువాత విసిరేసిన చంద్రబాబు.. దగ్గుబాటు, పురందరేశ్వరీలను కాళ్లపై బడి.. వాళ్లను కూడా విసిరేసిన చంద్రబాబు.. అందరినీ యూజ్ అండ్ త్రో విధానంతో అవసరానికి వాడుకుని పక్కన బెట్టారని అరోపించిన మోత్కుపల్లిని కూడా చంద్రబాబు అదే విధంగా అవసరం తీరిన తరువాత పార్టీ నుంచి బహిష్కిరించారని నెట్ జనులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles