mothkupalli slams chandrababu ఎన్టీఆర్ మరణానికి కారణం ఆయనే: మోత్కుపల్లి

Ttdp leader mothkupalli narsimlu fires on ap cm chandrababu

mothkupalli slams chandrababu, mothkupalli fires on chandrababu, mothkupalli on chandrababu, mothkuaplli ntr ghat, mothkupalli chandrababu ntr ghat, mothkupallu ntr birth anniversary, Chandrababu, mothkupalli narsimlu, NTR, birth aniversary, lakshmi parvathi, back stabbing, nandamuri, nara, andhra pradesh, politics

telangana senior telugu desam party leader mothkupalli narsimlu fires on Andhra pradesh CM chandrababu, alleges him the culprit behind NTR death

ITEMVIDEOS: పశ్చాతాపం: ఎన్టీఆర్ మరణానికి కారణం ఆయనే: మోత్కుపల్లి

Posted: 05/28/2018 12:52 PM IST
Ttdp leader mothkupalli narsimlu fires on ap cm chandrababu

మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ మరణానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుట్రలు, వెన్నుపోటు రాజకీయాలే కారణమని తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన ఆరోపణలు చేశారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన ఆయన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ పేరును ఉచ్ఛరించడానికి కూడా చంద్రబాబుకు అర్హత లేదని అన్నారు. చంద్రబాబును మించిన నట చక్రవర్తి లేరని, ఈ వ్యవస్థకు ఆయన వల్ల ముప్పు ఉందని విమర్శించారు.

సమసమాజ స్థాపన కోసం ఎన్టీఆర్ పార్టీని స్థాపించి తనలాంటి ఎంతో మంది పేదలను రాజకీయాల్లో నడిపించారని కీర్తించారు. తెలుగుదేశం పార్టీని నందమూరి వంశీయుల నుంచి చాకఛక్యంగా హైజాక్ చేసిన చంద్రబాబు.. దానిని నారా వారి పార్టీగా మార్చారని, అన్నగారి కుటుంబసభ్యులను అవసరానికి వాడుకుని విసిరేసారని కూడా మండిపడ్డారు. అన్నగారి హాయంలో తెలుగువారి ఆత్మగౌరవ పార్టీగా బాసిల్లిన పార్టీ పేదలకు తిండిపెట్టిందని ఎన్టీఆర్ చేసిన సంక్షేప పథకాలను వల్లేవేశారు. అయితేనారా వారి హయంలో పార్టీ ఆత్మవంచన పార్టీగా మారిందని దుయ్యబట్టారు. కేవలం సంపన్నుల పార్టీగా మారిందని మండిపడ్డారు.

చంద్రబాబు నాయుడు కేవలం డబ్బుకోసమే రాజకీయాలను వక్రబాష్యం చెబుతున్నారని ఫైర్ అయ్యారు. టీడీపీలో రాజ్యసభ సభ్యులను పరిశీలిస్తే.. ఈ విషయం బోధపడుతుందన్నారు. ఎవరైనా డబ్బులేని పార్టీ నేతలు రాజ్యసభ సభ్యులు కాగలిగారా..? అంటూ ఆయన ప్రశ్నించారు. రాజ్యసభ సీట్లను రూ.100 కోట్లకు అమ్ముకునే వ్యక్తి పార్టీకి అధినేతా.? అంటూ అక్రోశాన్ని వెల్లగక్కారు. ఓటు నోటు కేసులో పట్టపగలు పట్టుబడిన చంద్రబాబు.. దొరకని దొంగ అని విమర్శిస్తూనే.. ఈ కేసులో దొరికినందుకు ఆయన కేసీఆర్ కు సరెండర్ అయ్యారని అరోపించారు. ఆయన కుట్రలు, కుతంత్రాలు ఇంకా సాగుతున్నాయని అన్నారు.

వారసత్వ రాజకీయాలకు దూరంగా, తమ సత్తా ఏంటో చాటుకునేందుకు కొత్తగా పార్టీలను పెట్టి ప్రజల్లోకి వెళ్తున్న వైఎస్‌ జగన్‌, పవన్ కల్యాణ్ లను విమర్శించే నైతిక హక్కు కూడా చంద్రబాబు లేదని మోత్కుపల్లి మండిపడ్డారు. పవన్, జగన్ లు ఎవరినీ వెన్నుపోటు పోడవకుండా, ఎవరి జెండాను లాక్కోకుండా, సొంత పార్టీలు పెట్టుకున్నారని, వాళ్లు మగాళ్లని అన్నారు. చంద్రబాబు మాత్రం ఎన్టీఆర్‌ వద్ద టీడీపీ జెండాను దొంగతనం చేశారని విమర్శించారు. తక్షణమే టీడీపీని నందమూరి కుటుంబానికి అప్పగించాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణలో చంద్రశేఖరరావు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చంద్రబాబు కుట్రలు పన్నారని మోత్కుపల్లి ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో వెంటనే చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆధికారం కోసం పిల్లనిచ్చిన మామను చంపిన చంద్రబాబు.. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా కూల్చే ప్రయత్నం చేశారన్నారు. కుట్రలు, కుతంత్రాలకు చంద్రబాబే కారణం అన్నారు. పార్టీ నుంచి పంపించి వేయటానికి పార్టీలో కుట్ర జరుగుతుందన్నారు. పార్టీని నమ్ముకున్న వారి కంటే.. డబ్బున్న వారికే ప్రాధాన్యత పెరిగిందన్నారు. ఏ అర్హత ఉండి రేవంత్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వల్లే తెలంగాణలో పార్టీ మనుగడ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు నయవంఛనలు, కుట్రలు, కుతంత్రాలను వివరిస్తూ అవసరమైతే ఆంధ్రప్రదేశ్ లో రథయాత్ర చేస్తానని మోత్కుపల్లి అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కమిషన్ల రూపంలో చంద్రబాబు వందల కోట్లు దండుకున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. మరోవైపు వందలు కోట్లతో ఇళ్లు కట్టుకున్నారని అన్నారు. ఏపీ ప్రజలెవరూ చంద్రబాబుకు ఓటెయ్యదని.. ఓసారి జగన్‌ను, మరోసారి పవన్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. లేదంటే లెఫ్ట్‌ పార్టీలనైనా గెలిపించాలని కోరారు. చంద్రబాబు దొరకని దొంగ అని, ఆయణ్ని ఓడించేందుకు అవసరమైతే ఆంధ్రలోనైనా రథయాత్ర చేస్తానని మోత్కుపల్లి చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles