nandamuri family should takeover TDP నారా వద్దు.. నందమూరే ముద్దు: లక్ష్మీపార్వతి

Lakshmi parvathi appeals nandamuri family to takeover tdp

Lakshmi parvathi slams chandrababu, Lakshmi parvathi fires on chandrababu, Lakshmi parvathi on chandrababu, Lakshmi parvathi ntr ghat, Lakshmi parvathi chandrababu ntr ghat, Lakshmi parvathi ntr birth anniversary, Chandrababu, Lakshmi parvathi, NTR, birth aniversary, nandamuri, nara, andhra pradesh, politics

After two decades of now Telugu desam party founder president NTR wife Lakshmi parvathi appeals nandamuri family to takeover party leadership for sustaining the party in telugu states,

నారా వద్దు.. నందమూరే ముద్దు: లక్ష్మీపార్వతి

Posted: 05/28/2018 01:32 PM IST
Lakshmi parvathi appeals nandamuri family to takeover tdp

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సర్గీయ ఎన్టీరామారావు 95వ జయంతి సందర్భంగా.. ఆ పార్టీ అధ్యక్షబాధ్యతలను నిర్వహిస్తున్న ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై దాదాపుగా రెండు దశాబ్దాల తరువాత విమర్శల పర్వం జోరందుకుంది. ఎన్టీఆర్ జయంతి రోజునే.. ఆయనకు వెన్నుపోడు పోడిచారంటూ చంద్రబాబును ఇటు తెలంగాణలో సొంతపార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ఇవాళ మోత్కుపల్లి నరసింహులు తన అవేదనను వ్యక్తం చేసిన తరువాత.. ఎన్టీఆర్ సతీమణి, వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి కూడా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నారా కుటుంబాన్ని రాజకీయాల నుంచి బహిష్కరించాలని అన్నారు. నారా కుటుంబహయంలో ఇక పార్టీ వుంటే తెలుగురాష్టాల్లో అది మనజాలదని విమర్శించారు. ఎన్టీఆర్ వారసుల్లో ఒకరు టీడీపీ పగ్గాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అప్పుడు పార్టీ బతికి బట్టకట్టే అవకాశం వుందని లేకపోతే ఇక పార్టీ చరిత్రకే పరిమితమయ్యే ప్రమాదముందని అమె అందోళన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ వారసుల్లో కేవలం బాలకృష్ణకు మాత్రమే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, మిగిలిన వారిని పక్కన పెట్టేశారని మండిపడ్డారు.

చివరకు ఎన్టీఆర్ చైతన్యరథానికి సారధిగా వ్యవహరించి.. ప్రజల కష్టసుఖాలను అర్థం చేసుకున్న హరికృష్ణకు కూడా పార్టీలో గుర్తింపులేని స్థాయికి తీసుకువచ్చి..దిగజార్చారని విమర్శించారు. ఇప్పుడు టీడీపీ నాయకులకు పార్టీ అవిర్భావం, పార్టీ విధానాలు, కూడా తెలియవని, చంద్రబాబు చెబితే ఎవరినైనా విమర్శిస్తారని అమె దుయ్యబట్టారు. ఢిల్లీకి గులాంగిరి చేస్తున్న చంద్రబాబు... టీడీపీని ఆత్మవంచన పార్టీగా మార్చి, పార్టీని అమ్మేసేందుకు యత్నిస్తున్నరని లక్ష్మీపార్వతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీని కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు.

చంద్రబాబు ఒక పెద్ద ఆక్టోపస్ అని, రాబందు అని అన్నారు. ముఖ్యమంత్రి అయ్యేందుకే ఎన్టీఆర్ ను చంద్రబాబు గద్దె దించారని ఆరోపించారు. ఎన్టీఆర్ ప్రధాని కాకుండా ఆనాటి కాంగ్రెస్ ప్రధానితో చంద్రబాబు చేతులు కలిపారనే విషయం తమకు తెలిసిందని చెప్పారు. హైదరాబాదులో ఎన్టీఆర్ గత జయంతి వేడుకలకు, ఇప్పటి వేడుకలను చాలా తేడా ఉందని ఆమె అన్నారు. ఘాట్ పరిసరాలు, రోడ్డుకు ఎలాంటి అలంకరణలు లేకుండా, బోసిగా ఉండటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ను టీడీపీకి దూరం చేసే కుట్ర జరుగుతోందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  Lakshmi parvathi  NTR  birth aniversary  nandamuri  nara  andhra pradesh  politics  

Other Articles