thoothukudi: 11 killed in police firing తూత్తకూడిలో పోలీసుకాల్పులు.. 11 మంది మృతి..

Anti sterlite protests 11 killed in police firing during violent protests

anti-sterlite protests, sterlite copper, sterlite copper protests, thoothukudi protests, tuticorin protests, m k stalin, rahul gandhi, rajni kanth, kamal hassan, tamilnadu

Protests against Vedanta's Sterlite copper unit in Tamil Nadu's Thoothukudi took a violent turn with at least 11 people being killed in alleged police firing.

తూత్తకూడిలో పోలీసుకాల్పులు.. 11 మంది మృతి.. ఖండించిన నేతలు

Posted: 05/22/2018 06:51 PM IST
Anti sterlite protests 11 killed in police firing during violent protests

తమిళనాడు రాష్ట్రంలోని తూత్తకుడి రణరంగంగా మారింది. అక్కడి స్టెరిలైట్ రాగి కర్మాగారాన్నివిస్తరించాలని జరుగుతున్న యత్నాలను నిరసిస్తూ ప్రజలు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించిన ఆందోళనకారులు జిల్లా కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించడంతో పరిస్థితులు అదుపు తప్పాయి. అయితే, పట్టణంలో 144 సెక్షన్ విధించినప్పటికీ స్థానిక చర్చి వద్ద గుమిగూడిన నిరసనకారులు తొలుత కర్మాగారం వైపు వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో కలెక్టరేట్ ను ముట్టడించేందుకు నిరసనకారులు యత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా ఉద్రిక్తవాతావరణం ఏర్పడింది.

ఈక్రమంలో రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు..పలు వాహనాలకు నిప్పంటించారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించిన అనంతరం లాఠీఛార్జి చేశారు. అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తొమ్మిది మంది మృతి చెందారు. ఈ సంఘటన నేపథ్యంలో అదనపు పోలీస్ బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి జయకుమార్ మాట్లాడుతూ, తప్పనిసరి పరిస్థితుల్లోనే పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని అన్నారు.  కాగా, 1996లో స్టెరిలైజ్ పరిశ్రమను ఇక్కడ ప్రారంభించారు. అప్పటి నుంచి తరచుగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ‘స్టెరిలైజ్’ కారణంగా భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, ప్రజలకు శ్వాస సంబంధిత వ్యాధులు తలెత్తుతున్నాయని తూత్తకుడి వాసులు వాపోతున్నారు.

రేపు తూత్తకుడి బంద్.. నేతల ఖండన

ఈ సంఘటన నేపథ్యంలో రేపు తూత్తకుడి జిల్లా బంద్ కు వాణిజ్య సంస్థలు పిలుపు నిచ్చాయి. ఆందోళనకారులపై పోలీసుల దాడిని ఖండించిన వాణిజ్య సంస్థలు ఈమేరకు నిర్ణయం తీసుకున్నాయి. ఈ సంఘటనపై తమిళనాడు ప్రతిపక్ష, విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. తమిళనాడులో అల్లర్ల నేపథ్యంలో డీఎంకే అగ్రనేత స్టాలిన్ బెంగళూరులో తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వెళ్లొద్దని స్టాలిన్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. రేపు తూత్తకుడి బాధితులను ఆయన పరామర్శించనున్నారు.

మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని, డీజీపీ రాజేంద్రన్ ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తూత్తికూడిలో మరణాలన్ని ప్రభుత్వ హత్యలని ఆయన అరోపించారు. అన్నాడీఎంకే ప్రభుత్వం ఈ హత్యలకు బాధ్యత వహించాలని అన్నారు. ప్రజలు పోరాటం చేస్తుంటే వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నం చేయకుండా ఉక్కుపాదం మోపాలని చూడటం వ్లేల ఈ పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని దుయ్యబట్టారు.

ఇక ఈ ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా తనదైన శైలిలో ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్న ఉగ్రవాదమని తీవ్రవ్యాఖ్యలు చేశారు. తూత్తుకుడిలో 9 మంది పౌరులు పోలీసుల తూటాలకు బలికావడం దారుణమని, ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రేరణతో జరుగుతున్న ఉగ్రవాదమని వ్యాఖ్ాయనించారు. తమకు జరుగుతున్న అన్యాయంపై పోరాడుతున్న దేశపౌరులను రాష్ట్ర ప్రభుత్వం చంపివేయించిందని మండిపడ్డారు. ఈ ఘటనలో అమరులైనవారికి తన ప్రగాడ సంతాపాన్ని వ్యక్తం చేసిన ఆయన వారి కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేశారు.

ఇక తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ దారుణ ఘటనలను ఖండించారు. ప్రజల మనోభావాలను, సెంటిమెంట్లను ప్రభుత్వాలు అర్థం చేసుకోకపోవడం వల్లే ఈ మరణాలు సంభవించాయన్నారు. ప్రజాఉద్యమాలను అర్థం చేసుకుని అందుకుఅనుగూణంగా స్పందించాల్సిన ప్రభుత్వ.. పోలీసులను వారిపైకి ఉసిగోల్పి అమాయకుల ప్రాణాలను బలిగొనిందని అవేదన వ్యక్తం చేశారు. ఈ మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని రజనీకాంత్ అన్నారు.

మక్కళ్ నీది మయ్యం అధినేత కమలహాసన్ ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. తూత్తకూడి స్టెరిలైట్ రాగి పరిశ్రమ విస్తరణ పనులపై ప్రజల శాంతియుత పోరాటాన్ని ప్రభుత్వాలు విస్మరించడం వల్లే ఈ మరణాలు సంభవించాయని అన్నారు. విస్తరణ పనులను అపాలని డిమాండ్ ను విస్మరించిన ప్రభుత్వాలు ప్రజల వినతికి కూడా విస్మరించాయని, దీంతో ప్రజలు శాంతియుత అందోళనా కార్యక్రమాలను కావాలని ప్రభుత్వం పోలీసులను ప్రేరేపించిందని, ఈ ఘటనలో పదరకొండు మంది మరణించగా, పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారని .. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరి మూలంగా జరిగిన హత్యలని కమల్ పేర్కోన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles