want people government vote for janasena: pawan kalyan ప్రజాప్రభుత్వం కావాలంటే.. జనసేన అధికారంలోకి రావాలి: పవన్

Want people government vote for janasena pawan kalyan

pawan kalyan, janasena, Pawan Kalyan bus Yatra, gangavaram, pawan kalyan porata yatra, palasa, ichchapuram, kavathu pradharshana, pawan kalyan press meet, pawan kalyan srikakulam yatra, pawan kalyan ichhapuram yatra, Pawan Kalyan uttatandhra yatra, Pawan Kalyan gangapooja, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan who is in uttarandhra porata yatra appeals palasa voters to vote for janasena for irradicating backwardness of the region and to get people government in the state after kavathu programe

ITEMVIDEOS: ప్రజాప్రభుత్వం కావాలంటే.. జనసేన అధికారంలోకి రావాలి: పవన్

Posted: 05/22/2018 05:48 PM IST
Want people government vote for janasena pawan kalyan

రానున్న సార్వత్రిక ఎన్నికలలో తన పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, దీంతో ప్రజలు మునుపెన్నడూ లేని విధంగా ప్రజా ప్రభుత్వ పాలనను అందుకుంటారని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. తాను నటనకు ఓనమాలు నేర్చుకుంది శ్రీకాకుళం జిల్లాలోనే నని, అయితే అప్పుడు ఎలావుందో ఇప్పుడు అంతకంటే వెనకబాటుకు ఈ జిల్లా గురైందని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత శ్రీకాకుళం జిల్లా అభివృద్దిలో ఉరుకులు పరుగులు వేస్తుందని అన్నారు. ఇక వెనకబాటు తనానికి ఉత్తరాంధ్రకు సంబంధం వుండదని ఆయన ప్రజలకు హామి ఇచ్చారు.

అయితే ఉత్తరాంధ్రలో ప్రజల్లో మాత్రమే వెనుకబాటు తనం వుందని, రైతులు, సామాన్యులు, కార్మికులు, మత్య్సకారులు జీవితాల్లో మాత్రమే అంధకారం నెలకొందని, చివరాఖరున కార్మికులు, ఉద్యోగల జీవితాల్లో వెలుగులు కనిపించడం లేదన్న పవన్.. మరి రాజకీయ నాయకులకు మాత్రం ఆ అంధకారం ఎందుకు పరిమితం కాలేదని ప్రశ్నించారు. నాయకులు హాయిగా వుంటారు తప్ప.. ప్రజలకు మాత్రమే కష్టాలా.? అని నిలదీశారు.

ఈ సందర్భంగా సీఎం, సీఎం అంటూ జనసైనికులు, అభిమానులు నినాదాలు చేయడాన్ని ఆయన కొంత అసహనానికి గురయ్యారు. మీరు నినదిస్తే నేను ముఖ్యమంత్రిని కాను.. మీరందరూ ఓటర్లుగా నమోదు చేసుకుని.. ఆ తరువాతమీ ఇంట్లో వుండే అక్కచెలళ్లతో , అమ్మానాన్నలతో ఓట్లు వేయిస్తే.. తప్పక తాను సీఎం అవుతానని చెప్పారు. తాను ఉత్తరాంధ్ర నుంచే తన పోరాట దీక్షను ప్రారంభించడానికి ఈ తిరుగుబాటు నేల అని.. తాను నమ్మి గత ఎన్నికలలో ఓట్లేయమని చెప్పిన ప్రభుత్వాలు.. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా..  ప్రజలు చేస్తానన్న మేలు మర్చిపోయాయని.. ఇలాంటి నేపథ్యంలో తాను ఆయా ప్రభుత్వాలపై తిరుగుబాటుగా ఇక్కడి నుంచే పోరాట యాత్రను ప్రారంభిస్తున్నానని చెప్పారు.

ఉత్తరాంధ్ర పోరాట యాత్రంలో మూడో రోజు బిజిబిజీగా గడుపుతుతన్న పవన్ కల్యాణ్.. శ్రీకాకుళం జిల్లా పలాసకు చేరకున్నారు. స్పెషల్ స్టేటస్ కోసం పోరాటంలో భాగంగా పలాసలో పవన్ నిర్వహించిన కవాతు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పెద్ద ఎత్తున జనసైనికులు హాజరై కవాతు నిర్వహించారు.  ఏ పనినైనా త్రికరణ శుద్దిగా చేయడం అలవాటని.. అంతే త్రికరణశుద్దిగా కేంద్రంలో బీజేపిని, రాష్ట్రంలో టీడీపీనీ అధికారంలోకి తీసుకువచ్చానని అన్నారు. టీడీపీ పదేళ్ల పాటు ప్రతిపక్షంలో వుందని.. ఆ పార్టీ నేతకు అపార అనుభవం వుందని నమ్మితే.. నమ్మిన రాష్ట్రప్రజలనే నట్టేట ముంచుతున్నారని విమర్శించారు.

2019 ఎన్నికలలో జనసేన అన్ని స్థానాలల్లో పోటీ చేస్తుందని పవన్ అన్నారు. తాను కేవలం పదేళ్ల అనుభవంతో మాట్లాడుతున్నానని చెప్పిన జనసేనాని.. టీడీపీ ప్రభుత్వంలో అధికారంలో వుందంటే.. అందుకు జనసేన పార్టీ సైనికులు కారణమని అన్నారు. విభజన హామీలతో పాటు ఎన్నికల హామీలను కూడా నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. పాలకులు చేసేన దశాబ్ధాల తప్పుకు ఉత్తరాంధ్ర వెనుకబడిందని ఆయన విమర్శించారు. ఇంకా ఈ జిల్లాలను వెనకబాటుగా చూపించి తాము మాత్రం ఎదిగిపోవాలని రాజకీయ నేతలు, పాలకులు భావిస్తున్నారని దుయ్య బట్టారు.

ఉద్దానం సమస్య చూసి కలత చెందాను.. ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లగా.. తూతూ మంత్రంగా సమస్యను పరిష్కరించి.. మమ అనిపించారని అరోపించారు. ఈ రోజుకీ ఆ సమస్యపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని అన్నారు. ఇప్పటికీ అక్కడ ఒక్క మంచి స్పెషలిస్టు డాక్టర్లు లేరని అవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు వెనుకబడిన జిల్లా అని పేర్కొంటూ.. కనీసం జిల్లా పీహెచ్సీ కేంద్రాల్లో మహిళా వైద్యులను కూడా నియమించలేని పరిస్థితి ఈ ప్రభుత్వాల చలవేనని అన్నారు. ఉద్దానం సమస్యపై తాము స్పందించి అక్కడికి వెళ్లే వరకు ప్రభుత్వాలు మొద్దు నిద్రపోతున్నాయని మండిపడ్డారు.

గత ఎన్నికల సమయంలో రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే భూకబ్జాలు పెరుగుతాయని చెప్పి.. తన సహకారం కోరిన టీడీపీ నేతలు.. ఇప్పుడు పలాసలో ఏం జరుగుతుందో చూడాలని చెప్పారు. భూకబ్జా చేస్తున్న ప్రజాప్రతినిధులపై ఎదురుతిరిగిన ప్రజలపై కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇకపై అలా జరగదని, ప్రజల పక్షాన జనసేనికులు వుంటారని, ఎవరు తప్పులు చేసినా చొక్కాపట్టుకుని నిలదీస్తామని పవన్ అన్నారు.

తాను కానీ జనసైనికులు కానీ ఎవరికీ బయపడేది లేదని అన్నారు. తమది తమది కోత్త తరం, యువతరం.. అవసరమైతే కత్తులు నూరే తరం.. అన్యాయాలు, అక్రమాలు జరిగితే ఎవరినైనా నిలదీసే తరమిన ఆయన ఉద్ఘాటించారు. టీడీపీని అధికారంలోకి తీసుకువస్తే.. పలాసలో 19 ఏళ్ల కుర్రవాడు జీవితాన్ని చిదిమేసి తనకు బహుమతిగా ఇచ్చారని పవన్ అవేదన వ్యక్తం చేశారు. ఆ కన్నతల్లి కడుపుకోత.. టీడీపీ నేతలుకు తగలితీరుతుందని పవన్ అన్నారు. ఇక మన బిడ్డలు దహాంతో పిడకట్టుకుపోయినా ఫర్వాలేదు కానీ.. నేతలకు ప్రాజెక్టులలో డబ్బులు కావాలని అవి లేకపోతే ప్రాజెక్టులనే అపేస్తారని పవన్ అరోపించారు.

శ్రీకాకుళం జిల్లా ప్రజల్లు జీఎస్టీలో భాగంగీ సీజీఎస్టీ కడుతున్నారు.. ఇటు రాష్ట్రప్రభుత్వానికి ఎస్జీఎస్టీ కడుతున్నారు.. అది చాలదన్నట్లు ఇక్కడి ప్రజలపై అల్లుడి టాక్స్ కూడా పడుతుందని.. అవి ఇవి కట్టి తినడానికే డబ్బులు చాలకపోగా, తమ చేతిలోంచి అల్లుడి టాక్స్ రూపంలో మిగిలింది దోచేస్తే.. తామెలా బతకాలని పవన్ కల్యాన్ ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం అల్లుడి టాక్సులను తొలగించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ప్రజలు పడుతున్న కష్టాలను చూసి కళాకారులు గళం విప్పుతున్నారని.. ప్రజల కన్నీళ్లను చూడలేక కళాకారులు పాటలు పాడారని, వారి పాటలే.. తిరుగుబాటుకు దొహదపడ్డాయని అన్నారు. దశాబ్దాలుగా ఇంకా అదే దోపిడీ జరుగుతుందని ఇకపైనా ఈ దోపిడి రాజకీయాలకు చరమాంకం పాడాలని పవన్ పిలపునిచ్చారు. రానున్న ఎన్నికలలో జనసేను ఓటు వేసి ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles