pm modi condolence on varanasi flyover deaths కర్ణాటక విజయాన్ని అస్వాదించని ప్రధాని.. తిప్పికొట్టిన తృణముల్ కాంగ్రెస్

On pm modi s murder of democracy in bengal remark trinamool s comeback

Siddaramaiah, Trunamul congress, murder of democracy, PM Modi, BS Yeddyurappa, Amit Shah, Rahul Gandhi, Congress, BJP, JDS, Kumara Swamy, karnataka, politics

A day after 20 people were killed in poll related violence, Prime Minister Narendra Modi today expressed deep concern about what he called "the murder of democracy in West Bengal".

కర్ణాటక విజయాన్ని అస్వాదించని ప్రధాని.. తిప్పికొట్టిన తృణముల్ కాంగ్రెస్

Posted: 05/16/2018 09:35 AM IST
On pm modi s murder of democracy in bengal remark trinamool s comeback

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కుడి ఎడమైంది. అధికారాన్ని మళ్లీ అందుకుంటుందని భావించిన కాంగ్రెస్ చతికిలపడగా, బీజేపి అతిపెద్ద పార్టీగా అవతరించినా.. అధికారాన్ని మాత్రం అందుకునేందుకు అవకాశమే లేకుండా ఓటర్లు తీర్పునిచ్చారు. ముందుకు నుంచి కింగ్ మేకర్ గా మారుతుందన్న ప్రచారంతో ఓటర్లలో ఓ మార్కు వేసుకున్న జేడీఎస్ మాత్రం సంబరాలు చేసుకుంటుంది. అయితే ఈ ఫలితాలను మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ అస్వాధించలేకపోతున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు.

ప్రధాని స్వయంగా ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో నిర్మాణంలో వున్న ఫ్లై ఓవర్ కూలి పన్నెండు మంది మృత్యువాత పడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ లో కూడా తమ ప్రభుత్వమే అధికారంలో వుండటం.. నిర్మాణంలో వున్న ఫ్లైఓవర్ కూలడంతో విమర్శలు వెల్లవెత్తుతున్న క్రమంలో.. ప్రధాని నరేంద్రమోడీ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో క్షతగాత్రులు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేశించిన ఆయన.. వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

వారణాసి ఘటన క్రమంలో కర్ణాటకలో తమ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినా.. దానిని ప్రధాని అస్వాదించలేకపోతున్నారు. అయితే తృణముల్ కాంగ్రెస్ మాత్రం ప్రధాని ద్వంద విధానాలను నిర్ద్వందంగా తిప్పికోట్టింది. తమ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో కొల్ కతా నగరంలో బ్రిడ్జి కూలిన ఘటనను కూడా రాజకీయంగా వినియోగించుకున్న బీజేపి.. ఇప్పుడు మాత్రం సానుభూతి వ్యక్తం చేయడం విడ్డూరంగా వుందని విమర్శలు చేసింది. అది చాలదన్నట్లు పశ్చిమ బెంగాల్ లోని పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలపై కూడా ధీటైన సమాధానాలు ఇచ్చింది.

పశ్చిమ బెంగాల్ లో జరిగిన పంచాయితీ ఎన్నికలలో అక్కడి అధికార ప్రభుత్వం అండతో ప్రజాస్వామ్యం పట్టపగలు హత్య చేయబడిందన్న వ్యాఖ్యలు చేశారు ప్రధాని. అయితే ఈ వ్యాఖ్యలను తృణముల్ తిప్పికోట్టింది. పశ్చిమ బెంగాల్ లో ప్రజాస్వామ్యం అంతరించడంపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని వ్యాఖ్యలను తృణముల్ అదేస్థాయిలో తిప్పికోట్టింది. ఈ సందర్భంగా పార్టీకి సెక్రటరీ జనరల్ పార్థ చటర్జీ బెంగాల్ లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని దేశ ప్రజల దృష్టిని వారణాసి ఘటన నుంచి, కర్ణాటకలో పరాభవం నుంచి బెంగాల్ కు మార్చేందుకు చేసే కుటిల యత్రాలని అభివర్ణించారు.

ప్రధాని నరేంద్రమోడీ సహా అమిత్ షా, బీజేపి కేంద్రమంత్రులు, అర్ఎస్ఎస్ సహా పలు సంఘాలు కర్ణాటకలో తిష్టవేసి బీజేపికి అనుకూలంగా ప్రచారాలు చేసినా.. అక్కడి ఓటర్లు బీజేపి పార్టీకీ అధికారం అందని ద్రాక్షగా మార్చిరాని.. ఇంతగా ప్రచారం చేసినా.. తన సంఘాలు అన్ని ఏకమై ప్రజలను అర్థించినా.. తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మోజారిటీ రాకపోవడంతో ప్రధాని నరేంద్రమోడీలో అసహనం వ్యక్తమవుతుందని, దాంతోనే ఆయన తమ పార్టీపై దుమ్మెత్తిపోసే విధంగా వ్యాఖ్యలు చేశారని తృణముల్ కాంగ్రెస్ తిప్పికోట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles