Railway serious on vendor using toilet water in tea రైలులో బాత్రూమ్ చాయ్.. ఖరీదు రూ. లక్ష..

Railway serious on vendor using toilet water in tea fines rs 1 lakh

Secunderabad railway station, South Central Railway, toilet, Tea vendor, licence, tea vendor fined, tea vendor rs 1 lakh, charminar express, secundrabad-chennai train, viral video

In the video in circulation in social media in the past few days, a vendor was seen coming out of a train toilet with tea and coffee cans, conveying that water was mixed in the cans inside the toilet.

ITEMVIDEOS: రైలులో బాత్రూమ్ చాయ్.. ఖరీదు రూ. లక్ష..

Posted: 05/03/2018 03:34 PM IST
Railway serious on vendor using toilet water in tea fines rs 1 lakh

రైలులో బాత్రూమ్ చాయ్.. ఖరీదు రూ. లక్ష.. శీర్షక చూసి ఇదేం చాయ్.. వేరే పేర్లు దొరకలేదా.? బాత్రూమ్ ఛాయ్ అని పేరు పెడితే ఎవరైనా తాగుతారా.? గ్రీన్ టీ, లెమన్ టీ, బాదమ్ టీ తరహాలో బాత్రూమ్ టీ అని కూడా ఒకటుందని మీరు బావిస్తే.. మీరు టీలో కాలేసినట్లే. ఎందుకంటే ఇదీ మీరు భావిస్తున్నట్టుగా ఒక వైరటీ టీ కాదు కాబట్టి. మరీ బాత్రూమ్ టీ అన్నారు అంటే.. మ్యాటర్ లోకి ఎంటర్ అవ్వాల్సిందే. సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్లే చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలులో సంభవించిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సోషల్ మీడియా ద్వారా వైరల్ గా మారి ఎవరూ పిర్యాదు చేయకుండా.. అధికారులే విచారణ జరిపించి సదరు టీ కాంట్రాక్టరు లైసెన్సు రద్దు చేసి.. అతనికి ఏకంగా లక్ష రూపాయల జరిమానా కూడా విధించారు. డిసెంబర్ మాసంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ కోడుతూ నాలుగు నెలల తరువాత వైరల్ గా మారి తప్పుడు పనులు చేసిన కాంట్రాక్టర్ భరతం పట్టేలా చేసింది. ఇదంతా ఒకే కానీ అసలు విషయం ఏంటీ అంటారా.?

చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలు సికింద్రాబాదు నుంచి చెన్నైకి బయలుదేరుతున్న క్రమంలో ఓ టీ వెండర్.. టీ క్యానులను బాత్రూంలోకి తీసుకెళ్లి ఆ క్యానుల్లో బాత్రూంలోని నీటితో నింపుతూ పట్టుబడ్డాడు. టీ, కాఫీ తయారీ కోసం టాయిలెట్లలోని నీటిని కలుపుతున్నట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టాయిలెట్లలోని నీటిని క్యాన్లలో కలుపుతున్నట్టు అందులో కనిపిస్తోంది. దీనినంతా అక్కడే వున్న ఒక రైలు ప్రయాణికుడు తన మొబైల్ లో చిత్రీకరించాడు. బాత్రూంలోని టీ కాన్లను ఎందుకు తీసుకెళ్లారని, ఆ నీటిని ఎందుకు కలుపుతున్నారని కూడా నిలదీశాడు. అంతలో టీ వెండర్ అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నాడు.

అయితే వీరు తెలుగులోనే మాట్లాడుతున్నట్టు వీడియోలో స్పష్టంగా వినిపించడంతో ఇది తెలుగు రాష్ట్రాల్లోనే జరిగి ఉంటుందని భావించిన అధికారులు దీనిపై ఆరా తీశారు. ఈ వ్యవహారాన్ని దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) సీరియస్ గా తీసుకుని విచారించింది. గత కొద్ది రోజులుగా హల్ చల్ చేస్తున్న ఈ వీడియోతో రైల్వే శాఖ పనితీరుకు, అధికారుల అలసత్వానికి, వెండర్ల అక్రమార్జనకు, అత్యాశకు దర్పణం పడుతుందన్న కామెంట్లు కూడా పెద్దసంఖ్యలోనే వెల్లువెత్తాయి. దీంతో విచారణ చేసిన రైల్వే అధికారులు.. చర్యలు తీసుకున్నారు.
 
ఈ మేరకు వారు కూడా ఈ వీడియోపై స్పందిస్తూ.. ప్రకటన వెలువరించారు. ‘‘పూర్తి దర్యాప్తు చేపట్టి ఆ కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకున్నాం. వీడియోలో కనిపించిన వ్యక్తిని సికింద్రాబాద్-కాజీపేట్ సెక్షన్‌ టీ వెండార్ శివప్రసాద్‌‌గా గుర్తించాం. అతడి లైసెన్స్ రద్దు చేసి రూ. లక్ష జరిమానా విధించాం...’’ అని సీనియర్ రైల్వే అధికారి ఎం. ఉమాశంకర్ కుమార్ పేర్కొన్నారు. ఇందులో కనిపిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులు లైసెన్స్ లేకుండా టీ విక్రయాలు జరుపుతున్నారనీ.. వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కొద్ది నెలలుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో నిత్యం వివిధ స్థాయిల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : South Central Railway  toilet  Tea vendor  licence  rs 1 lakh  charminar express  viral video  

Other Articles