BJP wins only 70 seats in karnataka: RSS survey కర్ణాటకలో బీజేపి గెలిచేది 70 స్థానాలే: అరెస్సెస్ రిపోర్టు

Rss pre poll survey says bjp wins only 70 seats in karnataka

Siddaramaiah, PM Modi, Yeddyurappa, Janardhan Reddy, Amit Shah, Nagaraju, RSS pre-poll survey, Rahul Gandhi, Congress, BJP, RSS, JDS, Kumara Swamy, karnataka, politics

As per the RSS pre-poll survey, the BJP party would win between 60 and 70 seats in karnataka, where for the first time BJP was into power in south india.

కర్ణాటకలో బీజేపి గెలిచేది 70 స్థానాలే: అరెస్సెస్ రిపోర్టు

Posted: 05/03/2018 03:07 PM IST
Rss pre poll survey says bjp wins only 70 seats in karnataka

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విరివిగా పాల్గోని రాష్ట్రం మొత్తం చుట్టి పరిస్థితును తమకు అనుకూలంగా మార్చుకున్న బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. ఇక అదే బాధ్యతను తన భుజాలపై మోసేందుకు రాష్ట్ర పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీలకు ఆరెస్సెస్ షాకిచ్చింది. అత్యంత గోప్యంగా జరిగిన తమ సర్వేలో అంతర్గతంగా ఇచ్చిన నివేదిక ప్రకారం బీజేపి ఎంత శ్రమించినా.. ఎన్ని సభలను ఏర్పాటు చేసినా.. ఈ సారి ఎన్నికలలో చుక్కెదురు కావడం ఖాయని తేల్చింది. ఈ నెల 12న జరగనున్న ఎన్నికల్లో బీజేపీకి 70కి మించి ఒక్క సీటు కూడా రాదని ఆరెస్సెస్ నిర్వహించిన అంతర్గత సర్వేలో తేలింది.

ఈ సర్వే నివేదికను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు దక్షిణ భారత ప్రాంతీయ ప్రముఖ్ వి.నాగరాజు బెంగళూరులో అందజేశారు. అయితే వారి నివేదిక ప్రకారం.. బీజేపీకి 70, కాంగ్రెస్ కు 115-120, జేడీఎస్ కు 29-34 సీట్లు వచ్చే అవకాశం ఉందని నివేదికలో ఉండడాన్ని చూసి నేతలు కంగుతిన్నారు. దళితులు, బలహీన వర్గాల వారిని బీజేపీ ఆకర్షించలేకపోయిందని నివేదికలో పేర్కొన్నారు. అలాగే, అడ్డగోలుగా అక్రమాస్థులను సంపాదించిన మైనింగ్ రారాజులుగా వెలుగొందుతున్న గాలి సోదరులకు పార్టీ టికెట్లు ఇవ్వడం.. ప్రధాని మోడీ, అమిత్ షాలు అవినీతి గురించి మాట్లాడటం కూడా వ్యతిరేకతకు దారి తీసాయిన పేర్కోంది.

ఇక అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్న పెట్రో ధరలు, జీఎస్టీ, నిరుద్యోగ సమస్య.. తదితర అంశాలు బీజేపీ నుంచి ప్రజలను దూరం చేశాయని నివేదికలో పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికలపై మూడు నెలలుగా సర్వే నిర్వహిస్తున్న బీజేపీ దాని ప్రకారమే అభ్యర్థులకు టికెట్లు కేటాయించింది. అయినప్పటికీ తాజా నివేదిక నేతలకు మింగుడు పడడం లేదు. తాజాగా ఓ కన్నడ పత్రిక నిర్వహించిన సర్వేలోనూ బీజేపీ అధికారంలోకి రాదని తేలింది. ఈ కారణంగానే మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడను మచ్చిక చేసుకునేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Siddaramaiah  PM Modi  Yeddyurappa  Janardhan Reddy  Amit Shah  Nagaraju  RSS pre-poll survey  karnataka  politics  

Other Articles