After 2019, krishna will be called NTR district నారా లోకేష్ దత్తత గ్రామంలో రూ.50 లక్షల స్కామ్

Ys jagan announces ntr district if comes to power

NT Rama Rao, YS Jagan Mohan Reddy, krishna district, YSRCP, PrajaSankalpaYatra, neeru-chettu, Rs 50 crore scam, nara lokesh, andhra pradesh, politics

Giving ruling TDP a jolt, YSR Congress Party President President YS Jagan Mohan Reddy announced Krishna district will be named after NT Rama Rao, the former Andhra Pradesh Chief Minister and founder President of the TDP.

కృష్ణాను 'ఎన్టీఆర్' జిల్లాగా మారుస్తా: వైఎస్ జగన్

Posted: 04/30/2018 02:44 PM IST
Ys jagan announces ntr district if comes to power

కృష్ణా జిల్లాను ఎన్టీ రామారావు(ఎన్టీఆర్‌) జిల్లాగా మార్చుతామని వైసీపి అధ్యక్షుడు వైఎస్‌ జగన్ ప్రకటించారు. రామన్నపై వున్న అభిమానంతో ఆయన సొంతగ్రామం కృష్టా జిల్లాలో కొనసాగుతున్న ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నిమ్మకూరుకు చేరకున్న జగన్ ఈ మేరకు నందమూరి కుటుంబికుల మధ్య ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్‌ పేరును పెడతామని చెప్పారు. ఈ సందర్భంగా తమ గ్రామాభివృద్దికి సహకారం అందించాలని నందమూరి కుటుంబికులు జగన్ ను కోరగా, ఆయన గ్రామాభివృద్దితో పాటు ఈ మేరకు ప్రకటించారు.

ఈ సందర్బంగా ఎన్టీఆర్‌ జన్మస్థలం నిమ్మకూరును మంత్రి నారా లోకేష్ దత్తత తీసుకున్నారని, అయినా ఇక్కడ నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా రూ.50 లక్షల అవినీతి జరుగుతుందని ఎన్టీఆర్ బంధువులు, గ్రామస్థులు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. నీరు-చెట్టు పథకం కింద చెరువును 50 అడుగుల లోతు తవ్వుతున్నారని చెప్పారు. ఎనిమిదిన్నర లక్షల ఖర్చుతో చెరువును తవ్వుతూ.. తవ్విన మట్టి ఒక ట్రాక్టర్‌కు 350 రూపాయలు, లారీకి 600 రూపాయలకు అమ్ముకుని టీడీపీ నాయకులు అ‍క్రమాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొక్లెయిన్లతో మట్టి తవ్విన దృశ్యాలను వైఎస్‌ జగన్‌ చూపించారు.

నీరు చెట్టు పథకం పేరు చెప్పి 50 అడుగులు తవ్వి మట్టిని అమ్ముకుంటున్నారని.. ఇక లేబర్‌ను పెట్టి తవ్వించామని చెప్పి కాంట్రాక్టర్లు ప్రభుత్వం నుంచి డబ్బును తీసుకుంటూ.. వీరు మాత్రం ప్రోక్లేయినర్లతో చెరువును తవ్వేస్తున్నారని గ్రామస్థులు జగన్ దృష్టికి తీసుకువచ్చిరు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ సర్కారు అవినీతి ఎండగట్టారు. నిమ్మకూరుతో పాటు ఎన్టీఆర్ పేరును కృష్ణా జిల్లాకు పెడతామని జగన్ హామీ ఇచ్చారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిమ్మకూరును అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles