youths disrobing Jehanabad minor girl బిహార్లో మైనర్ బాలికపై సామూహిక లైంగికదాడి..

Video showing youths disrobing jehanabad minor girl goes viral

Viral Video, minor girl, shyam sundar singh, station house officer, nayyar hasnain khan, jehanabad video, Jehanabad viral video, Jehanabad molestation

Patna zonal IG Nayyar Hasnain Khan formed a special investigation team to probe an unverified video purportedly showing a group of eight youths assaulting, dragging and disrobing a minor girl in Jehanabad.

ITEMVIDEOS: బిహార్లో దారుణం.. మైనర్ బాలికపై సామూహిక లైంగికదాడి..

Posted: 04/30/2018 01:01 PM IST
Video showing youths disrobing jehanabad minor girl goes viral

బీహార్ లో మైనర్ బాలికపై దారుణం జరిగింది. పట్టపగలు నడిరోడ్డుపై బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు ఆరుగురు దుండగులు. బిహార్ లోని జెహానాబాద్‌లో నడిరోడ్డుపై మైనర్‌ బాలికపై ఆరుగురు యువకులు దాడికి పాల్పడ్డారు. అన్నా నన్ను వదిలేయండన్నా.. అన్నా నేను మీకేం అన్యాయం చేశానన్నా.. అన్నా నన్ను వదిలిపెట్టండన్నా అంటూ బాలిక చేస్తున్న అర్థనాథాలు కూడా ఆ మగమృగాళ్లను కదిలించలేకపోయాయి. మైనర్ బాలిక పట్ల దారుణంగా వ్యవహరించిన దుండగులు.. అమెను బట్టలూడదీసి పరుగెత్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో వాట్సాప్‌లో వైరల్‌గా మారింది.

ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు నలుగురు యువకులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. కాగా, సోషల్ మీడియాలో షేర్ అవుతోన్న ఈ వీడియోపై నెటిజన్లు భగ్గమన్నారు. సీనియర్‌ ఐపీఎస్ అధికారి నయ్యర్‌ హస్నైన్‌ ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. యువకులు వినియోగించిన బైక్‌ ద్వారా సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఇప్పటికే వీడియోను చిత్రీకరించిన ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. పరారీలోని ఇద్దరు యువకులను పట్టుకునేందుకు జెహానాబాద్ లో ప్రతి ఇంటిలో గాలిస్తున్నామని చెప్పారు. ఈ కేసులో నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles