chiranjeevi says congress can only give scs to AP కర్ణాటక ఎన్నికల ప్రచారానికి చిరంజీవి

Chiranjeevi says congress can only give scs to ap

chiranjeevi, General elections 2019, karnataka assembly elections, AP Special status, bjp, Congress, TDP, Chandrababu Naidu, YS Jagan, YSRCP, Narendra Modi, Andhra Pradesh, state bifurfication bill, parliament, election promises, politics

tollywood actor and rajya sabha member chiranjeevi once again says that congress party only can bring special status category to andhra pradesh.

కర్ణాటక ఎన్నికలలో స్టార్ క్యాంపెనర్ గా చిరంజీవి

Posted: 04/21/2018 08:26 PM IST
Chiranjeevi says congress can only give scs to ap

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయిన్ల జాబితాలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పేరు చోటుచేసుకుంది. కన్నడనాట తెలుగు ప్రజలు గణనీయంగా ఉండటంతో చిరంజీవి ప్రచారం పార్టీకి బాగా కలిసివస్తుందని కాంగ్రెస్ అధిష్ఠానం యోచనగా తెలుస్తోంది. క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ డి.శివకుమార్ శనివారం నాడు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేశారు.

22 మంది సీనియర్ నేతలు

కర్ణాటక ఎన్నికల ప్రచారబరిలో సహచర విపక్ష పార్టీలకు చెందిన స్టార్ క్యాంపెయినర్లను కూడా కాంగ్రెస్ ఈసారి ప్రచార బరిలోకి దింపుతుండటం విశేషం. కాంగ్రెస్‌ సారథ్యంలో ప్రతిపక్ష ఫ్రంట్ ఏర్పాటుకు కొద్దికాలంగా ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకోనుంది. కాంగ్రెస్ విడుదల చేసిన జాబితాలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ పేర్లు కూడా ఉన్నాయి. అలాగే 22 మంది కాంగ్రెస్ సీనియర్ నేతల పేర్లు కూడా ఖరారయ్యారు.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో పాటు గులాం నబీ ఆజాద్, సుశీల్ కుమార్ షిండే, ప్రియాదత్, జ్యోతిరాదిత్య సింధియా, శశిథరూర్, సచిన్ పైలట్, నవజ్యోత్ సింగ్ సిద్ధు, అశోక్ చవాన్. మహమ్మద్ అజారుద్దీన్, అశోక్ గెహ్లాట్, కుష్బూ, నగ్మా, సుచిత్రా దేవ్, రేణుకా చౌదరి, రణ్‌దీప్ సూర్జేవాలా, ఊమన్ చాందీ, అమిత్ దేశ్‌ముఖ్, రాజ్‌బబ్బర్, రమేష్ చెన్నితాల తదితరులున్నారు. 225 మంది సభ్యుల కర్ణాటక అసెంబ్లీకి మే 12న పోలింగ్ జరుగనుండగా, 15న ఫలితాలు వెలువడతాయి.

ఏపీకి ప్రత్యేకహోదా కాంగ్రెస్ తోనే సాధ్యం

కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అని, 2019లో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని చిరంజీవి అన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా నియమితుడైన గిడుగు రుద్రరాజు.. చిరంజీవిని హైదరాబాద్ లోని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా రుద్రరాజును అబినందించిన చిరంజీవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని, పార్టీలో కష్టపడి పనిచేసేవారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles