giriraj singh draws controversy on kathua rape case కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Giriraj singh draws controversy on kathua rape case

kathua case, hindus, union minister, defame, giriraj singh, bihar, jammu and kashmir, politics, crime, kathua rape case, kathua incident

Union Minister Giriraj Singh said as part of a sinister political design, attempts are being made to defame Hindus through the Kathua rape-murder case in Jammu and Kashmir.

కతువా ఘటనపై కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Posted: 04/21/2018 07:44 PM IST
Giriraj singh draws controversy on kathua rape case

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కోసమే తనకు మంత్రి పదవినిచ్చి తన క్యాబినెట్లో పెట్టుకున్నారా..? అని సందేహాలకు తెరతీసేట్లుగా కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వ్యవహరశైలి వుందన్న విమర్శలు ఎన్ని వచ్చినా.. వాటిని లక్ష్యపెట్టని పార్టీ, పాలక ప్రభుత్వం.. ఆయన చెబుతున్న దాంట్లో తప్పేముంది.? అన్ని ఓ వర్గంవారు ప్రశ్నించేట్లుగా చేస్తున్నాయి. అలాంటి మంత్రివర్యులు మరోమారు అత్యంత సున్నితమైన, యావత్ దేశం ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్న కఠువా రేప్ కేసు ఘటనపై కూడా మరోసారి నోటికి పనిచెప్పారు.

ఈ హత్యాచారం ద్వారా హిందువులను అప్రదిష్టపాలు చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాజకీయ గేమ్ ప్లాన్‌లో భాగంగానే ఈ కేసుపై రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌లోని కఠువా జిల్లాలో ఇటీవల కొందరు మానవ మృగాలు ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి తెగబడి, చంపేసి సమీప అడవుల్లో పడేశారు. ఈ దారుణంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాలు సైతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి. ఈ నేపథ్యంలో నిన్న బీహార్‌లోని తన సొంత నియోజక వర్గమైన నవాడాలో కేంద్రమంత్రి గిరిరాజ్ మాట్లాడుతూ...
 
‘‘కఠువా కేసుతో హిందువుల ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర జరిగింది. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు దేశాన్ని విడగొట్టేందుకు కుట్రపన్నారు. సెక్యులరిజం పేరట కొందరు హిందువులకు చెడ్డపేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు...’’ అని వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు స్వామి అసీమానందపై ‘‘హిందూ టెర్రర్’’ ముద్ర వేసేందుకు ప్రయత్నం చేశారనీ... ఇప్పుడు కఠువా కేసు పేరిట హిందువులను కించపర్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాగా కఠువా సామూహిక అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాననీ... నిందితులను తక్షణమే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kathua case  hindus  union minister  defame  giriraj singh  bihar  jammu and kashmir  politics  crime  

Other Articles