Yashwant Sinha quits BJP says democracy in danger బీజేపికి రాజీనామా ప్రకటించిన యశ్వంత్ సిన్హా..!

Former finance minister yashwant sinha quits bjp says democracy in danger

Yashwant Sinha, BJP, Resign, Amit Malviya, PM Modi, Amit Shah, Modi government, note ban, BJP, GST, patna, Bihar, Democracy, Politics

Former Union Minister Yashwant Sinha, who has been at loggerheads with the party leadership in recent years, announced on Saturday that he is quitting BJP.

బీజేపికి రాజీనామా ప్రకటించిన యశ్వంత్ సిన్హా..!

Posted: 04/21/2018 06:54 PM IST
Former finance minister yashwant sinha quits bjp says democracy in danger

బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా రెండు సీట్ల నుంచి ప్రస్తుతం మూడింట రెండొంతుల మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అనేక మంది సీనియర్ నేతల కృషి, పట్టుదల, నిబద్దత వున్నాయనడంలో సందేహమే లేదు. అయితే వారిలో కూడా అత్యంత కీలక పాత్ర పోషించి బీజేపి హాయంలో కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ఒకరు. కాగా ఆయన ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇక తాను పార్టీలో మనజాలలేని అసహనంతో బీజేపికి గుడ్‌బై చెప్పేశారు.

బీజేపిలో అప్పటి పార్టీ నేతలతో కలసి పనిచేసిన సోషల్ మీడియా సెల్ హెడ్ గా కొనసాగిన అమిత్ మాలవ్యా రాజీనామా చేసిన తరువాత.. గత ఒకక్కరుగా పార్టీ నేతలు, ఎంపీలు కూడా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దళిత ఎంపీలు పబ్లిక్ గా తమ జాతి కొసం ప్రధాని కానీ, పార్టీ కానీ చేసిందేమీ లేదని పబ్లిక్ గానే చెప్పడం.. కూడా చర్చలకు దారితీసింది. అప్పటి పరిస్థితులు ప్రస్తుత పార్టీలో లేవని మాలవ్యా కూడా అరోపించారు.

అయితే తాజాగా గత కొంతకాలంగా అసమ్మతి స్వరం వినిపిస్తున్న యశ్వంత్ సిన్హా.. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాను ఏ రాజకీయ  పార్టీలోనూ చేరబోననీ స్పష్టం చేసిన ఆయన.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇవాళ పాట్నాలో ప్రతిపక్షాలతో కలిసి నిర్వహించిన ఓ కార్యక్రమంలో యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ...
 
‘‘బీజేపీతో అనుబంధాన్ని తెగతెంపులు చేసుకుంటున్నట్టు ఇదే వేదికగా ప్రకటిస్తున్నాను. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ఇటీవల పార్లమెంటు సమావేశాలు తుడిచిపెట్టుకుపోవడానికి కేంద్రం వైఖరే కారణం. ప్రధాని మోదీ కనీసం ఒక్కసారైనా ప్రతిపక్షాలను పిలిచి ఎందుకు చర్చించలేకపోయారు..’’ అంటూ ఆయన నిలదీశారు. కాగా ఏప్రిల్ 21న కాంగ్రెస్ సహా బీజేపీయేతర పార్టీలతో తాను సమావేశం నిర్వహించనున్నాననీ... ప్రత్యమ్నాయ రాజకీయ వేదిక కోసం చర్చిస్తానని ఆయన ప్రకటించారు.
 
2016 నవంబర్ తర్వాత పెద్ద నోట్ల రద్దు సహా కేంద్రం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలపై ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రానికి వ్యతిరేకంగా ఆయన ఇటీవల ‘రాష్ట్ర మంచ్’ పేరుతో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు చేశారు. మరో బీజేపీ అసమ్మతి నేత శతృఘ్ను సిన్హా సహా పలువురు రాజకీయ ప్రముఖులు ఇందులో చేరారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ లో అనుసరించాల్సి వ్యూహంపై ‘రాష్ట్ర మంచ్’ వేదికగా నేతలు చర్చలు జరపనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yashwant Sinha  BJP  Resign  PM Modi  Amit Shah  note ban  BJP  GST  patna  Bihar  

Other Articles