Tripura governor backs CM Biplab Kumar Deb’s claims అంతర్జాల విషయంలో సీఎం వ్యాఖ్యలకు గవర్నర్ మద్దతు

Internet during the time of the mahabharata tripura governor agrees with cm

tripura, Tathagata Roy, Mahabharata, mahabharat, Biplab Kumar Dev, Internet, mahabharata, puranic period, divya shakthi, divya drishti, pushpaka vimanam, pushpaka ratha

Tripura's Governor Tathagata Roy today came out in support of the state chief minister's statements from yesterday that the internet and satellites existed during the period of the fictional epic Mahabhharata.ta

సీఎం వ్యాఖ్యలను సమర్థించిన గవర్నర్.. ఇంటర్నెట్ ఆ కాలానిదేనట..!

Posted: 04/18/2018 03:49 PM IST
Internet during the time of the mahabharata tripura governor agrees with cm

మహాభారత కాలం నాటికే ఇంటర్నెట్, ఉపగ్రహ వ్యవస్థ మనకు అందుబాటులో ఉందంటూ త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ చేసిన వ్యాఖ్యలపై నెట్ జనులు ఓ వైపు జోక్స్ పేలుతుండగా, ముఖ్యమంత్రి చెప్పిన విషయాల్లో నిజాలున్నాయని త్రిపుర గవర్నర్ తాతగతా రావు సమర్థించారు. ఓ వైపు ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాలు వేదికగా నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. త్రిపుర రాజధాని అగర్తాలాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను గవర్నర్ కూడా సమర్థించారు.

మహాభారత సంగ్రామంలో ఎప్పటికప్పుడు ఏంజరుగుతుందో సంజయుడు ధృతరాష్ట్రుడికి తెలియజేశాడని, అది ఇంటర్నెట్ వల్లే సాధ్యమైందని, ఈ టెక్నాలజీ అప్పట్లోనే అందుబాటులో ఉందనే విషయం మనకు తెలియలేదని అన్నారు. ఇంటర్నెట్ ను పాశ్చాత్యదేశాలు కనుగొన్నాయని భావించే ప్రతిఒక్కరూ లక్షల సంవత్సరాల క్రితమే ఈ టెక్నాలజీని భారత్ వినియోగించిందనే విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. ఇటువంటి దేశంలో జన్మించడం తనకు గర్వకారణంగా ఉందని, ఇంటర్నెట్ వంటి అద్భుత సాంకేతికతను దేశ ప్రజలకు మోదీ అందుబాటులోకి తెస్తున్నారని అన్నారు.

కాగా, ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు పలు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ‘తెలివి తక్కువ వ్యాఖ్యలు’, ‘మరి, ఆ కాలంలో ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే  పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడు ఎలా వెనక్కి రావాలో అడగలేదు ఎందుకుని?’ అంటూ ప్రశ్నించారు. అయితే ముఖ్యమంత్రి వ్యాఖ్యలను గవర్నర్ సమర్థించారు. పురాణాల్లో వున్న పుష్పక విమానం, పుష్ఫక రథం సహా పలువురు మహాపురుషులకు దివ్వదృష్టి కూడా వుండేదని అన్నారు. అయితే ఇంటర్నెట్, శాటిలైట్ అన్నవి వున్నాయని కాదు.. అంతకంటే దేదీప్యమైన సాంకేతికత వుండేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారని ఆయన మద్దతు పలికారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tripura  Tathagata Roy  Mahabharata  mahabharat  Biplab Kumar Dev  Internet  mahabharata  

Other Articles