pawan kalyan's brother Nagababu reacts to Sri Reddy's protest మెగా ఫ్యామిలీ జోలికి వస్తే తస్మాత్ జాగ్రత్తా: నాగబాబు వార్నింగ్

Don t take mega family s silence for granted warns pawan kalyan s brother nagababu

pawan kalyan, janasena, guntur, mangalagiri, security, gunmen, nagababu, casting couch, sri reddy, jeevitha rajashekar, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan's elder brother naga babu Nagababu has reacted to actress Sri Reddy's protest against casting couch in Tollywood. After the issue shocked many when sri reddy's abusive language toward Pawan Kalyan.

ITEMVIDEOS: మెగా ఫ్యామిలీ జోలికి వస్తే తస్మాత్ జాగ్రత్తా: నాగబాబు వార్నింగ్

Posted: 04/18/2018 03:05 PM IST
Don t take mega family s silence for granted warns pawan kalyan s brother nagababu

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై కొందరు అనవసరంగా పని గట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని, ఒకరి వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించే హక్కు వారికి ఎవరిచ్చారని ఆయన సోదరుడు, నటుడు నాగబాబు నిప్పులు చెరిగారు. ఏదైనా తప్పు చేసి ఉంటే ప్రజల ముందు బహిరంగంగా చెప్పే దమ్మున్న మగాడు తన సోదరుడని ఆయన పేర్కోన్నారు. ఆయన తప్పు చేస్తే.. దానిని పదిమందిలో అంగీకరించే ధమ్మున్నోడని, అంతేకానీ కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నంత అధైర్యవంతుడు కాదని చెప్పారు. అసలు ఈ ఆరోపణలు చేస్తున్న వారికి ఆ దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు.

ఈ ఉదయం ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన ఆయన తన తమ్ముడు పవన్ పై వస్తున్న విమర్శలపై బావోద్వేగానికి గురయ్యారు. ఆయన జనం కోసమని, రాష్ట్ర ప్రజలకు ఏమైనా చేయాలన్న కాంక్షతోనే పవన్ రాజకీయాల్లోకి వెళ్లాడని అరోపించారు. తన తమ్ముడు తనతో మాట్లాడి కనీసం ఆరు నెలలైందని.. అయినా తాను ఆయనను డిస్టర్బ్ చేయడం ఇష్టంలేక నిమ్మకున్నానని అన్నారు. కోట్ల రూపాయలను అర్జించే సినీమాను వదలి ప్రజల్లోకి వెళ్లాడని, వద్దని వారించినా మా మాట కూడా వినకుండా ప్రజలకు మనకు ఇంత చేశారు.. వారికి మనం ఏమైనా చేయాలన్న సదుద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వెళ్లడాని నాగబాబు ఉద్వేగభరితుడై ప్రశ్నించారు.

పవన్ సినీమాల్లో నంబర్ వన్ స్టార్. వాడిని అంటారా? వాడిని తిడతారా? ఆయనను విమర్శించాలంటే రాజకీయంగా ఏమైనా అనుకోవచ్చు.. కానీ వ్యక్తిగతంగా విమర్శిస్తారా.? అంటూ విరుచుకుపడ్డారు. తప్పు చేయని మనిషి అంటూ ఎవరూ ఉండరని, వ్యక్తిగతంగా ఎవరిని తవ్వినా దొరుకుతారని, కావాల్సింది అది కాదని అన్నారు. పవన్ నిశ్శబ్దాన్ని చేతగానితనంగా అనుకోవద్దని హెచ్చరించారు. విమర్శలు చేస్తున్న వారి వెనక ఎవరున్నారో తమకు తెలుసునని, అందరి ... తీరుస్తాడని అన్నారు. అతి త్వరలోనే ఇది జరుగుతుందని చెప్పారు. పవన్ ఎంత మంచి వ్యక్తి అంటే ఆయనను తిట్టినా, ఆయన తల్లిని తిట్టినా.. ఓర్పుతో సహనంతో సంయమనం పాటించిన వ్యక్తి పవన్ అని అన్నారు.

క్యాస్టింగ్ కౌచ్ అనేది ప్రపంచంలో అందరికీ తెలిసిన విషయమేనని, ఇప్పుడు కొత్తగా వచ్చిన అంశమేమీ కాదని అన్నారు. లేడీ ఆర్టిస్టులపై ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే ఫిర్యాదు చేయవచ్చని, దేశంలో చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని పోలిస్ స్టేషన్ కు వెళ్లి కేసులు పెట్టండని చెప్పడం కూడా తప్పా..? అని ఆయన ప్రశ్నించారు. మహిళలంటే తమకు ఎంతో గౌరవమని, తన కూతురుని కూడా సినీ పరిశ్రమలోకి తీసుకొచ్చానని అన్నారు. ‘మా’ అసోసియేషన్ లో ఉన్న సభ్యులకు న్యాయం చేయడం తమ బాధ్యతని, ‘మా’లో ఫ్రీ మెంబర్ షిప్ లేదని, తెలుగువారికే అవకాశాలివ్వాలని నిర్మాతలకు ‘మా’ చెప్పదని అన్నారు.

ఆర్టిస్ట్ లకు కనీస సౌకర్యాలు కల్పిస్తామని, సమస్యలను పరిష్కరిస్తామని నిర్మాతల మండలి హామీ ఇచ్చిందని నాగబాబు అన్నారు. ఫిల్మ్ చాంబర్ ప్రెసిడెంట్ కిరణ్ తో, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కేఎల్ నారాయణతో తాను మాట్లాడానని, ముఖ్యంగా మూడు విషయాలను వారితో ప్రస్తావించానని అన్నారు. క్యాస్టింగ్ కౌచ్, షూటింగ్ ఎన్విరాన్ మెంట్ లో ఆడవాళ్లకు కనీసం టాయిలెట్ సౌకర్యం, డ్రెస్ మార్చుకోవడానికి సౌకర్యాలు కల్పించాలని, కోఆర్డినేటర్ల ద్వారా కాకుండా ఆర్టిస్ట్ లకు నేరుగా డబ్బులందేలా ఓ ప్రణాళిక ఆలోచించాలని చెప్పానని అన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించారని, ఈ విషయమై వారం రోజుల్లో ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  nagababu  casting couch  sri reddy  jeevitha rajashekar  andhra pradesh  politics  

Other Articles