manmohan hits back modi advise to PM ప్రధాని ‘మౌన్ మోడీ’కి.. అదే నా సలహా: మన్మోహన్ సింగ్

Modi should follow the advice he gave me speak more manmohan singh

Bharatiya Janata Party, BJP, Kathua, Kathua rape, Manmohan Singh, Maunmohan, Maunmodi, Narendra Modi, Unnao, Unnao rape, BJP MLA, BJP ministers, Crime

By not speaking earlier, Singh said, the prime minister was suggesting that those responsible in Kathua and Unnao could get away without facing stern action.

ప్రధాని ‘మౌన్ మోడీ’కి.. అదే నా సలహా: మన్మోహన్ సింగ్

Posted: 04/18/2018 05:11 PM IST
Modi should follow the advice he gave me speak more manmohan singh

బాధ్యతలు మోయడం.. దేశంలో జరుగుతున్న ఘటనపై ఒక్కోసారి పాలకులు వ్యూహాత్మక మౌనాన్ని ప్రదర్శించడం కూడా వారి నాయకత్వ లక్షణాల్లో ఒకటి అని గుర్తెరిగిన వ్యక్తి మాజీ ప్రధాన మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్. అయితే తాను మౌనంగా వున్న సమయంలో మౌన్ మోహన్ సింగ్ అంటూ విమర్శలు చేసిన నేతలే.. ఆ పదవుల్లోకి వచ్చి వ్యూహాత్మక మౌనాన్ని ప్రదర్శిస్తే.. అప్పట్లో ఆయన తనపట్ల చేసిన విమర్శలనే ప్రస్తుతం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తే.. ఏం జరుగుతుందన్నది ప్రధాని నరేంద్రమోడీకి ఇవాళ అర్థమైవుంటుంది.

తనను మౌన్ మోహన్ సింగ్ అంటూ విమర్శించిన నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అప్పట్లో ఎంత నోచ్చుకున్నారో కానీ.. ప్రస్తుతం దేశంలో అమ్మాయిలపై చెలరేగుతున్న అఘాయిత్యాల వెనుక బీజేపి నేతలే వున్నారన్న వార్తలు రావడం.. ఉన్నావ్ ఘటనలో ఏకంగా బీజేపి ఎమ్మెల్యే. ఖతువా ఘటన వెనుక ఇద్దరు బీజేపి మంత్రులు వున్నారన్న విషయాలు వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా బీజేపి నేతలపై విమర్శలు కొనసాగుతున్నాయి. బాధిత బాలికకు, వారి కుటుంబానికి న్యాయం చేయాలన్న డిమాండ్ పై యావత్ భారతం నినదిస్తుంది.

ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు మౌనాన్ని పాటిస్తున్నారంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీఏ అధికారంలో ఉన్నపుడు తనకు మోదీ ఇచ్చిన సలహాను ఇప్పుడు ఆయనే పాటించాలన్నారు. తనను తరచూ మాట్లాడమంటూ మోదీ సలహా ఇచ్చేవారని, ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు కనుక ఆయన కూడా తరచూ మాట్లాడాలని మన్మోహన్ అన్నారు. కఠువా, ఉన్నావ్ అత్యాచార కేసుల విషయంలో మోదీ చాలా కాలం మౌనంగా ఉన్నారని.. ఇప్పటికైనా మౌనాన్ని వీడి మౌనమోడీ మాట్లాడాలని ఆయన సలహా ఇచ్చారు.
 
యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ తనను మౌన్-మోహన్ సింగ్ అనేవారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఆయన ఆ సలహాను తానే స్వయంగా పాటించాలన్నారు. తనను మోదీ విమర్శిస్తున్నట్లు తనకు మీడియా ద్వారా తెలిసేదన్నారు. కఠువా, ఉన్నావ్ అత్యాచారాలపై ఎట్టకేలకు మోదీ గత శుక్రవారం స్పందించడం హర్షణీయమన్నారు. ఇండియాస్ డాటర్స్‌కి న్యాయం జరుగుతుందని, నేరస్థులను వదిలిపెట్టేది లేదని చెప్పారని గమనించినట్లు తెలిపారు. తమ అనుచరులకు దారి చూపేందుకు వీలుగా అధికారంలో ఉన్నవాళ్ళు తప్పనిసరిగా సకాలంలో మాట్లాడాలనేది తన అభిప్రాయమని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Kathua rape  Manmohan Singh  Maunmohan  Maunmodi  Narendra Modi  Unnao rape  BJP MLA  BJP ministers  Crime  

Other Articles