తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి చెంపపెట్టులాంటి తీర్పునిచ్చింది రాష్ట్రోన్నత న్యాయస్థానం హైదరాబాద్ హైకోర్టు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంటకర్ రెడ్డి, సంపత్ కు ఊరటనిస్తూ ఇవాళ హైకోర్టు తీర్పును వెలువరించింది. సదరు సభ్యులు అసెంబ్లీలో దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ వారి శాసనసభ్యత్వాలను రద్దు చేస్తూ తెలంగాణ అసెంబ్లీ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ హైకోర్టు రద్దు చేసింది. తక్షణం కోమటిరెడ్డి, సంపత్ ల శాసనసభ్యత్వాలను పునరుద్ధరించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అదే విధంగా గతంలో ఉన్న అన్ని బెనిఫిట్స్ వర్తింపజేయాలని సూచించిన న్యాయస్థానం.. వారిని ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని ఆదేశించింది. కాగా, వీరి బహిష్కరణ కేసు విచారణ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని నివేదిక సమర్పించాలని కోరిన న్యాయస్థానం.. తీర్పును వెలువరించే క్రమంలో ఎన్నికల కమీషన్ ఇచ్చిన నివేదికను కూడా తోసిపుచ్చుతూ 169 పేజీల తీర్పును వెల్లడించింది. అయితే అసెంబ్లీలో ఎమ్మెల్యేల తీరుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని భావిస్తే తమ తీర్పు అడ్డంకి కాదని న్యాయమూర్తి జస్టిస్ బి.శివ శంకర్ రావు తీర్పును వెలువరించారు. ఈ మేరకు ఈ నెల 9నే తీర్పును రిజర్వు చేసిన న్యాయమూర్తి ఇవాళ తీర్పును వెలువరించారు.
తుది విడత బడ్జెట్ సమావేశాల ప్రారంభాన్ని పురస్కరించుకుని మార్చి 12న ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్ నరసింహన్ ప్రసంగాన్ని అడుకోవడంతో పాటు మైక్ విరిచి గవర్నర్ పైకి విసరి అనుచితంగా వ్యవహరించారు. ఆ మైక్ కాస్తా.. గవర్నర్ పక్కనున్న మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి తగిలి గాయం కావడంతో.. అస్పత్రికి తరలించి చికిత్సనందించారు. ఈ పరిణామాల క్రమంలో మార్చి 14వ తేదీన వీరిద్దరి శాసనసభ సభ్యత్వం రద్దు చేస్తూ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి నిర్ణయం తీసుకున్నారు. కాగా స్పీకర్ ఆదేశాలకు సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని అశ్రయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది.
హైకోర్టు తీర్పు.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టు..
టీఆర్ఎస్ ప్రభుత్వానికి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ పేర్కోన్నారు. ఈ విషయంపై డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ముఖ్యమంత్రికి ఏ మాత్రం సిగ్గున్నా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. టీఆర్ఎస్ సర్కారు ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తోందని, అసెంబ్లీలో తమకు ఇష్టం ఉన్న వారినే లోపలికి రానిస్తామనేలా వ్యవహరిస్తోందని డీకే అరుణ అన్నారు. ముఖ్యమంత్రికి అనేక సందర్భాల్లో హైకోర్టు మొట్టికాయలు కొట్టిందని, అయినప్పటికీ ఆయన తీరు మారడం లేదని ఆమె అన్నారు. తెలంగాణలో కేసీఆర్ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more