YSRCP MPs staging fast health condition serious క్షీణిస్తున్న వైసీపీ ఎంపీల అరోగ్యం.. 6వ రోజుకు అమరణ దీక్ష

Jagan mohan reddy lauds mps on indefinite hunger strike

Andhra Pradesh, YSR Congress Party, Y. S. Jaganmohan Reddy, Special Category Status, Telugu people, Y. S. Vijayamma, Kadapala Mohan Reddy, Mithun Reddy, Sumitra Mahajan, Y.S. Jagan Mohan Reddy, Subbareddy, Delhi, New Delhi, Lok Sabha speaker, Ram Manohar Lohia hospital, Avinash Reddy

YSRCP president Y.S. Jagan Mohan Reddy lauded the MPs who are on indefinite hunger strike demanding Special Category Status for the state after enquiring about the health and well being of the MPs, he said that the state is proud of them.

క్షీణిస్తున్న వైసీపీ ఎంపీల అరోగ్యం.. 6వ రోజుకు అమరణ దీక్ష

Posted: 04/11/2018 11:15 AM IST
Jagan mohan reddy lauds mps on indefinite hunger strike

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంతో పాటు విశాఖ రైల్వేజోన్, కడపలో స్టీలు ప్లాంటు సహా విభజన చట్టంలో పేర్కోన్న అన్ని డిమాండ్లను కేంద్రం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దేశరాజధాని ఢిల్లీలోని ఆంధ్రభవన్ వద్ద దీక్ష చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేల అమరణ నిరహారాదీక్ష ఆరవ రోజుకు చేరుకుంది. కాగా వీరి అరోగ్యం క్షీణిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వెంటనే వీరిని దీక్ష విరమించాలని కూడా సూచించారు. అయితే తమ డిమాండ్లపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తమ దీక్ష కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.

ఇప్పటికే సీనియర్ ఎంపీలు మేకపాటి, వరప్రసాద్ ల అరోగ్యం క్షీణించడంతో అస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కాగా ఆ తరువాత వైవీ సుబ్బారెడ్డి అరోగ్యం కూడా క్షీణించడంతో ఆయనను బలవంతంగా అసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువ ఎంపీలైన వైయస్ అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డిలు గత ఆరు రోజులుగా ఏలాంటి అహారం తీసుకోకుండా దీక్ష చేస్తున్నారు. దీంతో వారి  ఆరోగ్య పరిస్థితి విషమించింది.. వారి శరీరంలో కీటోన్ స్థాయి పెరిగింది. తక్షణం చికిత్సను అందించాల్సిన అవసరం వుంది.

ఈ యువ ఎంపీలలకు ఆరోగ్య పరీక్షలను నిర్వహించిన రామ్ మనోహర్ లోహియా ఆసుప్రతి వైద్యులు వారిని తక్షణం దీక్ష విరమించి.. వైద్య చికిత్సకు కదలాల్సిందిగా సూచించారు. అవినాష్ రెడ్డి, మిధున్ రెడ్డీల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. ఎంపీ అవినాష్ రెడ్డి రక్తపోటు స్థాయి 80/60కి పడిపోయింది. ఈ ఉదయం ఆయన బీపీ బ్లడ్ షుగర్ లను చెక్ చేసిన వైద్యులు, ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించుకుంటే ప్రాణాలకు ప్రమాదమని హెచ్చరించారు. ఆయన బ్లడ్ షుగర్ లెవెల్ సైతం 71కి పడిపోయింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని బలవంతంగానైనా ఆయన్ను ఆసుపత్రికి తరలించాలని ప్రయత్నాలు విఫలమయ్యాయి.
తాము దీక్షను విరమించేది లేదని అవినాష్ వెల్లడించారు. ఇదే సమయంలో మరో ఎంపీ మిధున్ రెడ్డి బీపీ 110/70గా ఉండగా, బ్లడ్ షుగర్ 73కు తగ్గింది. ఇద్దరి శరీరాల్లో కీటోన్స్ 2గా ఉన్నాయని పరీక్షలు చేసిన ఆర్ఎంఎల్ వైద్యులు వెల్లడించారు. ఇద్దరూ డీ హైడ్రేషన్ తో బాధపడుతున్నారని పోలీసులకు రిపోర్టు ఇచ్చారు. సమయం గడిచే కొద్దీ వీరి ఆరోగ్యం మరింత విషమిస్తుందని చెప్పారు.  అయితే యువ ఎంపీలు మాత్రం తమ దీక్షను విరమించేది లేదని, కేంద్రం నుంచి హామీ వచ్చిన తరువాతే తాము దీక్ష విరమిస్తామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles