Siddu's my man for CM again: Rahul Gandhi రూటు మార్చిన కాంగ్రెస్.. సీఎం అభ్యర్థిని ప్రకటించిన రాహుల్..

Siddaramaiah is the boss says rahul gandhi

Siddaramaiah, Rahul Gandhi, lingayats, karnataka CM, Congress, BJP, Jana Aashirvaada Yatra, yeddurappa, amit shah, PM Modi, bengaluru, karnataka, politics

AICC president Rahul Gandhi conveyed the message by stating that Siddaramaiah will continue as the chief minister if the party is voted to power in the state.

రూటు మార్చిన కాంగ్రెస్.. సీఎం అభ్యర్థిని ప్రకటించిన రాహుల్..

Posted: 04/09/2018 11:25 AM IST
Siddaramaiah is the boss says rahul gandhi

కర్ణాటకలో కాంగ్రెస్ బలం రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవలే ప్రీ ఫోల్ సర్వేలు నిర్వహించిన సంస్థలు పదింట ఏడుగురు కర్ణాటక ముఖ్యమంత్రిగా మరోమారు సిద్దరామయ్యనే కావాలని కోరుకుంటున్న క్రమంలో.. కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు కూడా పెరుగుతుంది. దీంతో అత్యంత తక్కువ సందర్భాలలో ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించే కాంగ్రెస్ పార్టీ.. కర్ణాటకలో మాత్రం తన రూటు మార్చింది. బెంగళూరులో పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలో ఈ సారి అధికారంలోకి వస్తే మళ్లి సిద్దరామయ్యనే తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించారు.

దేశవ్యాప్తంగా నరేంద్రమోడీకి వ్యతిరేక గాలులు వీస్తున్నాయని, గత ఎన్నికలు ముందు వినిపించిన నమో మంత్రి దేశంలో ఎక్కడా వినిపించడం లేదని కూడా అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో మోడీ తన సొంత లోక్ సభ నియోజకవర్గం నుంచి కూడా గెలుపోందలేని స్థితిలోకి వెళ్తారని, అక్కడ కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్సీ పార్టీలు ఒక్కటై పోటీ చేస్తాయని కూడా చెప్పారు. అయితే ఇందులో కొన్ని ఇబ్బందులున్నా.. త్వరలోనే అన్నీ పరిష్కారమవుతాయని రాహుల్ చెప్పారు. 2019 ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీకీ పూర్వవైభవం తిరిగి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇక ఇటు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీకి గెలుపు నల్లేరుపై నడక మాదిరిగానే సాగుతుంది. ఇప్పటికే సర్వేసంస్థలు వెల్లడించిన వివరాల్లో కాంగ్రెస్ బలంగా వుండగా, మరింతగా బలోపేతం అయ్యింది. అందుకు వీరశైవ లింగాయత్లకు ప్రత్యేక మత హోదా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడంతో.. లింగాయత్లు కూడా తమ మద్దతును రానున్న ఎన్నికలలో కాంగ్రెస్‌ ప్రకటించారు. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలంటూ లింగాయత్ ఫోరం తమ సామాజిక వర్గానికి పిలుపునిచ్చింది.

తమకు  మద్దతుగా నిలుస్తున్న వారికి తాము కూడా మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు చిత్రదుర్గ మురుగ మఠానికి చెందిన మఠాధిపతి శివమూర్తి మురుగ రాజేంద్రస్వామి తెలిపారు. తమ ఫోరం సభ్యులతో నిర్వహించిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ఇక లింగాయత్‌లు అందరూ కాంగ్రెస్‌కు, ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు బసవ ధర్మ పీఠానికి చెందిన మాథే మహాదేవి కూడా పేర్కొన్నారు. దాదాపు రాష్ట్ర జనాభాలో 17 శాతం ఉన్న లింగాయత్లు ప్రకటించడంతో ఇక కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక ఎన్నికలలో తిరుగేలేకుండా పోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Siddaramaiah  Rahul Gandhi  lingayats  karnataka CM  Congress  BJP  karnataka  politics  

Other Articles