Woman alleges rape by BJP MLA, attempts suicide outside CM residence ఎమ్మెల్యేపై రేప్ చేశాడని.. సీఎం ఇంటి ఎదుట మహిళ..

Woman alleges rape by bjp mla attempts suicide outside cm residence

Yogi Adityanath, Kuldeep Singh Sengar, Kuldip singh sengar, kuldip singh sengar rape, uttar pradesh chief minister, uttar pradesh, BJP MLA, Kuldeep Singh Sengar, Rape, GangRape, woman, attempts suicide, CM residence, uttar pradesh yogi adityanath, Crime

In a another shocking incident from UP, a woman tried to commit suicide outside the residence of UP CM in Lucknow. Her grouse is that the authorities have not acted against a BJP MLA who had allegedly raped her along with his brother.

ఎమ్మెల్యేపై రేప్ చేశాడని.. సీఎం ఇంటి ఎదుట మహిళ సజీవదహన యత్నం

Posted: 04/09/2018 10:53 AM IST
Woman alleges rape by bjp mla attempts suicide outside cm residence

ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి యోగి అధిత్యనాత్ ఇంటి ఎదుట ఓ మహిళ తన కుటుంబంతో పాటు చేరుకుని.. తన పిర్యాదును ఎవరూ పట్టించుకోవడం లేదని అరోపిస్తూ.. సజీవ దహనానికి యత్నించింది. సీఎం ఇంటి వద్దనున్న పోలీసు భద్రతా సిబ్బంది హుటాహుటిన స్పందించడంతో అమెను కాపాడగలిగారు. తన కుటుంబంతో పాటు సీఎం ఇంటి వద్దకు చేరకున్న మహిళ అత్మహత్యకు పాల్పడేందుకు కారణాలు వింటే విస్తుపోవాల్సిందే. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అధికారంలో వున్నవారు అన్నడమే తప్ప.. ఏడాదిగా బాధితురాలు తాను ఎదుర్కోన్న ఘటనపై పిర్యాదు చేస్తున్న పట్టించుకునే నాథుడే కరవయ్యాడు.

అందుకు కారణం.. చట్టసభకు ఎన్నికైన ఓ ఎమ్మెల్యే. అందులోనూ ఉత్తర్ ప్రదేశ్ లో అధికారంలో వున్న బీజేపి పార్టీకి చెందిన ఎమ్మెల్యే  కావడమే గమనార్హం. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. బీజేపీ ఎమ్మెల్యే కుల్ దీప్ సింగ్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించారు. ఏడాది క్రితం కుల్ దీప్ సింగ్, అతని సోదరుడితో కలసి తనపై అత్యాచారం చేశాడని, ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయింది. దీంతో స్వయంగా సీఎం యోగీ అధిత్యనాథ్ కు కూడా ఈ విషయాన్ని ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని బాధితురాలు వాపోయింది.

 ఈ సంఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైతే తనను, తన కుటుంబాన్ని చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని, తనకు న్యాయం జరగడం లేదని, ఈ వ్యవహారంలో సంబంధమున్న అందరినీ శిక్షించకపోతే తాను చచ్చిపోతానంటూ బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. కాగా, ఈ కేసుపై లక్నో జోన్ అదనపు డీజీపీ రాజీవ్ కిషన్ మాట్లాడుతూ,  ఈ వ్యవహారం ఇప్పటి వరకూ తేలకపోవడం వాస్తవమేనని అన్నారు. ఈ కేసును లక్నో న్యాయస్థానానికి అప్పగించారని, విచారణ జరిగితే గానీ ఎలాంటి చర్యలు తీసుకోలేమని తెలిపారు. బాధితురాలి కుటుంబంపై దాడి జరిగిన విషయమై తమకు ఫిర్యాదు అందిందని, దీనిపై విచారణ జరిపిస్తామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles