Indian parliament adjourned sine die అవిశ్వాస ఊసెత్తకుండా ముగిసిన బడ్జెట్ సమావేశాలు

Lok sabha adjourns sine die fails to take up no confidence notices

budget session 2018, parliament budget session 2018, lok sabha, lok sabha adjourned sine dine, lok sabha speaker, sumitra mahajan, lok sabha seats, present lok sabha secretary general, lok sabha intranet, members of lok sabha, parliament, venkaiah naidu

The Lok Sabha was today adjourned sine die with the House unable to take up notices for no-confidence motion against the government and bringing to close a tumultous Budget session that witnessed repeated disruptions.

అవిశ్వాస ఊసెత్తకుండా ముగిసిన బడ్జెట్ సమావేశాలు

Posted: 04/06/2018 12:49 PM IST
Lok sabha adjourns sine die fails to take up no confidence notices

పార్లమెంటులో అత్యంత కీలకమైన అవిశ్వాస తీర్మాణాలను వరుసగా గత 13 రోజులుగా పలు పార్టీలు ప్రవేశపెట్టి.. సభ్యులను కూడగట్టుకుని చర్చకోసం పట్టుబడుతున్నా.. వాటిపై ఎలాంటి ప్రకటన చేయకుండానే చివరి రోజు స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్ సభను వాయిదా వేశారు. మార్చి 5న ప్రారంభమైన మలివిడత సమావేశాల్లో పట్టుమని వారం రోజులు కూడా సభ సజావుగా సాగలేదు. తొలుత రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ విపక్ష పార్టీ వైసీపీ అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టగా, మరుసటి రోజున టీడీపీ ఆ తరువాత ప్రధాన ప్రతిపక్షం బ్యాంకుల స్కాములు, సీబీఎస్ఈ పేపర్ లీక్, ఎస్సీ, ఎస్టీ అంశాలు సహా పలు అంశాలపై అవిశ్వాస తీర్మాణాలను ప్రవేశపెట్టినా.. చివరి రోజున వీటిపై స్పీకర్ సభలో ఎలా వ్యవహరిస్తారోనని యావత్ దేశం ఉత్కంఠతో ఎదురుచూడగా, షరామామూలుగానే బడ్జెట్ సమావేశాలు కూడా విపక్ష సభ్యుల నిరసనల మధ్య ముగిసాయి.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల చివరి రోజున కూడా అన్నాడీఎంకే ఎంపీలు కావేరీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలంటూ ఆందోళన చేపట్టడంతో పాటు.. స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. సమావేశాల చివరిరోజు కావడంతో సభ్యులు సయంమనంతో ఉండి సభా నిర్వహణకు సహకరించాలని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కోరారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహాదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీలు కూడా కూడా అందోళన చేపట్టారు. దీంతో సభలో గంధరగోళం ఏర్పడింది. కాగా, స్పీకర్ సభ కార్యక్రమాలు జరిగిన వివరాలను సభ్యులకు తెలియజేశారు. అనంతరం జాతీయ గీతాన్ని అలపించిన తరువాత సభ్యలో మరోమారు గంధరగోళ వాతావరణం ఏర్పడటంతో స్పీకర్ బడ్జెట్ సమావేశాలు ముగిసాయని ప్రకటించారు.

వైసీపీ ఎంపీల రాజీనామా..

తమ అధినేత వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లుగానే ఆ పార్టీ లోక్ సభ సభ్యులు పార్లమెంటు సమావేశాలు ముగిసిన నేపథ్యంలో, ప్రత్యేక హోదాపై ఎలాంటి ప్రకటన చేయకుండగానే సభా కార్యక్రమాలను ముగించడానికి నిరసనగా, తమ పదవులకు రాజీనామాలు చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ ను ఆమె ఛాంబర్ లో కలసి తమ రాజీనామాలను సమర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, రాజీనామాలను ఉపసంహరించుకోవాలని, ఎంపీలుగా కొనసాగుతూనే పోరాటం చేయాలని సూచించారు. దీనికి సమాధానంగా వైసీపీ ఎంపీలు మాట్లాడుతూ, తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, రాష్ట్ర హక్కుల కోసం రాజీనామాలు చేస్తున్నామని చెప్పారు. అనంతరం వారు అక్కడ నుంచి ఏపీ భవన్ కు బయల్దేరారు. స్పెషల్ స్టేటస్ కోసం ఆమరణదీక్షను వారు చేపట్టనున్నారు.  

స్పీకర్ ఛాంబర్ లో టీడీపీ ఎంపీలు.. ఇలా బురిడీ కొట్టిస్తారా.. ?

టీడీపీ ఎంపీలను లోక్‌సభ స్పీకర్ కార్యాలయం తప్పుదారి పట్టించింది. లోక్‌సభ నిరవధిక వాయిదా పడిన వెంటనే టీడీపీ ఎంపీలు సభలో ఆందోళనకు దిగారు. ప్రధాని కూర్చునే కుర్చీ ముందు భైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో స్పీకర్‌ పిలుస్తున్నారని సెక్యూరిటీ సిబ్బంది చెప్పడంతో ఎంపీలు సభ నుంచి బయటకు వచ్చారు. ఎంపీలు బయటకు రాగానే వెంటనే సిబ్బంది లోక్‌సభ తలుపులను మూసివేశారు. మరోవైపు టీడీపీ ఎంపీలు రాకముందే స్పీకర్‌ సుమిత్రీమహాజన్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. స్పీకర్ కార్యాలయ సిబ్బంది తీరుకు నిరసనగా లోక్‌సభ స్పీకర్‌ ఆఫీసు ఎదుట టీడీపీ ఎంపీలు నిరసనకు దిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lok sabha  rajya sabha  sumitra mahajan  venkaiah naidu  congress  bjp  no- confidence motion  

Other Articles