మధ్యప్రదేశ్ ప్రభుత్వం మత గురువులుగా వెలుగొందుతున్న అయిదుగురు బాబాలకు రాష్ట్ర ప్రభుత్వం ‘సహాయ మంత్రి’ హోదా కల్పించడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. నర్మదా నదీ పరిరక్షణ పేరుతో జరుగుతున్న కుంభకోణాలను బయటపెట్టేందుకు, అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టాలని డిమాండ్ తో రథయాత్ర చేపడతామని బాబాలు ప్రకటించిన నేపథ్యంలో వారినే కమిటీ సభ్యులు ప్రకటించిన ప్రభుత్వం.. వారికి సహాయమంత్రి హోదాను ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. నర్మదానంద్ మహారాజ్, హరిహరానంద్ మహారాజ్, కంప్యూటర్ బాబా, భయ్యు మహారాజ్, పండిట్ యోగేంద్ర మహంత్ లకు ప్రభుత్వం ఈ హోదా కల్పించింది. వీర రథయాత్ర నేపథ్యంలో మార్చి 31న ప్రభుత్వం హడావిడిగా ఈ కమిటీని ఏర్పాటు చేసింది.
అయితే బాబాలకు మంత్రి హోదా ఇవ్వడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది. కేవలం బాబాలు రథయాత్ర చేస్తారన్న క్రమంలో ప్రభుత్వానికి నర్మదా నది పరిరక్షణ గుర్తుకువచ్చిందా..? అని ప్రశ్నిస్తోంది. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా చేసిందని, ఎన్నికల్లో బాబాల అనుచరుల మద్దతు కోసం వారికి ఈ హోదా కల్పించిందని ఆరోపిస్తోంది. ముఖ్యమంత్రి నర్మద పరిరక్షణ విస్మరించారని, ఆయన పాపాలను కడుక్కోవడానికి బాబాలకు మంత్రి హోదాలు ఇచ్చారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యూనిట్ అధికార ప్రతినిధి పంకజ్ చతుర్వేది విమర్శించారు.
ఇదిలావుండగా, రథయాత్ర చేపట్టాల్సిన అవసరం ఇక తమకు లేదని, ప్రభుత్వమే కమిటీని వేసిన క్రమంలో.. దాని పరిరక్షణ బాధ్యతల కమిటీలో తమను కూడా సభ్యులను చేసినందుకు గాను ఇక యాత్ర కాకుండా నదీ పరిరక్షణకు చర్యలు చేపడతామని అన్నారు. ఇక తనకు రాష్ట్రమంత్రి హోదా కల్పించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి కంప్యూటర్ బాబా కృతజ్ఞతలు తెలిపారు. కంప్యూటర్ బాబా సహా మొత్తం ఐదుగురు హిందూ సాధువులకు కేబినెట్ ర్యాంకు కల్పిస్తూ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై కంప్యూటర్ బాబా స్పందిస్తూ... ‘‘మాపై నమ్మకం ఉంచినందుకు సాధువుల సమాజం తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సమాజ శ్రేయోభివృద్ధి కోసం మా శాయశక్తులా ప్రయత్నిస్తాం...’’ అని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
May 24 | రీసెర్చ్ అసోసియేట్ పోస్టు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్). ఎంపికైన వారికి వార్షిక వేతనం రూ.12 లక్షల వరకు ఉంటుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS)... Read more
May 24 | పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ దేశరాజకీయాల్లోనే వినూత్నంగా తన మార్కు రాజకీయాలపై ముద్రవేశారు. తమ పార్టీ అధికారంలోకి రావడానికి మూలసూత్రమైన అవినితిపై రాజీలేని పోరాటం చేస్తామని.. ఈ విషయంలో తన, పర బేధాలకు కూడా... Read more
May 24 | నాగర్ కర్నూల్ జిల్లా మద్యం ప్రియుల అదృష్టం కలసివచ్చింది. తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న వారంలో.. నాగర్ కర్నూలుకు జిల్లా కేంద్రానికి సమీపంలో మందుబాబులకు మద్యంబాటిళ్లు ఉచితంగా లభించాయి. అదెలా... Read more
May 24 | వైద్యులు వృత్తిపరంగా ఎలాంటి నియమనిబంధనలు పాటించాలో పొందుపరుస్తూ తాజాగా జాతీయ మెడికల్ కమీషన్ ఓ ముసాయిదా నియమావళి-2022ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ముసాయిదా ప్రతిని వారికి సంబంధించిన ఓ వైబ్ సైట్లో పొందుపర్చింది. అంతేకాదు..... Read more
May 24 | అరకు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులకు వ్యతిరేకంగా మావోయిస్టులు హెచ్చరికలు జారీచేశారు. అరకు ఎంపీ జి.మాధవి చెట్టి ఫాల్గుణ, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిలకు వ్యతిరేకంగా మావోలు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులుగా శాసనసభకు, లోక్ సభకు ఎన్నికైన వీరు... Read more