Chandrababu busy in delhi meeting opposition leaders ఢిల్లీలో చంద్రబాబు బిజీ.. బిజీ.. జాతీయ నేతలతో వరుస భేటీలు..

Chandrababu busy in delhi meeting opposition leaders

Chandrababu Naidu, andhra pradesh CM, Andhra Pradesh special status, 2019 elections, PM Modi, Farroq abdullah, sharad pawar, veerappa moily, andhra pradesh, politicsChandrababu Naidu, andhra pradesh CM, Andhra Pradesh special status, 2019 elections, PM Modi, Farroq abdullah, sharad pawar, veerappa moily, andhra pradesh, politics

Andhra Pradesh chief minister N Chandrababu Naidu is busy meeting opposition leaders and national leaders in delhi after paying a tribute to mahatma gandhi in parliament.

ఢిల్లీలో చంద్రబాబు బిజీ.. బిజీ.. జాతీయ నేతలతో వరుస భేటీలు..

Posted: 04/03/2018 12:41 PM IST
Chandrababu busy in delhi meeting opposition leaders

ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ నేతలతో వరుసగా భేటీ అవుతూ బిజీగా గడుపుతున్నారు. ఉదయం పార్లమెంటుకు చేరుకున్న ఆయన ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి నమస్కరించి నివాళులర్పించారు. అనంతరం పార్లమెంటు ద్వారానికి నమస్కరించి లోనికి వెళ్లారు. ముందుగా పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలతో కలిసి చంద్రబాబు పుష్పాంజలి ఘటించారు. అనంతరం పార్లమెంటు ప్రధాన ద్వారం ముందు ఉన్న మెట్లకు నమస్కరించారు. పార్లమెంటులోనికి ప్రవేశిస్తూ.. ఇది ప్రజాస్వామ్య దేవాలయం అంటూ లోపలకి అడుగుపెట్టారు. పార్లమెంటు లోపలికి వచ్చిన చంద్రబాబు నేరుగా టీడీఎల్పీ కార్యాలయానికి వెళ్లారు.
 
అనంతరం పార్లమెంటులోని సెంట్రల్‌ హాల్‌లో వివిధ పార్టీల నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. వివిధ పార్టీల నేతలు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, వేణుగోపాల్‌, ఎన్‌సీపీ నేతలు సుప్రీయా సూలే లతో భేటీ అయ్యారు. ఆ తరువాత జమ్మూకాశ్మీర్ విపక్ష నేత ఫరూక్ అబ్దుల్లా తో పాటు కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా, వీరప్ప మొయిలీ, రాజీవ్ సాతీవ్, టీఆర్ఎస్ ఎంపీ జీతేందర్ రెడ్డితో పాటు తారిక్‌ అన్వర్‌, అనుప్రియ పటేల్‌, హర్ సిమ్రత్‌ కౌర్ బాదల్ తదితరులతో సమావేశమై చర్చించారు. విభజన చట్టం అమలుపై 72 పేజీల నివేదికను వారికి అందజేశారు.

విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేకహోదా సహా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతిచ్చిన పార్టీల నేతలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోనూ తమకు బాసటగా నిలవాలని వారికి విజ్ఞప్తి చేశారు. అన్నాడీఎంకే ఫ్లోర్ లీడర్ వేణుగోపాల్ తో మాట్లాడుతూ మనమంతా దక్షిణభారతీయులమని, ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణానికి మద్దుతు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన వేణుగోపాల్ తన పార్టీ అధిష్టానంతో భేటీ అయి తరువాత ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles