congress poll promise to farmers in advance రైతులకు గాలం వేస్తూ.. అప్పుడే హస్తం ఎన్నికల హామీలు..

Congress poll promise to farmers in advance

Telangana pcc chief, uttam kumar reddy, poll promise, farmers, congress. Rs. 2 lakh loan waive off, peasents

Telangana pcc president uttam kumar reddy gives advance poll promise to farmers from congress party, says if congress comes to power will waive off Rs. 2 lakh loan amount of peasents

రైతులకు గాలం వేస్తూ.. అప్పుడే హస్తం ఎన్నికల హామీలు..

Posted: 04/03/2018 11:51 AM IST
Congress poll promise to farmers in advance

దేశంలోనే సుదీర్ఘచరిత్రగల రాజకీయ పార్టీ గత సార్వత్రిక ఎన్నికలలో భాగంగా జరిగిన తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం తెలంగాణ ఇచ్చినా.. అధికారంలోకి మాత్రం రాలేకపోయింది. అయితే ఈ సారి మాత్రం ఖచ్చితంగా అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్.. ఎన్నికల సమరశంఖం పూరించడానికి ఇంకా చాలా సమయం వున్నప్పటికీ.. అప్పుడే తమ హామీలతో రాష్ట్ర రైతంగానికి గాలం వేస్తుంది. రైతులను తమ వైపుకు తిప్పుకుంటే తప్ప.. అధికారం తమకు అందదని భావిస్తున్న హస్తం నేతలు.. అప్పుడే వారిని అకర్షించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలను అప్పుడే రచించేసిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రైతలను అకర్షించేందుకు చేసిన ప్రకటన రైతులను కాంగ్రెస్ వైపు ఆకర్షించేలా చేస్తుంది. ప్రస్తుతం అధికారంలో వున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఏప్రిల్ నుంచి రైతులకు ఎకరానికి రూ.8 వేల రూపాయలను ఏఢాదికి అందిస్తూ.. దానిని పలు విడతలుగా అందిస్తామని ప్రకటించి.. అది కేవలం పంటలు వేసేందుకు విత్తనాలు, ఎరువుల కోసం అందిస్తున్నట్లు ప్రకటించగా, కాంగ్రెస్ ఏకంగా రుణమాఫీని అందుకుంది. తాము అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయల లోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫి చేస్తామని ప్రకటించారు.

కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా పెద్దపల్లిలో నిర్వహించిన సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డీ ఈ ప్రకటన చేయడంతో రైతాంగం అకర్షితులవుతుంది. ఈ సందర్భంగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ హయాంలో మహిళా సంఘాలకు అనేక పథకాల ద్వారా రుణాలు వచ్చాయని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తుందని, నిరుద్యోగ భృతి కింద ఆర్థిక సాయం కూడా ఇస్తుందని హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో విఫలమైందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు జైపాల్ రెడ్డి, జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, దానం నాగేందర్, పొన్నం ప్రభాకర్ సహా పలువురు నేతలు హాజరయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles