Petrol, diesel prices soaring, LPG prices slashed మండుతున్న ఇం‘ధనం’.. స్వల్పంగా తగ్గిన వంట గ్యాస్ ధరలు..

Petrol surges to four year peak diesel at all time high lpg prices slashed

Fuel price, reserve bank of india, PPAC, Petrol price, ioc, indian oil corporation, Diesel price, Arun Jaitley, LPG price cut, LPG prices, Non subsidised lpg, Subsidised lpg, Economy

The prices of LPG cylinders have been revised in metros – New Delhi, Kolkata, Mumbai, and Chennai. The oil marketing companies have reduced non-subsidised and subsidized LPG cylinder prices by Rs 35.50 and Rs 1.74, respectively. The new rates are effective from 1 April 2018.

మండుతున్న ఇం‘ధనం’.. స్వల్పంగా తగ్గిన వంట గ్యాస్ ధరలు..

Posted: 04/02/2018 04:51 PM IST
Petrol surges to four year peak diesel at all time high lpg prices slashed

కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత అంతర్జాతీయంగా ముడిచమురు ధరల తగ్గినా.. వాహనదారుల జేబులకు మాత్రం చిల్లు పడటం తప్పలేదు. పెట్రోల్ ధర ఏకంగా రూ. 80కు చేరినా.. అటు డీజిల్ ధర అల్ టైమ్ హైకి చేరింది. పెట్రోల్ ధర నాలుగేళ్ల గరిష్టానికి చేరినా ప్రభుత్వం వాహనదారులపై మాత్రం కరుణ చూపడం లేదు. అయితే అటు కేంద్రంతో పోటీ పడి మరీ వ్యాట్ ధరలను పెంచిన రాష్ట్రాలు కూడా ఇటు వ్యాట్ ధరలను తగ్గించకుండా, కేంద్రం విన్నపాలను పెడచెవిన పెట్టడంతో వాహనదారులకు మాత్రం వాత తప్పడం లేదు.

అసలు అంతర్జాతీయ మార్కెట్ కు అనుగూణంగా ధరల నియంత్రణ జరగడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. వాహనదారుల దృష్టి అసలు ఇంధన ధరలపై పడకుండా వుండేందుకు వీలుగానే కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను అంతకుముందున్న విధంగా నెలకు రెండు పర్యాయాలుగా సమీక్షించే విధానానికి స్వస్తి పలికి.. ఏకంగా రోజూవారి విధానంగా మార్చివేసిందన్న విమర్శలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.80కి చేరువలో వున్నా.. వాహనదారుల అసంతృప్తి కట్టలు తెంచుకునే వైపుకు వెళ్లకపోడానికి కూడా కారణం రోజువారి విధానమేనని తెలుస్తుంది.

అధికారంలోకి వచ్చిన తరువాత నరేంద్రమోడీ ప్రభుత్వం ఇప్పటికే తోమ్మిది పర్యాయాలు పెట్రోల్ ధరలు తగ్గినా వాటి ప్రతిఫలం వాహనదారులకు అందకుండా ఎక్సైజ్ డ్యూటీని పెంచిన విషయం తెలిసిందే. సుమారుగా 11.77 రూపాయల మేర ఎక్సైజ్ డ్యూటీని పెంచి పెట్రోల్ ధరను పెంచిన కేంద్రం.. అదే క్రమంలో రూ.13.47 మేర డీజిల్ ధరను కూడా పెంచింది. గత ఏడాది అక్టోబర్ మాసంలో మాత్రం నామమాత్రంగా రూ.2ను తగ్గించి.. ఇక రాష్ట్రాలు కూడా వ్యాట్ విధింపుపై పునరాలోచన చేయాలని విన్నవించింది. అయితే నాలుగు రాష్ట్రాలు మినహా బీజేపి పాలిత రాష్ట్రాలు కూడా కేంద్రం వినతిని బట్టదాఖలు చేశాయి.

ప్రతీ వాహనదారుడు తాను కొనుగోలు చేస్తున్న ఒక్క లీటరు పెట్రోల్ లో సుమారు 48.2 శాతం మేర డబ్బును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ పన్నుల రూపంలో చెల్లిస్తుండగా, ఇక డీజిల్ ధరల విషయంలో లీటరుపై 38.9 శాతం మేర ఎక్సైజ్, వ్యాట్ పన్నును చెల్లిస్తున్నారు వాహనదారులు. దీంతోనే కేంద్రం ఎక్సైజ్ శాఖ ఆదాయవనరులను 2014-15 నుంచి 2016-17కు రెట్టింపు చేసుకున్నాయని గణాంకాలు స్పషట్ం చేస్తున్నాయి. కేంద్ర ఎక్సైజ్ శాఖ ఆదాయం 2014-15లొ రూ. 99 వేల కోట్ల వుండగా, 2016-17లో ఏకంగా 2 లక్షలా 42 వేల కోట్లకు చేరిందంటే అది ఎక్సైజ్ డ్యూటీ పెంపు ప్రభావమే.

ఇదిలావుండగా, వంట గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త. అటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు నాలుగేళ్ల గరిష్టాన్ని తాకితే ఇటు వంట గ్యాస్‌ ధరలు దిగి వచ్చాయి. సబ్సిడీ LPG, నాన్‌ సబ్సిడీ వంటగ్యాస్ ధరలు తగ్గాయి. సబ్సిడీ సిలిండర్‌ రూ. 1.77 తగ్గగా, సబ్సిడీ లేని సిలిండర్‌ ధర (14.2 కిలోల) రూ.35.36 లు తగ్గింది. అన్ని మెట్రో నగరాల్లో ఏప్రిల్‌ 1 నుంచి ఈ తగ్గింపు ధరలు అమల్లో ఉంటాయి. ఈ సంవత్సరంలో ఇప్పటివరకూ సిలిండర్‌ ధరలను తగ్గించడం ఇది నాలుగవ సారి.

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్‌సైట్‌ అందించిన సమాచారం ప్రకారం వంటగ్యాస్ ధరలు ఇలా ఉన్నాయి.
నాన్‌ సబ్సిడీ సిలిండర్‌ ధర

ఢిల్లీ- రూ.653.5
కోలకతా – రూ.676
ముంబై – రూ.625
చెన్నై- రూ. 663.5
హైదరాబాద్‌ – 705.00

సబ్సిడీ సిలిండర్‌ ధర
ఢిల్లీ – రూ. 491.35
కోలకతా – రూ. 494.33
ముంబై – రూ. 489.04
చెన్నై- 479.44
హైదరాబాద్‌ – 489.50

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles