ఎస్సీ ఎస్టీ చట్టం అమలులో సవరణలు చేస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై భగ్గుమన్న దళిత సంఘాలు ఏకంగా భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. దక్షిణాది రాష్రాల్లో అధిక ప్రభావం చూపించని ఈ బంద్ పిలుపు ఉత్తరాధిలో మాత్రం నలుగుర్ని బలితీసుకుంది. ఎస్సీ, ఎస్టీ చట్టాన్నీ నిర్వీర్యం చేస్తూ.. తమ హక్కులు కాలరాస్తున్నారంటూ దళితులు చేపట్టిన ‘భారత్ బంద్’ హింసాత్మకంగా మారింది. మధ్యప్రదేశ్‌లో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణ కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని మొరేనాలో ఒకరు, భింద్ లో ఒకరు దుర్మరణం చెందగా... గ్వాలియర్‌లో మరొకరు మృతి చెందారు.
మొరేనాలో రాహుల్ పాతక్ అనే వ్యక్తి తన ఇంటి బాల్కనీలో నిలబడి ఉండగా... అదే ప్రాంతంలో ఆందోళన కారులు, పోలీసులకు మధ్య ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో ఓ బుల్లెట్ వెళ్లి రాహుల్ కి తగిలింది. తీవ్రంగా గాయపడిన అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. కాగా, భింద్‌లో ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో పోలీసులు ఆందోళన కారులపై కాల్పులు జరిపారు. దీంతో మహవీర్ రజావత్ అనే ఆందోళన కారుడు పోలీసుల జరిపిన కాల్పుల తూటాలకు బలయ్యాడు. ఇదే జిల్లాలోని మచ్చంద్‌లో జరిగిన ఘర్షణల్లో మహవీర్ కుష్వా అనే ఆందోళన కారుడు పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు.
గ్వాలియర్ లో జరిగిన కాల్పుల్లో మరోవ్యక్తి మృతిచెందాడు. ఇదే ప్రాంతంలో ఓ వ్యక్తి పిస్టల్ కాల్పులు జరుపుతూ కెమేరాకు చిక్కాడు. అయితే అతడి కాల్పుల్లోనే బాధితుడు మృతిచెందాడా లేదా అన్నది తెలియరాలేదు. గ్వాలియర్ ఘర్షణల్లో దాదాపు 19 మంది గాయపడగా... వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. అటు ఉత్తర ప్రదేశ్ లోని మీరట్, రాజస్థాన్ లోని బర్మార్ ప్రాంతాల్లో ఆందోళనకారులపై పోలీసులు ఉక్కుపాదం మోపేందుకు కర్ఫ్యూ ప్రకటించారు. అనేక చోట్ల 144సెక్షన్ విధించారు. పలు ప్రాంతాల్లో అందోళనకారులను కట్టడి చేసేందుకు టియర్ గ్యాస్ కూడా వినియోగించారు. అందోళనకారుల అగ్రహానికిప్రభుత్వ ఆస్తులు, వాహనాలకు కూడా ధ్వంసం, దహనమయ్యాయి.
కాగా దళితులపై అత్యాచారాలు, వేధింపుల నిరోధానికి ఉద్దేశించిన ఎస్సీ ఎస్సీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారంటూ ఆందోళన వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఎస్సీ ఎస్టీ చట్టం ‘‘దుర్వినియోగం’’ అవుతున్నందున.. తక్షణ అరెస్టులు చేయరాదంటూ ఇటీవల సుప్రీం పేర్కొన్న సంగతి తెలిసిందే. డీఎస్పీ స్థాయి అధికారి ప్రాథమిక దర్యాప్తు అనంతరమే నిందితులను అరెస్టు చేయాలని... ఒకవేళ ఉద్యోగులపై ఆరోపణలు వస్తే సంబంధిత అధికారి నుంచి ఉత్తర్వులు పొందాకే ప్రాసిక్యూట్ చేయాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.
బంద్ పిలుపు నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలను చేపట్టాల్సిన కేంద్రం కూడా తాత్సార ధోరణి అవలంబించడంతో భారత్ బంద్ హింసాత్మక రూపం దాల్చిందన్న విమర్శలు కూడా తెరపైకి వస్తున్నాయి. కాగా, ఎస్సీ, ఎస్టీ ప్రొటక్షన్ యాక్ట్‌పై సుప్రీం తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ మోదీ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. బంద్ లో ఆందోళనకారులు ఎలాంటి హింసాత్మక చర్యలకు దిగవద్దని కోరారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొనే అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవద్దని, ఉన్నతాధికారులు అనుమతి తీసుకునే చర్యలకు ఉపక్రమించాలని సుప్రీంకోర్టు గత మార్చి 20న తీర్పుపై రివ్యూ పిటీషన్ దాఖలు చేయడంలో కేంద్రం అవలంబించిన తాత్సర ధోరణే హింసకు కారణమైందన్న విమర్శలూ వున్నాయి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more