Parents, students protest against CBSE retests సీబీఎస్ఈ పేపర్ లీక్: విద్యార్థుల ధర్నా.. కేంద్రమంత్రి ఇంటివద్ద ఆంక్షలు..

Students parents protest against retest outside cbse office

Rahul Gandhi, rahul gandhi twitter, Prime Minister Narendra Modi, Exam Warriors, CBSE, Question papers leaked, Prakash javdekar, cbse exam, ministry of hrd, cbse retest, cbse office panchkula, cbse paper leak, class 10 maths paper, class 12 eco paper, latest news

A day after the Central Board of Secondary Education ordered a retest of the Class X mathematics and Class XII economics papers, students of several schools and their parents assembled at the CBSE office, in protest against the decision to hold the exams again.

సీబీఎస్ఈ పేపర్ లీక్: విద్యార్థుల ధర్నా.. కేంద్రమంత్రి ఇంటివద్ద ఆంక్షలు..

Posted: 03/30/2018 06:02 PM IST
Students parents protest against retest outside cbse office

సీబీఎస్ఈ పరీక్ష పేపర్ల లీకేజీ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్నే లేపుతోంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళన బాటపట్టాయి. పంచకుల సీబీఎస్ఈ కార్యాలయం నుంచి అటు పంజాబ్, హర్యానా ఇలా రాష్ట్రాలవారిగా విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలసి అందోళనకు దిగారు. మళ్లీ పరీక్షలు రాయాలంటూ సీబీఎస్ఈ నుంచి సంకేతాలు వస్తున్న క్రమంలో తాము పరీక్షలను రాయబోమని తెగేసి చెబుతున్నారు. పరీక్షల ప్రశ్నాపత్రాల లీక్ బాధ్యతను సీబీఎస్ఈ అధికారులు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకు విద్యార్థులందరికీ మరోమారు పరీక్షలు నిర్వహించి వారికి శిక్ష్ వేస్తారా అని ప్రశ్నిస్తున్నాయి.

ఇక సరిగ్గా దేశంలో లీకుల ప్రహసనం కొనసాగుతన్న క్రమంలోనే ఈ సీబీఎస్ఈ పేపర్లు కూడా లీక్ కావడంతో ఇటు రాజకీయంగాను కేంద్రంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఢిల్లీలోని సీబీఎస్ఈ కార్యలయం వద్ద పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో వచ్చి అందోళన కార్యక్రమాలను చేయడంతో.. అప్రమత్తమై కేంద్రప్రభుత్వం.. సంబంధిత కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇంటి వద్ద భద్రత పెంచారు.  తల్లిదండ్రులు, విద్యార్థులు అటుగా రానీయకుండా ముందుస్తు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నివాసం వద్ద 144 సెక్షన్ విధించారు.

సీబీఎస్ఈ నిర్వహించే రీఎగ్జామ్ ను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బహిష్కరించాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే పిలుపునిచ్చారు. ప్రశ్నాపత్రాలు లీక్ కావడానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తమ తప్పును ఒప్పుకోకుండా... రీఎగ్జామ్ పేరుతో విద్యార్థులను మరిన్ని కష్టాలకు గురి చేసేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రశ్నాపత్రాలను కాపాడలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన ఎద్దేవా చేశారు. తాము చేసిన తప్పుకు విద్యార్థులు ఎందుకు శిక్షను అనుభవించాలని ప్రశ్నించారు. రీఎగ్జామ్ రాయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరాదని... ఇప్పుడు తల వంచితే... భవిష్యత్తులో మరెన్నో సార్లు ఇలాగే తల వంచాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
 
ఈ వ్యవహారంలో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ను కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. మంత్రి వైఫల్యం వల్లనే ఈ అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపించింది. పేపర్ లీక్ వల్ల 28 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్జే అన్నారు. ఇధి చాలా ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ అంశాన్ని తాము పార్లమెంటులో లేవనెత్తుతాయని ఆయన పేర్కొన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో తక్షణ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌పై పలువురు విద్యార్థులు, యువజన కాంగ్రెస్ నేతలు ఢిల్లోలో పలుచోట్ల శుక్రవారంనాడు నిరసనలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles